LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతి!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Palakollu: పాలకొల్లులో అభివృద్ధి పనులకు శ్రీకారం! రూ. 4.90 కోట్ల వ్యయంతో..

Palakollu: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు కొత్త ఊపు తీసుకొచ్చారు. రూ. 4.90 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

AndhraPravasi News Desk 1 min read
Palakollu: పాలకొల్లులో అభివృద్ధి పనులకు శ్రీకారం! రూ. 4.90 కోట్ల వ్యయంతో..

పాలకొల్లులో రూ. 4.90 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన..

పరబ్రహ్మ స్వరూపమైన  అన్నాన్ని నేలపాలు చేసిన దుర్మార్గుడు జగన్..

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు కొత్త ఊపు తీసుకొచ్చారు. రూ. 4.90 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడిన మంత్రి, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.

మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా 269 అన్నా క్యాంటీన్ల ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రోజుకు సుమారు 5 లక్షల మందికి కేవలం రూ.5కే భోజనం అందిస్తున్నారని తెలిపారు. పేదల ఆకలి తీర్చడంలో ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతోందని చెప్పారు.

ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి నిమ్మల తీవ్ర విమర్శలు చేశారు. గతంలో అన్నా క్యాంటీన్లను నిలిపివేయడం వల్ల పేదలు ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు.  కాశి అన్నపూర్ణ లాంటి భోజనాన్ని రోడ్డుపై పారపోసిన జగన్‌కు రాజకీయాల్లో ఉండే అర్హత లేదని,  పేదవాడి నోటి కాడ కూడు లాక్కున్న గొడ్డలి పార్టీ రాష్ట్రానికి ఏం చేస్తుంది అని, దాతలు ముందుకు వచ్చి భోజనం అందించాలనుకున్నప్పటికీ, వారిపై కేసులు పెట్టి వేధించారని విమర్శించారు.    

“అన్నం పరబ్రహ్మ స్వరూపం. అలాంటి అన్నాన్ని వృథా చేయడం చాలా తప్పు” అని మంత్రి పేర్కొన్నారు. పేదవాడి కడుపు నింపే కార్యక్రమాలను ఆపడం మానవత్వానికి విరుద్ధమని అన్నారు. ఐదేళ్ల పాటు పేదల కోసం సరైన చర్యలు తీసుకోలేదని కూడా విమర్శించారు.

అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. పాలకొల్లులో ప్రారంభించిన ఈ పనులు ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Be the first to react

More Coverage

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…