Davos Summit 2026: భారత్‌పై 25% టారిఫ్‌ల ఎత్తివేతకు సిద్ధమవుతున్న అమెరికా.. కానీ ఆ నిబంధన తప్పనిసరి..!! Singarenni Controversy: సింగరేణి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు సహించం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క..!! Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం అంతం మొదలైందా... పాకిస్థాన్‌లో వరుస పేలుళ్లు! Andhra Pradesh Clean Mission: స్వచ్ఛాంధ్ర ఒక ఉద్యమం.. ప్రభుత్వ కార్యక్రమం కాదు: నగరిలో సీఎం చంద్రబాబు స్పష్టం..!! సింగపూర్‌లో మెరవనున్న 'ఏపీ హస్తకళలు'.. లేపాక్షి గిఫ్ట్ బాక్సులకు భారీ ఆర్డర్.. మంత్రి హర్షం! Home Minister Anita: చిన్న పొరపాట్లతో జీవితాలు నాశనం చేసుకోకండి... విద్యార్థులకు హోంమంత్రి సూచన! RTIతో బయటపడ్డ సంచలన నిజాలు! నెలకు 9 వేల కు పైగా ఫోన్ ట్యాపింగ్ లు... బిగుస్తున్న ఉచ్చు! Water Politics: బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించబోతున్న 'వాటర్ పాలిటిక్స్'! Praja Vedika: నేడు (24/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! APTS Sakatala rally: విద్య, ఐటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు... శకటాల ర్యాలీలో లోకేష్ పాలన ప్రతిబింబం! Davos Summit 2026: భారత్‌పై 25% టారిఫ్‌ల ఎత్తివేతకు సిద్ధమవుతున్న అమెరికా.. కానీ ఆ నిబంధన తప్పనిసరి..!! Singarenni Controversy: సింగరేణి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు సహించం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క..!! Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం అంతం మొదలైందా... పాకిస్థాన్‌లో వరుస పేలుళ్లు! Andhra Pradesh Clean Mission: స్వచ్ఛాంధ్ర ఒక ఉద్యమం.. ప్రభుత్వ కార్యక్రమం కాదు: నగరిలో సీఎం చంద్రబాబు స్పష్టం..!! సింగపూర్‌లో మెరవనున్న 'ఏపీ హస్తకళలు'.. లేపాక్షి గిఫ్ట్ బాక్సులకు భారీ ఆర్డర్.. మంత్రి హర్షం! Home Minister Anita: చిన్న పొరపాట్లతో జీవితాలు నాశనం చేసుకోకండి... విద్యార్థులకు హోంమంత్రి సూచన! RTIతో బయటపడ్డ సంచలన నిజాలు! నెలకు 9 వేల కు పైగా ఫోన్ ట్యాపింగ్ లు... బిగుస్తున్న ఉచ్చు! Water Politics: బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించబోతున్న 'వాటర్ పాలిటిక్స్'! Praja Vedika: నేడు (24/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! APTS Sakatala rally: విద్య, ఐటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు... శకటాల ర్యాలీలో లోకేష్ పాలన ప్రతిబింబం!

ఏపీలో 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' యుగం.. 2035 నాటికి 'డే-జీరో రెడీ స్టేట్'గా ఆంధ్రప్రదేశ్!

దావోస్ వేదికగా మంత్రి నారా లోకేశ్ సంచలన ప్రకటన.. వారాల వ్యవధిలోనే ప్రాజెక్టులకు అనుమతులు.. 'నాలా' చట్టం రద్దుతో పారిశ్రామిక విప్లవం. పెట్టుబడిదారులకు 'సమయమే అతిపెద్ద లాభం'. 50కి పైగా పాలనా సంస్కరణలు.

2026-01-22 21:47:00
Higher taxes: తమపై పన్నులు పెంచాలంటున్న సంపన్నులు.. దావోస్‌లో హాట్ టాపిక్!

ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లోని దావోస్ మంచు కొండల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మంత్రం మారుమోగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా, రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పెట్టుబడిదారులను ఆకర్షించడంలో సరికొత్త పంథాను అనుసరిస్తున్నారు. "మమ్మల్ని నమ్మండి.. మేము వేగంగా స్పందిస్తాం" అనే నినాదంతో అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను ఏపీ వైపు తిప్పుకుంటున్నారు. దావోస్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో లోకేశ్ ప్రసంగించిన తీరు, ఆయన వెల్లడించిన లక్ష్యాలు రాష్ట్ర పారిశ్రామిక భవిష్యత్తుపై అపారమైన నమ్మకాన్ని కలిగిస్తున్నాయి.

Alaska Greenland: అలాస్కా తర్వాత గ్రీన్లాండ్.. ఒక దేశం మరో దేశ భూభాగాన్ని కొనగలదా!

గతంలో వ్యాపారం చేయడం ఎంత సులభం (Ease) అనే దానిపైనే దృష్టి ఉండేది. కానీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం 'వేగం' (Speed) అనే అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుంది. "పెట్టుబడిదారులు తమ ప్రాజెక్టును ఎంత వేగంగా ప్రారంభించగలిగితే, వారికి అంత ఎక్కువ లాభం చేకూరుతుంది. ఆ సమయాన్ని ఆదా చేయడమే మా బాధ్యత" అని లోకేశ్ స్పష్టం చేశారు. 

AP Government: ఏపీలో వారందరికి శుభవార్త..! రూ. 60 కోట్ల ఇన్సెంటివ్‌లు విడుదల!

గతంలో భూమి కేటాయింపు తర్వాతే పర్యావరణ అనుమతులు, ఆ తర్వాతే యుటిలిటీస్ వచ్చేవి. కానీ ఇప్పుడు ఏపీలో 'ప్యారలల్ ప్రాసెసింగ్' విధానాన్ని ప్రవేశపెట్టారు. అంటే అన్ని రకాల అనుమతులు ఒకే సమయంలో (Parallelly) ముందుకు సాగుతాయి. దీనివల్ల నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఉండదు.

Pink paper: బంగారు నగలను పింక్ పేపర్‌లో ఎందుకు చుట్టుతారు.. దీని వెనుక ఉన్న శాస్త్రీయ నిజాలు!

'డే-జీరో రెడీ స్టేట్' అంటే ఏమిటి?
2035 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను 'డే-జీరో రెడీ స్టేట్' (Day-Zero Ready State) గా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒక కంపెనీ ఏపీలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్న కొన్ని వారాల్లోనే క్షేత్రస్థాయిలో పనులు (Ground breaking) మొదలవ్వాలి. నిర్ణయాలు అనేవి వ్యక్తుల ఇష్టానుసారం కాకుండా, పటిష్టమైన డిజిటల్ వ్యవస్థ ఆధారంగా జరుగుతాయి. యూనిఫైడ్ డిజిటల్ గవర్నెన్స్ ద్వారా ఎక్కడైనా ఫైల్ ఆగిపోతే, దాన్ని వెంటనే గుర్తించి అవరోధాలను తొలగించేలా వ్యవస్థను సిద్ధం చేశారు.

Nara Lokesh: దావోస్ వేదికగా తెలుగు రాష్ట్రాల ఐక్యత…! రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్!

పరిపాలనలో జాప్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం గత 18 నెలల్లో విప్లవాత్మక మార్పులు చేపట్టింది. పారిశ్రామిక అవసరాల కోసం భూ వినియోగ మార్పిడి (Conversion) ప్రక్రియను సులభతరం చేస్తూ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. చిన్న చిన్న సాంకేతిక లోపాలకు క్రిమినల్ కేసులు పెట్టకుండా, జరిమానాలతో సరిపెట్టేలా నిబంధనలను సవరిస్తున్నారు. దీనివల్ల పారిశ్రామికవేత్తల్లో అనవసర భయం పోతుంది. తక్కువ రిస్క్ ఉన్న పరిశ్రమలకు వెంటనే అనుమతులు ఇచ్చేలా, అధిక ప్రభావం చూపే ప్రాజెక్టులను మాత్రమే లోతుగా పరిశీలించేలా కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించారు.

Rohit Sharma: ఇది డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అవుతుంది.. రోహిత్ శర్మ!

ఎంఎస్ఎంఈ ఆధారిత వృద్ధి
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని కొన్ని నగరాలకే పరిమితం చేయకుండా, అన్ని ప్రాంతాలకు విస్తరింపజేస్తున్నామని లోకేశ్ తెలిపారు. ఇందులో భాగంగా 175 నియోజకవర్గాల్లోనూ ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ప్రతి జిల్లాలో ఎంఎస్ఎంఈ ఆధారిత వృద్ధి ద్వారా ఉద్యోగాలు, ఆదాయం, సంపద సమానంగా పంపిణీ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి పార్కును స్థానిక వనరుల ఆధారంగా, అగ్రో-ప్రాసెసింగ్, సముద్ర ఉత్పత్తులు, టెక్స్‌టైల్స్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల కోసం ప్రత్యేక క్లస్టర్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. ఇది వలసలను తగ్గించడంతో పాటు, పెద్ద పరిశ్రమలకు సరఫరా వ్యవస్థను బలోపేతం చేస్తుందన్నారు.

పరిశ్రమలకు వేగవంతమైన అనుమతులు, నాణ్యమైన మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించడమే ఏపీ ప్రత్యేకత అని లోకేశ్ అన్నారు. విధానాల స్థిరత్వం, సంస్థల విశ్వసనీయతతో పెట్టుబడిదారులకు భరోసా కల్పిస్తున్నామన్నారు. నమ్మకం, వేగం రెండూ కలిసి ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పోటీ వాతావరణంలో ఒక ప్రత్యేక పెట్టుబడి గమ్యస్థానంగా నిలబెడుతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కెర్నీ సీనియర్ పార్టనర్ సుకేతు గాంధీ, గూగుల్ ఏసియా-పసిఫిక్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా, కాగ్నిజెంట్ గ్లోబల్ సీఎఫ్ఓ జతిన్ దలాల్, రెన్యూ ఛైర్మన్ సుమంత్ సిన్హా తదితరులు పాల్గొన్నారు.

Naini Coal Mine: బిడ్డింగ్ మొదలుకాకముందే షాక్..! నైనీ కోల్ మైన్ టెండర్లు క్యాన్సిల్!

మంత్రి లోకేశ్ తన పర్యటన ద్వారా ఏపీని పెట్టుబడులకు 'ఫాస్ట్ లేన్'గా మార్చారు. నమ్మకం, వేగం అనే పునాదులపై నిర్మిస్తున్న ఈ కొత్త పారిశ్రామిక విధానం రాష్ట్ర యువతకు లక్షలాది ఉద్యోగ అవకాశాలను తీసుకురావడమే కాకుండా, 2035 నాటికి ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలపనుంది.

Accident: జమ్మూకశ్మీర్‌లో ఘోర విషాదం…! లోయలో పడిన ఆర్మీ వాహనం, 10 మంది సైనికుల మృతి!
విశాఖ సముద్ర గర్భంలో అద్భుతం: స్కూబా డైవర్ల కంటపడ్డ అరుదైన 'వేల్ షార్క్'!
కరాటే కళ్యాణిపై దాడి.. కటకటాల్లో ఆ యూట్యూబర్‌..
PhonePay: లోన్ కావాలా? ఫోన్‌పే ఓపెన్ చేయండి…! నిమిషాల్లో డబ్బు అకౌంట్‌లో!
మేడారం జాతరకు హెలికాప్టర్ సందడి.. భక్తులకు పర్యాటక శాఖ గిఫ్ట్.! ఆకాశం నుంచి సమ్మక్క-సారలమ్మ దర్శనం!
బాక్సాఫీస్ వద్ద రూ. 1300 కోట్ల విధ్వంసం.. ఓటీటీలోకి వచ్చేస్తున్న రణ్ వీర్ సింగ్ ‘ధురంధర్’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

Spotlight

Read More →