LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

High Court: రిజర్వేషన్ల ఖరారుకు ఆ సర్వేనే కీలకం.. త్వరలోనే కొత్త కమిషనర్ రాకపై - హైకోర్టు కీలక ఆదేశం!

High Court: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC) నియామకం మరియు బీసీ కులగణన సర్వేపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బీసీ జనగణన పూర్తి చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ బీసీ నేత శంకర్రావు దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు, పంచా…

AndhraPravasi News Desk 2 min read
High Court: రిజర్వేషన్ల ఖరారుకు ఆ సర్వేనే కీలకం.. త్వరలోనే కొత్త కమిషనర్ రాకపై - హైకోర్టు కీలక ఆదేశం!
  • బీసీ సర్వే 99.5 శాతం పూర్తి: హైకోర్టుకు నివేదించిన అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్..
     
  • Politics: "గవర్నర్ వద్ద ఎస్‌ఈసీ నియామక ఫైల్": త్వరలోనే కొత్త కమిషనర్ రాకపై ఏజీ స్పష్టత..

High Court: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC) నియామకం మరియు బీసీ కులగణన సర్వేపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బీసీ జనగణన పూర్తి చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ బీసీ నేత శంకర్రావు దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు, పంచాయతీల పదవీకాలం ముగిసినందున తక్షణమే ఎన్నికలు జరపాలని న్యాయవాది యోగేష్ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం గురువారం విచారించింది. ఈ సందర్భంగా బీసీ సర్వే పురోగతి మరియు ఎన్నికల కమిషనర్ నియామక ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

విచారణ సందర్భంగా రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (AG) దమ్మాలపాటి శ్రీనివాస్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తూ, రాష్ట్రంలో బీసీ సామాజిక, ఆర్థిక సర్వే ప్రక్రియ దాదాపు ముగింపు దశకు చేరుకుందని తెలిపారు. ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ మరియు విలేజ్/వార్డ్ సెక్రటేరియట్ విభాగాల ద్వారా జరుగుతున్న ఈ సర్వే ఇప్పటికే 99.5 శాతం పూర్తయిందని, మిగిలిన స్వల్ప భాగాన్ని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని కోర్టుకు నివేదించారు. బీసీ రిజర్వేషన్ల ఖరారుకు ఈ గణాంకాలు అత్యంత కీలకమని, అందుకే ప్రభుత్వం ఈ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తోందని ఏజీ వివరించారు.

మరోవైపు, గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకంపై కూడా ఏజీ స్పష్టత ఇచ్చారు. ఎస్‌ఈసీ నియామకానికి సంబంధించిన ఫైల్ ప్రస్తుతం గవర్నర్ వద్ద ఉందని, ఒకటి రెండు రోజుల్లోనే ఆయన ఆమోదం లభించే అవకాశం ఉందని తెలిపారు. నియామక ప్రక్రియ పూర్తి కాగానే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ముందడుగు వేస్తామని కోర్టుకు వెల్లడించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్. రఘునందన్ రావుల ధర్మాసనం, తదుపరి విచారణను ఈనెల 23వ తేదీకి వాయిదా వేస్తూ, అప్పటిలోగా పూర్తి సమాచారంతో కూడిన అఫిడవిట్‌ను సమర్పించాలని ఆదేశించింది.

Be the first to react

More Coverage

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: కేంద్ర ప్రభుత్వం జూలైలో నిర్వహించబోయే ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, జమిలి ఎన్నికల…