LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

chandrababu: రేపు పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (జూన్ 8) పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఆచంట నియోజకవర్గంలోని సిద్ధాంతం గ్రామంలో జరిగే ఈ సభలో రైతులకు కొత్త పట్ట…

AndhraPravasi News Desk 2 min read
chandrababu: రేపు పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
  • రైతులతో భేటీ అనంతరం పార్టీ శ్రేణులతో సమీక్ష నిర్వహించనున్న సీఎం..
     
  • Politics: గడిచిన 6 నెలల్లో 26.46 లక్షల పాస్‌పుస్తకాలు అందజేసిన ప్రభుత్వం..

chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (జూన్ 8) పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఆచంట నియోజకవర్గంలోని సిద్ధాంతం గ్రామంలో జరిగే ఈ సభలో రైతులకు కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలను ముఖ్యమంత్రి స్వయంగా అందజేస్తారు. అనంతరం రైతులతో ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకుంటారు.

గత ప్రభుత్వ హయాంలో జారీ చేసిన పాస్‌పుస్తకాల్లోని తప్పులను సరిదిద్ది, పారదర్శకమైన రీతిలో కొత్త పాస్‌పుస్తకాలను అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. రైతుల సమక్షంలోనే భూములను రీ-సర్వే చేసి, వారి ఆమోదం తర్వాతే తుది రికార్డులను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతీ నెలా ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా రైతులతో సమావేశమై, వారి సమక్షంలోనే అధికారులతో భూ వివరాలను చదివించి పాస్‌పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు.

6 నెలల్లో 26.46 లక్షల పాస్‌పుస్తకాల పంపిణీ..
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, జనవరి నుంచి రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 6,688 గ్రామాల్లో రీ-సర్వే పూర్తి కాగా, అందులో 6,459 గ్రామాలకు చెందిన 26.46 లక్షల మంది రైతులకు కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలను ప్రభుత్వం అందించింది. రానున్న 9 నెలల్లో మరో 10,357 గ్రామాల్లో రీ-సర్వే పూర్తి చేసి, 67.32 లక్షల పాస్‌పుస్తకాలను పంపిణీ చేయాలని సీఎం లక్ష్యంగా నిర్దేశించారు. 

దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్లాక్‌చైన్ ఆధారిత భూ రికార్డుల వ్యవస్థను అమలు చేస్తోంది. దీని ద్వారా ప్రతీ భూ యూనిట్‌కు ఒక శాశ్వత బ్లాక్‌చైన్ ఐడీ కేటాయిస్తున్నారు. తద్వారా రికార్డులను తారుమారు చేయడం అసాధ్యం. సర్వే నుంచి తుది రికార్డు వరకు ప్రతి దశలోనూ రైతు ఈ-కేవైసీని తప్పనిసరి చేశారు.

ముఖ్యమంత్రి పర్యటన వివరాలు..
సోమవారం ఉదయం 10:25 గంటలకు అమరావతి నుంచి బయలుదేరనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, 11 గంటలకు సిద్ధాంతం గ్రామానికి చేరుకుంటారు. 11:15 గంటలకు ‘మీ భూమి-మీ హక్కు’ ప్రజా వేదిక సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2:30 గంటలకు రైతులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. అనంతరం 3:15 గంటలకు టీడీపీ శ్రేణులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలు ముగించుకుని సాయంత్రం 5:35 గంటలకు తిరిగి అమరావతికి చేరుకుంటారు.

Be the first to react

More Coverage

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: కేంద్ర ప్రభుత్వం జూలైలో నిర్వహించబోయే ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, జమిలి ఎన్నికల…