Chandrababu: ఏపీలో తొలిసారి 'సాగునీటి క్యాలెండర్' ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు! Amit Shah: 2047 నాటికి మాదకద్రవ్య రహిత భారత్‌ను సాధించాలనేదే జాతీయ లక్ష్యం.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు! Vijay movie: రాజకీయాల కంటే అభిమానుల ప్రేమే మిన్న: 'జన నాయగన్' టైటిల్‌పై సీఎం విజయ్ కీలక నిర్ణయం! Free Education: వారి చదువుల బాధ్యత తీసుకున్న జనసేనాని! ఉచిత విద్యకు ముందుకొచ్చిన ప్రముఖ విద్యాసంస్థలు! Minister Narayana: విశాఖ ఘటనపై అప్రమత్తమైన ప్రభుత్వం.. స్టెరిలైజేషన్ వేగవంతం చేయాలన్న మంత్రి నారాయణ! Tirupati: భూమన అభినయరెడ్డి అరెస్ట్‌ చేయాలంటూ తిరుపతిలో మహిళల ఆందోళన! Semi Ring Road: ఉత్తరాంధ్రకు ‘సెమీ రింగ్‌’ శోభ... రూ. 4,450 కోట్లతో 102 కిలోమీటర్ల మేర సరికొత్త ఎక్స్‌ప్రెస్‌వే!! Praja Vedika: నేడు (16/05) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Railway Station: ఏపీలో ఆ రైల్వేస్టేషన్‌కు మహర్దశ... ద్వారకా తిరుమల గాలిగోపురం ఆకృతిలో ముఖద్వారం! TDP: వైసీపీ హయాంలో ప్రజాధనం దుర్వినియోగం.. ఇప్పుడు పొదుపుపై మాట్లాడటం విడ్డూరం.. టీడీపీ నేత శ్రీనివాస్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు! Chandrababu: ఏపీలో తొలిసారి 'సాగునీటి క్యాలెండర్' ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు! Amit Shah: 2047 నాటికి మాదకద్రవ్య రహిత భారత్‌ను సాధించాలనేదే జాతీయ లక్ష్యం.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు! Vijay movie: రాజకీయాల కంటే అభిమానుల ప్రేమే మిన్న: 'జన నాయగన్' టైటిల్‌పై సీఎం విజయ్ కీలక నిర్ణయం! Free Education: వారి చదువుల బాధ్యత తీసుకున్న జనసేనాని! ఉచిత విద్యకు ముందుకొచ్చిన ప్రముఖ విద్యాసంస్థలు! Minister Narayana: విశాఖ ఘటనపై అప్రమత్తమైన ప్రభుత్వం.. స్టెరిలైజేషన్ వేగవంతం చేయాలన్న మంత్రి నారాయణ! Tirupati: భూమన అభినయరెడ్డి అరెస్ట్‌ చేయాలంటూ తిరుపతిలో మహిళల ఆందోళన! Semi Ring Road: ఉత్తరాంధ్రకు ‘సెమీ రింగ్‌’ శోభ... రూ. 4,450 కోట్లతో 102 కిలోమీటర్ల మేర సరికొత్త ఎక్స్‌ప్రెస్‌వే!! Praja Vedika: నేడు (16/05) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Railway Station: ఏపీలో ఆ రైల్వేస్టేషన్‌కు మహర్దశ... ద్వారకా తిరుమల గాలిగోపురం ఆకృతిలో ముఖద్వారం! TDP: వైసీపీ హయాంలో ప్రజాధనం దుర్వినియోగం.. ఇప్పుడు పొదుపుపై మాట్లాడటం విడ్డూరం.. టీడీపీ నేత శ్రీనివాస్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు!

Minister Narayana: విశాఖ ఘటనపై అప్రమత్తమైన ప్రభుత్వం.. స్టెరిలైజేషన్ వేగవంతం చేయాలన్న మంత్రి నారాయణ!

Minister Narayana: రాష్ట్రంలో వీధి కుక్కల సమస్యపై ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ శుక్రవారం మున్సిపల్ కమిషనర్లు, ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు.

Published : 2026-05-16 11:34:00

రాష్ట్రంలో వీధి కుక్కల సమస్యపై మున్సిపల్ అధికారులతో మంత్రి సమీక్ష..

3.2 లక్షల వీధి కుక్కల నియంత్రణకు స్పెషల్ డ్రైవ్..

అమరావతి: రాష్ట్రంలో వీధి కుక్కల సమస్యపై ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ శుక్రవారం మున్సిపల్ కమిషనర్లు, ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, డైరెక్టర్ సంపత్ కుమార్ కూడా పాల్గొన్నారు.

వీధి కుక్కల స్టెరిలైజేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఇటీవల విశాఖపట్నంలో ఓ బాలుడిపై వీధి కుక్క దాడి చేసిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత బాలుడికి అత్యుత్తమ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని విశాఖ మున్సిపల్ కమిషనర్‌కు స్పష్టమైన సూచనలు చేశారు.

సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పట్టణాలకు దూరంగా వీధి కుక్కల కోసం ప్రత్యేక ఫుడ్ షెల్టర్లు ఏర్పాటు చేయాలని మంత్రి తెలిపారు. ప్రజల భద్రతతో పాటు జంతు సంరక్షణ కూడా సమానంగా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 3.2 లక్షల వీధి కుక్కలు ఉన్నాయని అధికారులు సమావేశంలో వెల్లడించారు. అందులో ఇప్పటికే 1.8 లక్షల కుక్కలకు స్టెరిలైజేషన్ శస్త్రచికిత్సలు పూర్తి చేసినట్లు తెలిపారు. మిగిలిన కుక్కలకు కూడా త్వరగా శస్త్రచికిత్సలు పూర్తి చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని మంత్రి నారాయణ ఆదేశించారు.

పట్టణాల్లో ప్రజలు భయాందోళనలకు గురికాకుండా, పిల్లలు సురక్షితంగా ఉండేలా మున్సిపల్ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు.

Spotlight

Read More →