LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Public Litigation Policy: న్యాయశాఖ బలోపేతానికి కూటమి ప్రభుత్వ చర్యలు! పబ్లిక్ లిటిగేషన్ పాలసీ-2025పై మంత్రివర్గ ఉపసంఘం భేటీ!

Public Litigation Policy: రాష్ట్రంలో న్యాయ వ్యవస్థను మరింత పటిష్టంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో “ఆంధ్రప్రదేశ్ స్టేట్ పబ్లిక్ లిటిగేషన్ పాలసీ-2025”పై మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో సమావేశమైంది.

AndhraPravasi News Desk 1 min read
Public Litigation Policy: న్యాయశాఖ బలోపేతానికి కూటమి ప్రభుత్వ చర్యలు! పబ్లిక్ లిటిగేషన్ పాలసీ-2025పై మంత్రివర్గ ఉపసంఘం భేటీ!

న్యాయ శాఖ పటిష్టత కోసం చర్యలు..

పబ్లిక్ లిటిగేషన్ పాలసీ- 2025పై మంత్రి వర్గ ఉపసంఘం భేటి..

అమరావతి: రాష్ట్రంలో న్యాయ వ్యవస్థను మరింత పటిష్టంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో “ఆంధ్రప్రదేశ్ స్టేట్ పబ్లిక్ లిటిగేషన్ పాలసీ-2025”పై మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో సమావేశమైంది.

ఈ సమావేశంలో రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పాల్గొన్నారు. న్యాయశాఖ ఉన్నతాధికారులతో కలిసి పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు.

రాష్ట్రంలో అనవసరమైన వ్యాజ్యాలను తగ్గించడం, కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయడం ప్రధాన లక్ష్యమని మంత్రి ఫరూక్ తెలిపారు. పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

కేసులు కోర్టులకు వెళ్లే ముందే పరిష్కరించే విధానాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ముందస్తు కేసు నిర్వహణ ద్వారా అప్పీల్స్‌ను సమర్థవంతంగా దాఖలు చేయడం, విధానపరమైన జాప్యాలను తొలగించడం వంటి అంశాలపై మంత్రుల ఉపసంఘం సూచనలు చేయనుంది.

ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానాలు (ADR) ను ప్రోత్సహించడం, లోక్ అదాలత్‌లను మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందేలా వ్యవస్థను తీర్చిదిద్దడమే లక్ష్యమని మంత్రులు పేర్కొన్నారు.

ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న లిటిగేషన్ పాలసీలను పరిశీలించి, అక్కడి మంచి పద్ధతులను ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేయాలని మంత్రులు సూచించారు. సంస్కరణలను కూలంకషంగా అధ్యయనం చేసి రాష్ట్రానికి అనుకూలంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభా దేవి సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.

న్యాయ వ్యవస్థను వేగవంతం చేసి ప్రజలకు సమయానికి న్యాయం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు, భవిష్యత్తులో కేసుల భారం తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు.

Be the first to react

More Coverage

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: కేంద్ర ప్రభుత్వం జూలైలో నిర్వహించబోయే ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, జమిలి ఎన్నికల…