LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Chandrababu: మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు కోరుతూ సీఎం చంద్రబాబు లేఖలు!

Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళా సాధికారత దిశగా కీలక అడుగు వేశారు. ‘నారీ శక్తి వందన్’ మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్లో మద్దతు తెలపాలని కోరుతూ రాష్ట్రంలోని రాజకీయ పార్టీల అధ్యక్షులు, రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలకు లేఖలు రాశారు.

AndhraPravasi News Desk 1 min read
Chandrababu: మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు కోరుతూ సీఎం చంద్రబాబు లేఖలు!

మహిళా రిజర్వేషన్ ‘నారీ శక్తి వందన్'కు పార్లమెంట్లో మద్దతుపై సీఎం లేఖ..

జనసేన అధ్యక్షుడు పవన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‍కు లేఖ పంపిన సీఎం..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళా సాధికారత దిశగా కీలక అడుగు వేశారు. ‘నారీ శక్తి వందన్’ మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్లో మద్దతు తెలపాలని కోరుతూ రాష్ట్రంలోని రాజకీయ పార్టీల అధ్యక్షులు, రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలకు లేఖలు రాశారు.

ఈ లేఖల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కల్పించాలనే ప్రధాని సంకల్పాన్ని బలపరుద్దామని పిలుపునిచ్చారు. ఈ నెల 16న పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడం భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక ముఖ్య ఘట్టమని పేర్కొన్నారు.

సీఎం చంద్రబాబు ప్రత్యేకంగాజనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాధవ్, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలలకు లేఖలు పంపారు. అలాగే సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులకు కూడా విజ్ఞప్తి చేశారు.

‘నారీ శక్తి వందన్’ చట్ట సవరణ బిల్లు మహిళా సాధికారతకు, దేశ అభివృద్ధికి దోహదపడుతుందని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం, పరిపాలన, చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు.

మహిళలు ముందుకు వస్తేనే నిజమైన ప్రగతి సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. “భరతమాతను పూజించే దేశంగా నారీ శక్తికి వందనం పలుకుదాం” అని అన్ని పార్టీలను ఒకే వేదికపైకి రావాలని సీఎం పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన చర్చకు దారితీయనుంది.

Be the first to react

More Coverage

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: కేంద్ర ప్రభుత్వం జూలైలో నిర్వహించబోయే ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, జమిలి ఎన్నికల…