హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకీ తీవ్రమవుతున్నాయి. వాహనాల సంఖ్య 85 లక్షలు దాటిపోవడం, ఉద్యోగాలు మరియు విద్య కోసం ప్రయాణించే వారు గంటల కొద్దీ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడం నగరవాసులకు ఇబ్బందికరంగా మారింది.
ఈ సమస్యను పరిష్కరించేందుకు మరియు టూరిజాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం రోప్‌వే ప్రాజెక్ట్ ను ప్రణాళికలోకి తీసుకొచ్చింది. మొదటి దశలో గోల్కొండ కోట నుండి కుతుబ్‌షాహి టూంబ్స్ వరకు 1.5 కిలోమీటర్ల పొడవులో రూ.100 కోట్ల వ్యయంతో రోప్‌వే నిర్మాణం చేపట్టనున్నారు.
ఈ ప్రాజెక్ట్ అమలులో వస్తే ట్రాఫిక్ ఒత్తిడి తగ్గడం పాటు పర్యాటకులకు చారిత్రక ప్రదేశాలను గాల్లోనే వీక్షించే అదనపు అనుభవం కలుగుతుంది. ఒక్కో బాక్స్‌లో 6 నుంచి 10 మంది వరకు ప్రయాణించగల్గేలా తీగలపై బాక్స్ ఆకారంలో వాహనాలు అమర్చనున్నారు.
అయితే గోల్కొండ-కుతుబ్‌షాహి మధ్య మిలిటరీ పరిధి ఉన్నందున అలైన్‌మెంట్ విషయంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. రక్షణ శాఖ అనుమతులు లభిస్తే ప్రాజెక్ట్ త్వరగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ రోప్‌వే ప్రాజెక్ట్ పూర్తయితే హైదరాబాద్ టూరిజానికి గేమ్ ఛేంజర్‌గా మారే అవకాశముంది.