LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

YCP leaders: అంబులెన్స్‌కు దారివ్వని ఉన్మాదం - ఐదేళ్ల దోపిడీ చాలక ఇంకా.. వైసీపీ నేతలకు గట్టి హెచ్చరికలు..

TDP Strong warnings to YCP leaders: తిరుపతిలో చోటుచేసుకున్న తాజా పరిణామాలపై కూటమి నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్సార్సీపీ నేతలు సంస్కారహీనులని, నిన్నటి తిరుపతి ఘటనతో ఆ విషయం మరోసారి స్పష్టంగా రుజువైందని వారు మండిపడ్డారు.

AndhraPravasi News Desk 2 min read
YCP leaders: అంబులెన్స్‌కు దారివ్వని ఉన్మాదం - ఐదేళ్ల దోపిడీ చాలక ఇంకా.. వైసీపీ నేతలకు గట్టి హెచ్చరికలు..
  • కరుణాకర్ రెడ్డికి వార్నింగ్: "స్వామి వారితో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవు"…
     
  • కూటమి ప్రభుత్వం ముందు ఆటలు సాగవు: వైసీపీ నేతలకు గట్టి హెచ్చరికలు…

TDP Strong warnings to YCP leaders: తిరుపతిలో చోటుచేసుకున్న తాజా పరిణామాలపై కూటమి నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్సార్సీపీ నేతలు సంస్కారహీనులని, నిన్నటి తిరుపతి ఘటనతో ఆ విషయం మరోసారి స్పష్టంగా రుజువైందని వారు మండిపడ్డారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు వైఎస్సార్సీపీ నేతలు నిత్యం కుట్రలు పన్నుతున్నారని, గడిచిన ఐదేళ్ల పాలనలో స్వామి వారి కానుకలు మొదలుకొని బంగారం వరకు అన్నీ దోచుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తిరుమల ఎంత పవిత్రమో తిరుపతి నగరం కూడా అంతే పవిత్రమని, కానీ వీరు కావాలనే మందు బాటిళ్లు అక్కడ పెట్టి తిరుమలలో మద్యం దొరుకుతోందని అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తిరుమల నెయ్యి కల్తీకి పాల్పడిందే కాకుండా, తిరిగి అబాండాలు కూడా ఇతరులపైనే వేస్తున్నారని, ఇదంతా తాడేపల్లి ప్యాలెస్ నుండి వచ్చిన స్క్రిప్ట్ ఆధారంగా జరుగుతున్న ఉన్మాదుల దాడి అని వారు అభివర్ణించారు.

టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు కుటుంబంపై వైఎస్సార్సీపీ శ్రేణులు రాళ్లు, కర్రలతో దాడికి యత్నించడం అత్యంత హేయమైన చర్యని నేతలు పేర్కొన్నారు. బి.ఆర్.నాయుడిపై హత్యాయత్నం జరిగింది వాస్తవం కాదా అని ప్రశ్నిస్తూ, ఈ ఘటనతో ఆయన సతీమణి తీవ్ర భయాందోళనకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము గనుక అడ్డుకోవాలనుకుంటే మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి తన ఇంటి నుండి బయటకు వచ్చేవాడా అని హెచ్చరించారు. ఈ రోజు ఉదయం బస్టాండ్ సమీపంలో వైఎస్సార్సీపీ మూకలు ధర్నా చేయాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. అంబులెన్స్ వస్తే దారి ఇవ్వని పరిస్థితి సృష్టించారని, ఆ వాహనంలో ఉన్న రోగులకు ఏదైనా జరిగితే దానికి బాధ్యత ఎవరిదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైఎస్సార్సీపీ ధర్నాల వల్ల ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, పరీక్షకు సమయం మించిపోతుంటే వారి భవిష్యత్తు ఏమైపోవాలని ప్రశ్నించారు. పరీక్షకు వెళ్లాలి దారివ్వండి అని ప్రాధేయపడిన తల్లిదండ్రులపై దాడికి వెళ్లడం వారి ఉన్మాదానికి పరాకాష్ట అని మండిపడ్డారు. తమ బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందోనని తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకోవడం కలిచివేసిందని పేర్కొన్నారు. జగన్ మరియు కరుణాకర్ రెడ్డి ఉద్దేశ్యం ఏమిటని, తిరుపతిలో శాంతిభద్రతలు లేవని ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నారా అని నిలదీశారు. వైఎస్సార్సీపీ నేతల ఆటలు కూటమి ప్రభుత్వంలో సాగవని, స్వామి వారితో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవని కరుణాకర్ రెడ్డిని హెచ్చరించారు.

Be the first to react

More Coverage

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: కేంద్ర ప్రభుత్వం జూలైలో నిర్వహించబోయే ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, జమిలి ఎన్నికల…