LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Polavaram: పోలవరం నిర్వాసితులకు నేడు సీఎం చంద్రబాబు భరోసా.. రూ.307 కోట్ల పరిహారం పంపిణీ!

Polavaram: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక భరోసా ఇవ్వనున్నారు. సాయంత్రం సీఎం క్యాంపు కార్యాలయంలో పోలవరం నిర్వాసితులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.

AndhraPravasi News Desk 1 min read
Polavaram: పోలవరం నిర్వాసితులకు నేడు సీఎం చంద్రబాబు భరోసా.. రూ.307 కోట్ల పరిహారం పంపిణీ!

నిర్వాసితులకు రూ.307 కోట్లు పంపిణీతో పాటు పట్టాల పంపిణీ..

పోలవరం నిర్వాసితుల కుటుంబాల్లో పండుగ వాతావరణం..

అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక భరోసా ఇవ్వనున్నారు. సాయంత్రం సీఎం క్యాంపు కార్యాలయంలో పోలవరం నిర్వాసితులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆర్‌అండ్‌ఆర్‌ (రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్‌మెంట్) ప్యాకేజీ కింద భారీ స్థాయిలో పరిహారం పంపిణీ చేయనున్నారు.

మొత్తం 1,527 మంది లబ్దిదారులకు రూ.307 కోట్ల పరిహారం అందజేయడంతో పాటు, పలు కుటుంబాలకు భూ పట్టాలను కూడా సీఎం పంపిణీ చేయనున్నారు. ఈ నిర్ణయంతో పోలవరం నిర్వాసితుల కుటుంబాల్లో ఆనంద వాతావరణం నెలకొంది.

పోలవరం ప్రాజెక్టు కారణంగా ఇళ్లను, భూములను కోల్పోయిన కుటుంబాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసిందని అధికారులు తెలిపారు. ఇప్పటికే నాలుగు విడతల్లో 28,673 మంది నిర్వాసితులకు సుమారు రూ.2,250 కోట్ల పరిహారం పంపిణీ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఈ సందర్భంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, “పోలవరం నిర్వాసితుల కుటుంబాల్లో పండుగ వాతావరణం తీసుకువచ్చాం. గత వైసీపీ పాలనలో పరిహారం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగినా బాధితులను పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం బాధ్యతగా ముందుకొచ్చి వారికి అండగా నిలుస్తోంది” అని పేర్కొన్నారు.

నిర్వాసితుల పునరావాసం, జీవనోపాధి భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి అర్హ కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.

Be the first to react

More Coverage

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: కేంద్ర ప్రభుత్వం జూలైలో నిర్వహించబోయే ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, జమిలి ఎన్నికల…