TDP: వైసీపీ హయాంలో ప్రజాధనం దుర్వినియోగం.. ఇప్పుడు పొదుపుపై మాట్లాడటం విడ్డూరం.. టీడీపీ నేత శ్రీనివాస్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు! Mahanadu : టీడీపీ మహానాడు ఈసారి వర్చువల్‌గా.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం! Kollu Ravindra: ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖలో భారీ మార్పులు.. పారదర్శకత, నాణ్యతకు పెద్దపీట! Chandrababu: శ్రీకాకుళం జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన.. ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం! Greater Vijayawada: విజయవాడ @ 75... గ్రేటర్ విజయవాడలో విలీనం కానున్న 75 గ్రామ పంచాయతీలు! AP HighCourt: ఆడబిడ్డల ఆస్తి హక్కుపై ఏపీ హైకోర్టు చారిత్రాత్మక తీర్పు! Nara Lokesh: 75 ఏళ్ల కుర్రాళ్లు... మోదీ, రాజ్ నాథ్, బాబులపై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు! PM Modi: యూఏఈ పర్యటనలో ప్రధాని మోదీ.. కీలక ఒప్పందాలపై సంతకాలు.! Kollu Ravindra: దేశ ఆర్థిక భద్రత కోసం పొదుపు అవసరం.. మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర సైకిల్ ప్రయాణం! Chandrababu: పుట్టపర్తిలో మరో మూడు డిఫెన్స్ ప్రాజెక్టులకు శంకుస్థాపన.. 1,900 మందికి పైగా ఉపాధి అవకాశాలు! TDP: వైసీపీ హయాంలో ప్రజాధనం దుర్వినియోగం.. ఇప్పుడు పొదుపుపై మాట్లాడటం విడ్డూరం.. టీడీపీ నేత శ్రీనివాస్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు! Mahanadu : టీడీపీ మహానాడు ఈసారి వర్చువల్‌గా.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం! Kollu Ravindra: ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖలో భారీ మార్పులు.. పారదర్శకత, నాణ్యతకు పెద్దపీట! Chandrababu: శ్రీకాకుళం జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన.. ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం! Greater Vijayawada: విజయవాడ @ 75... గ్రేటర్ విజయవాడలో విలీనం కానున్న 75 గ్రామ పంచాయతీలు! AP HighCourt: ఆడబిడ్డల ఆస్తి హక్కుపై ఏపీ హైకోర్టు చారిత్రాత్మక తీర్పు! Nara Lokesh: 75 ఏళ్ల కుర్రాళ్లు... మోదీ, రాజ్ నాథ్, బాబులపై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు! PM Modi: యూఏఈ పర్యటనలో ప్రధాని మోదీ.. కీలక ఒప్పందాలపై సంతకాలు.! Kollu Ravindra: దేశ ఆర్థిక భద్రత కోసం పొదుపు అవసరం.. మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర సైకిల్ ప్రయాణం! Chandrababu: పుట్టపర్తిలో మరో మూడు డిఫెన్స్ ప్రాజెక్టులకు శంకుస్థాపన.. 1,900 మందికి పైగా ఉపాధి అవకాశాలు!

TDP: వైసీపీ హయాంలో ప్రజాధనం దుర్వినియోగం.. ఇప్పుడు పొదుపుపై మాట్లాడటం విడ్డూరం.. టీడీపీ నేత శ్రీనివాస్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు!

TDP: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజల సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

Published : 2026-05-15 21:03:00

ప్రజల సొమ్ముతో ఆర్భాటాలు చేసిన పార్టీ వైసీపీ..

జగన్ రెడ్డికి పొదుపు గురించి మాట్లాడే అర్హత లేదు..

మంగళగిరి: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజల సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు అదే నాయకులు పొదుపు గురించి మాట్లాడటం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. శుక్రవారం మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజా ధనాన్ని అభివృద్ధికి కాకుండా ప్రచారం, ఆర్భాటాలకు వినియోగించిందని ఆరోపించారు. టీడీపీ హయాంలో నిర్మించిన ఇళ్లకు పార్టీ రంగులు వేయడం, తర్వాత కోర్టు ఆదేశాలతో వాటిని తొలగించడం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని చెప్పారు. కేవలం పార్టీ గుర్తింపుకోసం ప్రభుత్వ భవనాలు, సర్వే రాళ్లు, పాస్ పుస్తకాలపై ఫోటోలు ముద్రించేందుకు భారీగా ప్రజాధనం వృథా చేశారన్నారు.

విశాఖలో రుషికొండపై రూ.600 కోట్లతో విలాసవంతమైన భవనం నిర్మించారని, తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ కంచెకు రూ.50 కోట్లు, హెలిప్యాడ్‌కు రూ.8 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. వ్యక్తిగత పర్యటనలు, తాత్కాలిక పనుల కోసం కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని విమర్శించారు. సాక్షి పత్రిక ప్రకటనల పేరుతో రూ.500 కోట్లు మళ్లించారని, ‘వ్యూహం’ సినిమా కోసం ప్రభుత్వ నిధులు వినియోగించారని ఆరోపించారు.

మొత్తంగా రూ.6,791 కోట్ల ప్రజా ధనాన్ని వైసీపీ ప్రభుత్వం దుబారా చేసిందని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు ఈ విధానాన్ని గమనించారని, అందుకే గత ఎన్నికల్లో 151 సీట్ల నుంచి వైసీపీని 11 సీట్లకు పరిమితం చేశారని అన్నారు.

ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రతి రూపాయిని జాగ్రత్తగా వినియోగిస్తూ సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమతుల్యంగా ముందుకు తీసుకెళ్తోందన్నారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులను ముందుగానే అంచనా వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొదుపు చర్యలు చేపట్టారని చెప్పారు. ప్రజాధనం వృథా కాకుండా ఉండేందుకు సీఎం తన కాన్వాయ్‌ను కూడా తగ్గించుకున్నారని గుర్తు చేశారు.

రాష్ట్రానికి మళ్లీ పెట్టుబడులు వస్తున్నాయని, దేశానికి వచ్చే పెట్టుబడుల్లో 26 శాతం ఆంధ్రప్రదేశ్‌కే రావడం కూటమి ప్రభుత్వ సామర్థ్యానికి నిదర్శనమన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న విశ్వసనీయత, ఐటీ మంత్రి నారా లోకేష్ కృషి వల్లే విదేశీ పెట్టుబడిదారులు ఏపీ వైపు చూస్తున్నారని చెప్పారు.

పుట్టపర్తి, అనంతపురం ప్రాంతాల్లో రూ.15 వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. రాయలసీమను కేవలం ఉద్యాన పంటల కేంద్రంగా కాకుండా డిఫెన్స్ హబ్‌గా కూడా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. MSME యూనిట్లు, మైనింగ్ రంగాల్లో కూడా సీమను అగ్రగామిగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

అమరావతి పేరు వినగానే ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడం జగన్ రెడ్డికి అలవాటైందని శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. రాజకీయ లాభాల కోసం రాయలసీమ, కోస్తా ప్రాంతాల మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.

గత ఐదేళ్లలో ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదని, పెట్టుబడిదారులు భయపడి ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ఇప్పుడు మాత్రం కూటమి ప్రభుత్వం వచ్చాక అమరావతి పనులు మళ్లీ వేగం పుంజుకున్నాయని, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు ఏపీపై ఆసక్తి చూపుతున్నారని చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో కూడా సంక్షేమం ఆపకుండా, అభివృద్ధిని కొనసాగిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. ప్రజలు ఇప్పటికే వైసీపీ పాలనను తిరస్కరించారని, భవిష్యత్తులో కూడా కూటమి ప్రభుత్వంపైనే విశ్వాసం ఉంచుతారని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

Spotlight

Read More →