Kollu Ravindra: ప్రతి ఇంటా నిండాలి ఆనందం, ఐశ్వర్యం: రాష్ట్ర ప్రజలందరికీ ఈద్ ముబారక్!
Kollu Ravindra: పవిత్ర రంజాన్ మాసం ముగింపు సందర్భంగా రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీ సోదరులందరికీ శుభాకాంక్షలు. నెల పొడుపు (చంద్ర దర్శనం)తో ముగిసే ఈ పవిత్ర మాసం ఉపవాసాలు, ప్రార్థనలు, దానధర్మాలతో అత్యంత నిష్ఠగా ఉంటారు.
- సమాజంలో సౌభ్రాతృత్వం, క్షమాభావం: రంజాన్ పర్వదినం చాటిచెప్పే గొప్ప విలువలివే..
- ఐకమత్యంతో ముందుకు సాగుదాం: రంజాన్ పండుగ వేళ వెల్లివిరుస్తున్న మత సామరస్యం..
Kollu Ravindra: పవిత్ర రంజాన్ మాసం ముగింపు సందర్భంగా రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీ సోదరులందరికీ శుభాకాంక్షలు. నెల పొడుపు (చంద్ర దర్శనం)తో ముగిసే ఈ పవిత్ర మాసం ఉపవాసాలు, ప్రార్థనలు, దానధర్మాలతో అత్యంత నిష్ఠగా ఉంటారు. ఆత్మపరిశీలన, నియమ నిష్టలు, సహనశీలతను పెంపొందించి, మానవత్వానికి మార్గదర్శకంగా నిలుస్తుంది. రంజాన్ మాసంలో ఆచరించే ఉపవాసాలు కేవలం ఆహార నియమాలకు మాత్రమే పరిమితం కాకుండా, మన ఆలోచనలు, ప్రవర్తనలను కూడా శుద్ధి చేసుకునేవిగ నిలుస్తాయి.
పరస్పర గౌరవం, సౌభ్రాతృత్వం, క్షమాభావం వంటి గొప్ప విలువలను ఈ పవిత్ర మాసం సమాజంలో విస్తరింపజేస్తుంది. అవసరమైన వారికి సహాయం చేయడం, పేదల పట్ల దాతృత్వ భావనను పెంపొందించడం రంజాన్ యొక్క ముఖ్య సందేశం. సమాజంలో ఐక్యత, శాంతి, సౌహార్ద వాతావరణం నెలకొల్పడంలో రంజాన్ మాసం కీలక పాత్ర పోషిస్తుంది. రంజాన్ పర్వదినం సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా జీవిస్తూ పరస్పర గౌరవంతో ముందుకు సాగాలి. ఈ పవిత్ర సందర్భంలో రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఈద్ పర్వదినం ప్రతి ఇంటికి ఆనందం, ఐశ్వర్యం కరిగించాలని ఆకాంక్షిస్తున్నా అని మంత్రి కొల్లు రవీంద్ర శుభాకాంక్షలు తెలియజేసారు.
Be the first to react