Free Education: వారి చదువుల బాధ్యత తీసుకున్న జనసేనాని! ఉచిత విద్యకు ముందుకొచ్చిన ప్రముఖ విద్యాసంస్థలు! Minister Narayana: విశాఖ ఘటనపై అప్రమత్తమైన ప్రభుత్వం.. స్టెరిలైజేషన్ వేగవంతం చేయాలన్న మంత్రి నారాయణ! Tirupati: భూమన అభినయరెడ్డి అరెస్ట్‌ చేయాలంటూ తిరుపతిలో మహిళల ఆందోళన! Semi Ring Road: ఉత్తరాంధ్రకు ‘సెమీ రింగ్‌’ శోభ... రూ. 4,450 కోట్లతో 102 కిలోమీటర్ల మేర సరికొత్త ఎక్స్‌ప్రెస్‌వే!! Praja Vedika: నేడు (16/05) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Railway Station: ఏపీలో ఆ రైల్వేస్టేషన్‌కు మహర్దశ... ద్వారకా తిరుమల గాలిగోపురం ఆకృతిలో ముఖద్వారం! TDP: వైసీపీ హయాంలో ప్రజాధనం దుర్వినియోగం.. ఇప్పుడు పొదుపుపై మాట్లాడటం విడ్డూరం.. టీడీపీ నేత శ్రీనివాస్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు! Mahanadu : టీడీపీ మహానాడు ఈసారి వర్చువల్‌గా.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం! Kollu Ravindra: ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖలో భారీ మార్పులు.. పారదర్శకత, నాణ్యతకు పెద్దపీట! Chandrababu: శ్రీకాకుళం జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన.. ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం! Free Education: వారి చదువుల బాధ్యత తీసుకున్న జనసేనాని! ఉచిత విద్యకు ముందుకొచ్చిన ప్రముఖ విద్యాసంస్థలు! Minister Narayana: విశాఖ ఘటనపై అప్రమత్తమైన ప్రభుత్వం.. స్టెరిలైజేషన్ వేగవంతం చేయాలన్న మంత్రి నారాయణ! Tirupati: భూమన అభినయరెడ్డి అరెస్ట్‌ చేయాలంటూ తిరుపతిలో మహిళల ఆందోళన! Semi Ring Road: ఉత్తరాంధ్రకు ‘సెమీ రింగ్‌’ శోభ... రూ. 4,450 కోట్లతో 102 కిలోమీటర్ల మేర సరికొత్త ఎక్స్‌ప్రెస్‌వే!! Praja Vedika: నేడు (16/05) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Railway Station: ఏపీలో ఆ రైల్వేస్టేషన్‌కు మహర్దశ... ద్వారకా తిరుమల గాలిగోపురం ఆకృతిలో ముఖద్వారం! TDP: వైసీపీ హయాంలో ప్రజాధనం దుర్వినియోగం.. ఇప్పుడు పొదుపుపై మాట్లాడటం విడ్డూరం.. టీడీపీ నేత శ్రీనివాస్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు! Mahanadu : టీడీపీ మహానాడు ఈసారి వర్చువల్‌గా.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం! Kollu Ravindra: ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖలో భారీ మార్పులు.. పారదర్శకత, నాణ్యతకు పెద్దపీట! Chandrababu: శ్రీకాకుళం జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన.. ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం!

Tirupati: భూమన అభినయరెడ్డి అరెస్ట్‌ చేయాలంటూ తిరుపతిలో మహిళల ఆందోళన!

Tirupati: తిరుపతిలో గంజాయి వ్యవహారం రాజకీయ వేడిని రాజేసింది. భూమన కుటుంబానికి చెందిన అనుచరుడు భాను గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడటంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Published : 2026-05-16 10:58:00

గంజాయి వ్యవహారంపై తిరుపతిలో మహిళల భారీ నిరసన..

భూమన గ్యాంగ్‌కు వ్యతిరేకంగా తిరుపతిలో మహిళల బైఠాయింపు..

తిరుపతిలో గంజాయి వ్యవహారం రాజకీయ వేడిని రాజేసింది. భూమన కుటుంబానికి చెందిన అనుచరుడు భాను గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడటంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద సంఖ్యలో మహిళలు వీధుల్లోకి వచ్చి నిరసన చేపట్టారు. భూమన అభినయరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ తిరుపతి అంబేద్కర్ విగ్రహం ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు.

నిరసనలో పాల్గొన్న మహిళలు “దోపిడీదారుల నుంచి తిరుమల, తిరుపతిని రక్షించుకుందాం”, “యువతను గంజాయి మత్తులోకి నెట్టొద్దు” అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. గంజాయి కారణంగా యువత భవిష్యత్తు నాశనం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా విద్యార్థులను గంజాయికి బానిసలుగా మార్చుతున్నారని ఆరోపిస్తూ భూమన అభినయరెడ్డి, భాను పేర్లను ప్రస్తావించారు.

“పవిత్రమైన తిరుపతి నగరాన్ని డ్రగ్స్ కేంద్రంగా మార్చే ప్రయత్నాలు ఆగాలి”, “యువకుల జీవితాలతో ఆటలాడొద్దు” అంటూ మహిళలు నినాదాలు చేశారు. తిరుమల, తిరుపతి పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని వారు పేర్కొన్నారు. భాను అరెస్టుతో అసలు నెట్‌వర్క్ బయటపడాలని, ఈ వ్యవహారంలో ఉన్న వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదిలా ఉండగా, మహిళల శాంతియుత నిరసన మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఆందోళన చేస్తున్న మహిళలపై వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడికి యత్నించారని ఆరోపణలు వినిపించాయి. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా, కొందరు వైసీపీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ఈ సందర్భంగా అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మహిళలు మాత్రం వెనక్కి తగ్గకుండా తమ నిరసన కొనసాగించారు. గంజాయి మాఫియాపై కఠిన చర్యలు తీసుకుని తిరుపతి యువతను రక్షించాలని, రాజకీయ అండతో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.

Spotlight

Read More →