Bangladesh : బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య.. ఆగని మైనారిటీలపై దాడులు! AP Government: ఏపీలో వారందరికి ఊరట.. ఆ డబ్బులు చెల్లించేందుకు మరో మూడు నెలల గడువు పొడిగింపు! CM Chandrababu: వాటిపై అవగాహన లేకే దుష్ప్రచారం... జగన్‌పై సీఎం చంద్రబాబు ఫైర్! Trumps: పుతిన్ ను అదుపులోకి తీసుకుంటారా.. ట్రంప్ క్లారిటీ! Ayushman: ఆయుష్మాన్ భారత్ లిమిట్‌పై కన్‌ఫ్యూజన్ క్లియర్..! కేంద్రం కీలక ప్రకటన! Modi: గుజరాత్‌లో ప్రధాని బిజీ షెడ్యూల్.. ఆధ్యాత్మిక కార్యక్రమాల నుంచి అంతర్జాతీయ చర్చల వరకూ! US India Relations: భారత్‌కు అమెరికా రాయబారి రాక.. రెండు దేశాల మధ్య అపార అవకాశాలు... సెర్జియో గోర్!! Electricity: సంక్రాంతికి డబుల్ ధమాకా..! ఏపీ ప్రజలకు విద్యుత్ బిల్లుల్లో భారీ ఉపశమనం! Gold price: ఆ దేశంలో బంగారం ఇంత చీపా.. 200 రూపాయల్లో 24 క్యారెట్ బంగారం..!! G7 Summit: అందుకోసమే జీ7 సదస్సు తేదీల్లో మార్పు… ఫ్రాన్స్ అధికారిక ప్రకటన..!! Bangladesh : బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య.. ఆగని మైనారిటీలపై దాడులు! AP Government: ఏపీలో వారందరికి ఊరట.. ఆ డబ్బులు చెల్లించేందుకు మరో మూడు నెలల గడువు పొడిగింపు! CM Chandrababu: వాటిపై అవగాహన లేకే దుష్ప్రచారం... జగన్‌పై సీఎం చంద్రబాబు ఫైర్! Trumps: పుతిన్ ను అదుపులోకి తీసుకుంటారా.. ట్రంప్ క్లారిటీ! Ayushman: ఆయుష్మాన్ భారత్ లిమిట్‌పై కన్‌ఫ్యూజన్ క్లియర్..! కేంద్రం కీలక ప్రకటన! Modi: గుజరాత్‌లో ప్రధాని బిజీ షెడ్యూల్.. ఆధ్యాత్మిక కార్యక్రమాల నుంచి అంతర్జాతీయ చర్చల వరకూ! US India Relations: భారత్‌కు అమెరికా రాయబారి రాక.. రెండు దేశాల మధ్య అపార అవకాశాలు... సెర్జియో గోర్!! Electricity: సంక్రాంతికి డబుల్ ధమాకా..! ఏపీ ప్రజలకు విద్యుత్ బిల్లుల్లో భారీ ఉపశమనం! Gold price: ఆ దేశంలో బంగారం ఇంత చీపా.. 200 రూపాయల్లో 24 క్యారెట్ బంగారం..!! G7 Summit: అందుకోసమే జీ7 సదస్సు తేదీల్లో మార్పు… ఫ్రాన్స్ అధికారిక ప్రకటన..!!

3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో చంద్రబాబు! దానికి నేను ఎప్పుడూ అడ్డు చెప్పలేదు!

2026-01-05 20:23:00
మారిషస్ అధ్యక్షుడితో చంద్రబాబు భేటీ.. వివిధ అంశాలపై చర్చ..

తెలుగు రాష్ట్రాలు సమైక్యంగా ఉంటేనే తెలుగు జాతి పురోగతి సాధ్యమవుతుందని... ఎన్నో సమస్యలు పరిష్కరించుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాలు శాశ్వతంగా పరిష్కారం కావాలన్నదే తన లక్ష్యమని... తెలుగు వారంతా ఐక్యంగా ఉండాలని  కోరుకుంటున్నట్టు చెప్పారు. గుంటూరులో సోమవారం శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక కేంద్రంలో ఆంధ్ర సారస్వత పరిషత్  నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. 

అమరావతిలో ఆవకాయ్ సందడి… ఆ మూడు రోజులు మిస్ అవ్వొద్దు!

గోవా గవర్నర్ పి. అశోక్ గజపతి రాజుతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకుని తపాల శాఖ రూపొందించిన ప్రత్యేక కవర్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అనంతరం సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ... ‘మనం రెండు రాష్ట్రాలుగా ఉన్నా, తెలుగే మనకు మాతృభాష. తెలుగు వారంతా ఐకమత్యంగా ఉంటేనే అగ్రస్థానంలో నిలుస్తాం. సాగునీటి వ్యవస్థకు దారి చూపింది ఎన్టీఆర్. ఎన్టీఆర్ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. 

Banks closed: వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్.. ఖాతాదారులకు అలర్ట్!

సాగర్ జలాలను ఉపయోగించుకునేలా ఎస్ఎల్బీసీ, ఎస్ఆర్బీసీ కాలువలు తెచ్చారు. ఆ తర్వాత నేను ముఖ్యమంత్రిగా కల్వకుర్తి లిఫ్ట్, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులను పూర్తి చేశాను. కృష్ణా డెల్టా ఆధునీకరణతో నీటిని పొదుపు చేసి 20 టీఎంసీల నీటిని తెలంగాణకు కేటాయించి బీమా లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేశాం. గోదావరి నదిపై అలీ సాగర్, దేవాదుల ఎత్తిపోతల వంటి పథకాలను చేపట్టాం. ఆంధ్రా ప్రాంతంలో చాగల్నాడు, పుష్కర, తాటిపూడి వంటి లిఫ్ట్ ప్రాజెక్టులు తెచ్చాం. 

Rice: ప్రపంచ వ్యవసాయ రంగంలో భారత్ సరికొత్త రికార్డు..! బియ్యంలో అగ్రస్థానం మనమే..!

పట్టిసీమ ప్రాజెక్టుతో కృష్ణా డెల్టాకు నీరు అందించాం. ప్రతి ఏడాది గోదావరి నుంచి 3 వేల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి పోతోంది. గతేడాది కృష్ణా, గోదావరి నదుల నుంచి సుమారు 6,282 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వెళ్లాయి. గోదావరిలో పుష్కలంగా ఉన్న నీళ్లను తెలంగాణ వాడుకున్నా, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా అభ్యంతరం చెప్పలేదు. ఏపీలో నదులను అన్నింటినీ అనుసంధానించాలి. కృష్ణా-గోదావరి నదులు అనుసంధానం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

US Vice President: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇంటిపై దాడి.. కిటికీలు ధ్వంసం!

మాతృ భాష పరిరక్షణ మన బాధ్యత
ఘన చరిత్ర కలిగిన మన మాతృ భాషను ప్రతి ఒక్కరూ పరిరక్షించుకోవాలి. సంక్రాంతికి ముందే మనకు అమ్మ భాష పండుగ వచ్చింది. మాతృభాషకు మనం ఇచ్చే గౌరవ వందనమే ఈ ప్రపంచ తెలుగు మహా సభలు. ఈ మహత్తర కార్యక్రమాన్ని తలపెట్టిన ఆంధ్ర సారస్వత పరిషత్‌కు నా ప్రత్యేక అభినందనలు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన ఎన్టీఆర్ పేరును ఈ వేదికకు పెట్టినందుకు కృతజ్ఞతలు.  తెలుగు భాషకు ఎంతో ఘన చరిత్ర ఉంది. వందలాది భాషలున్న మన దేశంలో కేవలం 6 భాషలకే ప్రాచీన హోదా లభించాయి. అందులో తెలుగు ఉండటం మనందరికీ గర్వకారణం. హిందీ, బెంగాలీ, మరాఠీ తర్వాత దేశంలో తెలుగు మాట్లాడేవారే ఎక్కువ మంది ఉన్నారు. 

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ అసలు లెక్క ఇదే… పునాది నుంచి ముగింపు వరకు ఎవరి పాత్ర ఎంత?

ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే వారి సంఖ్య 10 కోట్లకు పైగానే ఉంది. ఈ సభలకు 40 దేశాల నుంచి ప్రతినిధులు రావడం సంతోషదాయకం. ఇలాంటి సభలు తెలుగు భాష పరిరక్షణకు, భాష గొప్పదనాన్ని చాటేందుకు ఉపయోగపడతాయి. తమిళనాడు, కర్నాటక, ఒడిశా, బెంగాల్‌లో కూడా తెలుగు చదివే విద్యార్ధులు ఉన్నారు. దేశంలో జాతీయ భావన పెరగాలి. ఒకరి భాషను మరొకరు గౌరవించుకోవాలి. ఇది దేశ ప్రజల మధ్య ఐక్యత తెస్తుంది. ఏ భాష తక్కువా కాదు... ఎక్కువా కాదు. మాతృభాష అమ్మతో సమానం. భాష అనేది మన సంస్కృతిని ముందుకు తీసుకు వెళుతుంది. మన అస్తిత్వాన్ని కాపాడుతుంది. అమ్మ భాషే లేకపోతే మన జీవితాలకు, మన జాతికి అర్థమే ఉండదని ముఖ్యమంత్రి అన్నారు.

16 Pro Max: ఐఫోన్ కొనాలనుకునేవాళ్లకి ఇదే గోల్డెన్ ఛాన్స్! 16 ప్రో మాక్స్‌పై షాకింగ్ డిస్కౌంట్!

తెలుగు భాషకు వన్నె తెచ్చిన మహనీయులు
తెలుగు సాహిత్యంలో మనకు ముందుగా గుర్తు వచ్చేది అదికవి నన్నయ్య రాసిన మహాభారతం. కవిత్రయం నుంచి అష్ట దిగ్గజాల వరకు... గురజాడ నుంచి శ్రీశ్రీ, దాశరథి వరకు... ఎందరో మహానుభావులు తెలుగు భాషకు సేవ చేశారు. తెలుగు వైభవాన్ని చాటారు. పోతన భాగవతం, శ్రీనాథుడి భీమ ఖండం, వేమన, సుమతి, భాస్కర పద్యాలను మర్చిపోలేం. అన్నమయ్య, రామదాసు, వెంగమాంబ, మొల్ల ఇలా భక్తి మార్గంలోనూ తెలుగుకు వన్నె తెచ్చారు. 

AP Medical: పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగాలు..! రాత పరీక్ష లేదు!

తెలుగును విశ్వవ్యాప్తం చేశారు. తెలుగు సాహిత్యంలో విశ్వనాథ సత్యనారాయణ, సి. నారాయణ రెడ్డి, రావూరి భరద్వాజ... జ్ఞానపీఠ్ అవార్డులు సొంతం చేసుకుని మన ఖ్యాతిని మరింత పెంచారు. గ్రాంథిక భాషకే పరిమితమైన తెలుగు వచనాన్ని ప్రజల వ్యవహార భాషగా మార్చిన మహనీయులు గిడుగు వెంకట రామమూర్తిని తెలుగు జాతి మర్చిపోదు. మద్రాసీలని పిలిచిన వారందరికీ తెలుగు వారి ఆత్మగౌరవం ఏమిటో చూపించిన వ్యక్తి ఎన్టీఆర్. నేను తెలుగువాడిని నాది తెలుగుదేశం పార్టీ అని ఎన్టీఆర్ చాటి చెప్పారు. దేశంలో మొదటిసారి భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు. 

DGCA కొత్త నిబంధనలు జారీ! విమానాల్లో వాటికి నో ఎంట్రీ!

ఆనాడు తెలుగు జాతి ఐక్యత కోసం బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈనాడు పత్రిక ద్వారా తెలుగు భాషకు రామోజీ రావు గారు చేసిన సేవను మరిచిపోలేం.  సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపిన పీవీ నరసింహారావు తెలుగు వారు కావడం మనకు గర్వ కారణం.  ఇటాలియన్ యాత్రికుడు ‘నికోలో డి కాంటే’ తెలుగును ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ అన్నారు. తమిళ కవి సుబ్రమణ్య భారతి ‘సుందర తెలుంగై’ అని కీర్తించారు. మన ప్రాస - యాస, మన సంధులు - సమాసాలు, మన సామెతలు – పొడుపు కథలు అన్నీ మనకే ప్రత్యేకం. అందుకే దేశ బాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణ దేవరాయులు కీర్తించారని సీఎం చంద్రబాబు అన్నారు.

SBI JOBS: SBIలో 1146 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు JAN 10 వరకు పొడిగింపు!

ఆంధ్ర సారస్వత పరిషత్ సేవలు అభినందనీయం
తెలుగు భాషా సంస్కృతి పరిరక్షణ, అభివృద్ధి కోసం ఆంధ్ర సారస్వత్ పరిషత్ సేవలను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. ఈ సభల ద్వారా విదేశాల నుంచి తెలుగు ప్రతినిధుల్ని ఒకే వేదిక పైకి తీసుకొచ్చారు.  కవి సమ్మేళనాలు, సదస్సులు, పుస్తక ప్రదర్శనలతో తెలుగు సంస్కృతిని సదస్సులో చాటారు. తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్న వారికి, ప్రతిభ చూపిన వారికి పూర్ణ కుంభ పురస్కారాలు, ఆంధ్ర శ్రీ - ఆంధ్ర సారస్వత రత్న వంటి అవార్డులు ఇవ్వడం శుభ పరిణామం. నాడు 1911లో చెన్నయ్‌లో నాటిన చిన్న విత్తనం 1949లో హైదరాబాద్‌లో ఆంధ్ర సారస్వత పరిషత్‌గా ఎదిగింది. ఇప్పుడు మరింతగా విస్తరిస్తోంది. 

Bay of Bengal : బంగాళాఖాతంలో అల్పపీడనం.. APలో మళ్లీ వర్షాల సూచనలు!

గజల్ శ్రీనివాస్, కడిమిళ్ల వరప్రసాద్, మేడికొండ శ్రీనివాస్, చక్రావధానుల రెడ్డప్ప వంటి వారు 2017లో ఆంధ్ర సారస్వత్ పరిషత్‌ను మళ్లీ ఊపిరి పోశారు. 2022లో భీమవరంలో, 2024లో రాజమండ్రిలో, ఇవాళ గుంటూరులో ఈ సంబరాలు చేస్తున్నారు. 2027లో మారిషస్ లో నిర్వహించ తలపెట్టారు. తెలుగు మహా సభలకు ఏపీ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది. విలువలు నేర్పేది సంస్కృతి. ఆ సంస్కృతికి మూలం భాష.. భాషాభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తాం. అలాగే వివిధ దేవాలయాల్లో ఆస్థాన విద్వాంసులను, ఆస్థాన కవులను నియమించే అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. ప్రపంచ మహాసభలకు హాజరైన ఉపాధ్యాయులకు ఆన్ డ్యూటీగా పరిగణిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.

2 వేల ఎకరాల్లో కొత్త పోర్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్! రూపురేఖలు మారనున్న 6 మండలాలు.. 15 వేల మందికి ఉపాధి ఖాయం!

టెక్నాలజీతో భాషను కాపాడుకోవడం సులభం
హిందీ తర్వాత ఎక్కువ రాష్ట్రాల్లో ప్రజలు మాట్లాడే ఏకైక భాష తెలుగు. మాతృభాష మన మూలాలకు సంకేతం. ముందు మాతృభాషలో రాణిస్తేనే ఏ రంగంలోనైనా రాణిస్తాం. టెక్నాలజీ వల్ల భాషను కాపాడుకోవడం సులభతరం అవుతుంది. ఉద్యోగానికి, ఉపాధికి ఇంగ్లీష్ అవసరం. జీవితానికి మాతృభాష అవసరం. భాష కేవలం కమ్యూనికేషన్ మాత్రమే కాదు. అది మన ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలకు ఆధారం. మాతృభాషను కాపాడితేనే సంస్కృతి నిలబడుతుంది. ఎన్టీఆర్ 1985లో హైదరాబాద్‌లో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీని స్థాపించారు. 

Aviation News: ఆ రాష్ట్రానికి శుభవార్త… కొత్త విమానాశ్రయ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్!!

రాజమహేంద్రవరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రధాన కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. ఆనాడు తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ఎన్టీఆర్ చాటి చెప్పగా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని నేను పిలుపునిచ్చాను. నాలెడ్జ్ ఎకానమీలో తెలుగు జాతి ముందుండాలని నాడు సైబరాబాద్ నిర్మించి ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. నేను ఇచ్చిన ఐటీ పిలుపుతో ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు వారు అద్భుతంగా రాణిస్తున్నారు. సమైక్యాంధ్రలో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్షనేతగా నవ్యాంధ్రలో రెండోసారి ముఖ్యమంత్రి పనిచేసే అవకాశమిచ్చిన తెలుగు ప్రజలకు జీవితమంతా రుణపడి ఉంటాను. చాలా దేశాల్లో జనాభా తగ్గుతోంది. 

New Phone: రియల్‌మి సంచలనం.. కేవలం రూ. 10,499 కే 108MP కెమెరా, 7400mAh బ్యాటరీతో..

వయోవృద్ధులు పెరుగుతున్నారు. మన దేశానికి యువత గొప్ప వరం. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరం భాగస్వాములవుదాం. ప్రపంచంలో తెలుగు జాతి గొప్ప స్థానంలో నిలవాలన్నదే నా సంకల్పం. మన కవులు, కళాకారులు, వారసత్వ సంపదను కాపాడుకుందాం. భారతీయ కుటుంబ వ్యవస్థ ఎంతో గొప్పది. మన సంస్కృతిని చాటి చెప్పే పండుగలను ఆనందంగా జరుపుకుందాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి గోవా గవర్నర్ పి. అశోక్ గజపతి రాజు, ఏపీ శాసనసభ స్పీకర్ సీహెచ్ అయ్యన్న పాత్రుడు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్థానిక ప్రజాప్రతినిధులు ప్రముఖులు హాజరయ్యారు.

రేషన్ కార్డు ఉన్నవారికి అకౌంట్లోనే డబ్బులు! దేశవ్యాప్తంగా మొదలైన ఆసక్తికర చర్చ! కేంద్రం బిగ్ ఆఫర్..
Bunny incident: అభిమానమే శత్రువయ్యిందా.. బన్నీ ఘటనపై చర్చ!
మళ్లీ తండ్రైన అంబ‌టి.. కొడుకు పుట్టాడంటూ పోస్ట్! సోషల్ మీడియాలో వైరల్..
Eating almonds: రోజూ బాదం తింటే శరీరానికి వచ్చే 6 అద్భుత లాభాలు.. గుండె నుంచి మెదడు వరకు!
Tollywood: అనసూయపై సీనియర్ నటి పరోక్షంగా ఫైర్! దానికి ఆయన క్షమాపణలు..
Bhairavs entry: భారత సైన్యంలోకి భైరవ్ ఎంట్రీ.. శత్రువులపై మెరుపు దాడులకే కొత్త ఫోర్స్!

Spotlight

Read More →