అమరావతి లో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి..
కావాలి అని కొందరు అమరావతి పై రాజకీయ కుట్ర చేస్తున్నారు..
రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి పనుల పురోగతిని సమీక్షించారు.
పరిశీలన అనంతరం మంత్రి మాట్లాడుతూ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని చెప్పారు. త్వరలోనే అన్ని భవనాలను ప్రభుత్వానికి అప్పగించేలా పనులు పూర్తి చేస్తున్నామని వెల్లడించారు.
అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో కూడా చర్చ జరుగుతోందని మంత్రి పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి రైతులు ఎంతో త్యాగం చేశారని గుర్తుచేశారు.
మొత్తం 30,753 మంది రైతులు 35,017 ఎకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారని తెలిపారు. అందులో 34,525 ఎకరాలకు సంబంధించిన ప్లాట్లను ఇప్పటికే రైతులకు కేటాయించామని చెప్పారు. ప్రస్తుతం కేవలం 674 మంది రైతులకు మాత్రమే ప్లాట్లు ఇవ్వాల్సి ఉందన్నారు.
98.06 శాతం మంది రైతులకు ప్లాట్ల కేటాయింపు పూర్తైందని మంత్రి వివరించారు. మిగిలిన కొంతమంది రైతుల విషయంలో కోర్టు కేసులు, కుటుంబ వివాదాలు వంటి కారణాలతో ప్రక్రియ నిలిచిపోయిందని చెప్పారు.
“భూములు తీసుకుని ప్రభుత్వం ప్లాట్లు ఇవ్వలేదని కొందరు చేస్తున్న ప్రచారం వాస్తవాలకు దూరం” అని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. రైతులకు ప్లాట్ల కేటాయింపు పూర్తిగా లాటరీ విధానంలో పారదర్శకంగా జరిగిందని స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధిని అడ్డుకునేందుకు కొందరు రాజకీయ కుట్రలు చేస్తున్నారని మంత్రి ఆరో