ప్రముఖ నటుడు సుమన్ మరోసారి రాజకీయ రంగప్రవేశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు తమిళనాడులో మంచి గుర్తింపు ఉండటాన్ని గుర్తుచేస్తూ, అక్కడి రాజకీయ పార్టీల నుంచి ఎమ్మెల్యే టికెట్ తో కూడిన ఆఫర్లు వస్తున్నాయని వెల్లడించారు. "తమిళనాడులో నాకు బలమైన గుర్తింపు ఉంది. దాన్ని గమనించిన కొన్ని పార్టీలు నన్ను తమ పార్టీలోకి ఆహ్వానించాయి. ఎమ్మెల్యేగా నిలబెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి" అని ఆయన మీడియాతో అన్నారు. ఈ వ్యాఖ్యలతో ఆయన త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.
తమిళనాడు politics పై అభిప్రాయాలు వ్యక్తం చేసిన సుమన్, ఆంధ్రప్రదేశ్‌పై కూడా ఆసక్తి చూపించారు. ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు పూర్తయ్యాయని, కానీ 2029 ఎన్నికల్లో అక్కడ రాజకీయాల్లోకి రావాలా వద్దా అనే విషయంపై తుది నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. గతంలో ఆయన జగన్ పాలనతో పాటు చంద్రబాబు పాలనపై కూడా ప్రశంసలు పలికిన నేపథ్యంలో, ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారన్న అంశం ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే సినీ అభిమానులు, రాజకీయ విశ్లేషకుల మధ్య సుమన్ రాజకీయ ప్రయాణంపై చర్చ మొదలైపోయింది. ఆయన తమిళనాడులో నుంచే తన రాజకీయ కెరీర్ ప్రారంభిస్తారా? లేక 2029 వరకు వేచి చూసి ఆంధ్రాలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటారా? అన్నది తేలాల్సిన విషయం. ఏదైతేనైనా, సుమన్ రాజకీయ రంగ ప్రవేశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.