LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Chandrababu: ఎన్నారైలతో సీఎం చంద్రబాబు భేటీ… సమస్యలపై స్పందన, పెట్టుబడులకు ఆహ్వానం!

Chandrababu: అమరావతి సచివాలయంలో అమెరికా, కెనడా, ఒమన్, కువైట్ దేశాలకు చెందిన ఎన్నారైలు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశాన్ని ఎన్నారై టీడీపీ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ సమన్వయం చేశారు.

AndhraPravasi News Desk 2 min read
Chandrababu: ఎన్నారైలతో సీఎం చంద్రబాబు భేటీ… సమస్యలపై స్పందన, పెట్టుబడులకు ఆహ్వానం!

Politics-ఏపీ అభివృద్ధిలో ఎన్నారైలు భాగస్వాములు కావాలి…

ఏపీలో పర్యాటక రంగంపై ఎన్నారైల కన్ను…

విదేశీ వేదికలపై తెలుగు జెండా…

Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలతో నేరుగా మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకునే కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రజల అభిప్రాయాలను స్వయంగా వినడంపై ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో అమరావతి సచివాలయంలో అమెరికా, కెనడా, ఒమన్, కువైట్ దేశాలకు చెందిన ఎన్నారైలు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశాన్ని ఎన్నారై టీడీపీ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ సమన్వయం చేశారు.

విదేశాల నుంచి వచ్చిన అతిథులను సీఎం ఆత్మీయంగా పలకరించి, వారి కుటుంబాలు, వృత్తులు, వారు నివసిస్తున్న దేశాల్లో పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. ఈ భేటీలో అమెరికా నుండి వేణుగోపాల్, కెనడా నుండి రాంబాబు, రమేశ్, యశ్వంత్, కువైట్ నుండి శ్రీనివాసరావు, ఒమన్ నుండి అనిల్ కుమార్ అలాగే యూకే నుండి సందీప్ శ్రావణి పాల్గొన్నారు.

ప్రత్యేకంగా గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలుగు కార్మికులు ప్రస్తుత యుద్ద సమయంలో ఎదుర్కొంటున్న సమస్యలను ఒమన్ నుండి వచ్చిన అనిల్ కుమార్, కువైట్ నుండి శ్రీనివాసరావు వివరించారు. అదేవిధంగా ఏజెంట్ల మోసాలు, ఎంబసీ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలు, కార్మికులు పడుతున్న ఇబ్బందులను వారు సీఎంకు తెలియజేశారు. దీనిపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించి, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నారై టీడీపీ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్‌కు సూచించారు.

అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక, అతిథ్య రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నారైలు ఆసక్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పిస్తే మరింత మంది ముందుకు వస్తారని వారు అభిప్రాయపడ్డారు. విదేశాల్లో ఉన్న అవకాశాలను తెలుగు యువత సద్వినియోగం చేసుకునేలా నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు.

వారి సూచనలకు స్పందించిన ముఖ్యమంత్రి, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టదలచిన ఎన్నారైలు స్పష్టమైన ప్రతిపాదనలు ఇవ్వాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారితో బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో ఎన్నారైలు భాగస్వాములు కావడాన్ని ప్రభుత్వం స్వాగతిస్తుందని, వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని భరోసా ఇచ్చారు.

ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడే అవకాశం లభించడం తమకు మరపురాని అనుభవమని ఎన్నారైలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ భేటీతో ప్రభుత్వం-ప్రవాసాంధ్రుల మధ్య బంధం మరింత బలపడిందని వారు అభిప్రాయపడ్డారు.

Be the first to react

More Coverage

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: కేంద్ర ప్రభుత్వం జూలైలో నిర్వహించబోయే ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, జమిలి ఎన్నికల…