LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతి!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Telangana Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ అదిరిపోయే అప్‌డేట్.. రెండో విడత ఎప్పటినుంచో తెలుసా?

Telangana Housing Scheme: తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత మంజూరుపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ చివరి వారం లేదా మే నుంచి కొత్త ఇళ్ల కేటాయింపులు ప్రారంభం కానున్నాయి. పాత గృహలక్ష్మి పథకం నిధులతో పాటు పట్టణాల్లో ఇళ్ల నిర్మాణంపై పూర్తి వివరాలు..

AndhraPravasi News Desk 2 min read
Telangana Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ అదిరిపోయే అప్‌డేట్.. రెండో విడత ఎప్పటినుంచో తెలుసా?

Telangana Housing Scheme: తెలంగాణలో సొంతింటి కల ఉన్న పేద మధ్యతరగతి ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ.. రెండో విడత కేటాయింపులపై అసెంబ్లీ వేదికగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు అందే సాయం, పంపిణీ గడువు మరియు పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం కీలక వివరాలను వెల్లడించింది.

మంత్రి పొంగులేటి తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ చివరి వారం లేదా మే నెల నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున కేటాయించగా, ప్రస్తుతానికి లక్షా 12 వేల ఇళ్ల నిర్మాణం తుది దశకు చేరుకుంది. జూన్ నాటికి మరో లక్ష ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.

గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన గృహలక్ష్మి పథకం లబ్ధిదారులకు కూడా ఈ ప్రకటనతో పెద్ద ఊరట లభించింది. సగం నిర్మించి ఆగిపోయిన ఇళ్లకు కూడా ప్రస్తుత ప్రభుత్వం నిధులను విడుదల చేయాలని నిర్ణయించింది. ఇంటి నిర్మాణ దశను బట్టి ఆర్థిక సాయం అందుతుందని, దీనివల్ల సొంతంగా ఇల్లు కట్టుకుంటూ నిధుల కోసం ఎదురుచూస్తున్న వేలాది మందికి మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు.

ఇక పట్టణ ప్రాంతాల్లో నివసించే వారి కోసం ప్రభుత్వం సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బస్తీలకు సమీపంలోనే ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. గతంలో ఊరికి దూరంగా ఇళ్లు ఇవ్వడం వల్ల లబ్ధిదారులు అక్కడికి వెళ్లడానికి ఆసక్తి చూపలేదని గుర్తించిన సర్కార్, ఇప్పుడు ఆ తప్పు జరగకుండా చూస్తోంది. గ్రేటర్ పరిధిలో ఇప్పటికే 14 నుంచి 15 మురికివాడలను గుర్తించి, అక్కడి ప్రజల సౌకర్యార్థం దగ్గరలోనే ఇళ్లు నిర్మించబోతున్నారు.

హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్  మహబూబ్ నగర్ వంటి పట్టణాల్లో కూడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని  చేపట్టనున్నారు. పారదర్శకంగా, ఎక్కడా అవినీతికి తావులేకుండా అర్హులైన పేదలందరికీ గూడు కల్పించడమే తమ ఉద్దేశమని రేవంత్ ప్రభుత్వం స్పష్టం చేసింది. త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన పూర్తి నిబంధనలు  దరఖాస్తు ప్రక్రియపై స్పష్టత రానుంది.

Be the first to react

More Coverage

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…