Pawan Kalyan: నా తప్పుంటే నడిరోడ్డుపై ఉరితీయండి.. కానీ ప్రజల మధ్య గొడవలు పెట్టొద్దు: పవన్ సంచలన సవాల్! AP Development: 6 జిల్లాల్లో 525 ఘాట్లు, మెగా సిటీగా ఆ ప్రాంతం... రూపు రేఖలు మారబోతున్నాయ్...!! Chandrababu: టీడీపీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్ వర్క్‌షాప్.. దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్! Chandrababu: తెలుగు జాతి ఐక్యత చాటిన చంద్రబాబు.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ నెట్టింట వైరల్‌గా మారిన పోస్ట్! New Flyover: ఆ జోన్‌లో ఆరులైన్ల భారీ ఫ్లైఓవర్‌.. ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్! PM Modi: దేశంలో 32వేల టన్నుల నిరుపయోగ పసిడి.. బంగారం రీసైక్లింగ్‌పై ప్రధాని మోదీ కీలక పిలుపు! Salary Hike: వారికి గుడ్‌న్యూస్.. జీతాల పెంపుపై మంత్రి కీలక ప్రకటన! Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్.. వాటిపై కీలక సమీక్ష! AP Government: ఏపీ ప్రభుత్వం బంపర్ గిఫ్ట్.. ఆ సామాజిక వర్గానికి ఎస్టీ సర్టిఫికెట్ల జారీకి గ్రీన్ సిగ్నల్! Pawan Kalyan: నా తప్పుంటే నడిరోడ్డుపై ఉరితీయండి.. కానీ ప్రజల మధ్య గొడవలు పెట్టొద్దు: పవన్ సంచలన సవాల్! AP Development: 6 జిల్లాల్లో 525 ఘాట్లు, మెగా సిటీగా ఆ ప్రాంతం... రూపు రేఖలు మారబోతున్నాయ్...!! Chandrababu: టీడీపీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్ వర్క్‌షాప్.. దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్! Chandrababu: తెలుగు జాతి ఐక్యత చాటిన చంద్రబాబు.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ నెట్టింట వైరల్‌గా మారిన పోస్ట్! New Flyover: ఆ జోన్‌లో ఆరులైన్ల భారీ ఫ్లైఓవర్‌.. ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్! PM Modi: దేశంలో 32వేల టన్నుల నిరుపయోగ పసిడి.. బంగారం రీసైక్లింగ్‌పై ప్రధాని మోదీ కీలక పిలుపు! Salary Hike: వారికి గుడ్‌న్యూస్.. జీతాల పెంపుపై మంత్రి కీలక ప్రకటన! Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్.. వాటిపై కీలక సమీక్ష! AP Government: ఏపీ ప్రభుత్వం బంపర్ గిఫ్ట్.. ఆ సామాజిక వర్గానికి ఎస్టీ సర్టిఫికెట్ల జారీకి గ్రీన్ సిగ్నల్!

Pawan Kalyan: నా తప్పుంటే నడిరోడ్డుపై ఉరితీయండి.. కానీ ప్రజల మధ్య గొడవలు పెట్టొద్దు: పవన్ సంచలన సవాల్!

ఆంధ్రా, తెలంగాణ ప్రజల మధ్య కొందరు కావాలనే విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, ఇది దేశ సమగ్రతకే ప్రమాదమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పాలకుల తప్పులకు ప్రజలను బాధ్యుల్ని చేయడం సరికాదని, తాను ఎప్పుడూ తెలంగాణ ప్రజలను గౌరవిస్తానని స్పష్టం చేశారు.

Published : 2026-06-02 19:06:00
  • ఓ విశ్లేషకుడు అమిత్ షాతో తన భేటీపై తప్పుగా మాట్లాడటంతో వివాదం మొదలైందన్న పవన్..
     
  • Politics: పాలకుల తప్పులకు ప్రజలను బాధ్యులను చేయొద్దని హితవు..  

Pawan Kalyan: ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల ప్రజల మధ్య కొందరు స్వార్థపరులు కావాలనే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, ఇటువంటి చర్యలు దేశ సమగ్రతకే తీవ్ర ప్రమాదకరమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. గత పాలకుల రాజకీయ తప్పులకు సామాన్య ప్రజలను బాధ్యుల్ని చేయడం ఎంతమాత్రం సరికాదని, తాను ఎల్లప్పుడూ తెలంగాణ సమాజాన్ని, ఇక్కడి ప్రజలను మనస్ఫూర్తిగా గౌరవిస్తానని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఒక ప్రత్యేక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల నేపథ్యంలో ఇటీవల తనపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దుష్ప్రచారం మరియు వ్యక్తిగత విమర్శల పట్ల తీవ్రంగా స్పందించారు. అసలు ఈ వివాదం ఎందుకు, ఎక్కడ మొదలైందనే నిజాలను వెల్లడిస్తూ, తాను ఎంతో గౌరవించే ఒక ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన తన వ్యక్తిగత భేటీ గురించి మీడియా డిబేట్లలో పూర్తిగా తప్పుడు వ్యాఖ్యలు చేశారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తాను, అమిత్ షా గారు అంతర్గతంగా మాట్లాడుకున్న విషయాలన్నీ పక్కనే ఉండి విన్నట్టుగా సదరు విశ్లేషకుడు అబద్ధాలు ప్రచారం చేశారని, ఆ అసత్యాలను తాను కేవలం వాస్తవాలతో ఖండించడంతోనే ఈ వివాదానికి తెరలేచిందని వివరించారు.

తాను కేవలం వాస్తవాలను మాత్రమే ప్రజల ముందుంచినప్పటికీ, దానిని తట్టుకోలేక కొందరు తనపై తిట్ల దండకం మొదలుపెట్టారని, దానికి ప్రతిచర్యగా ఏపీలోని తమ జనసైనికులు భావోద్వేగంతో కొన్ని లీగల్ కేసులు పెట్టారని తెలిసిందని పవన్ కల్యాణ్ వెల్లడించారు. అయితే ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజమని భావించి ఆ కేసులన్నింటినీ తక్షణమే ఉపసంహరించుకుని వదిలేయమని తానే స్వయంగా జనసేన శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చానని చెప్పారు. అయినప్పటికీ కొందరు కావాలనే ప్రెస్‌క్లబ్‌ వేదికగా మళ్లీ తనను వ్యక్తిగతంగా దూషిస్తూ, రెండు రాష్ట్రాల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రపూరిత ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎలాగైనా తన మీద 'తెలంగాణ వ్యతిరేకి' అనే ముద్ర వేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు దాటినప్పటికీ, ఇక్కడ ఇప్పటికీ స్థానిక యువతకు ఆశించిన స్థాయిలో ఉపాధి లభించకపోయినా, కొత్త పరిశ్రమలు రాకపోయినా దానికి ఇంకా ఆంధ్రులే కారణమంటూ పాత పద్ధతిలో నిందించడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. ప్రతి చిన్న విషయానికి పవన్ కల్యాణే కారణమని, ఆంధ్రా ప్రజలే కారణమని సాకు రంగు పులిమితే, భవిష్యత్తులో హైదరాబాద్ నగరానికి కొత్త పెట్టుబడులు ఎలా వస్తాయని, పారిశ్రామికవేత్తలు ఇక్కడికి ఎలా వస్తారని ప్రశ్నిస్తూ, తెలంగాణ మేధావులు, సామాన్య ప్రజలు ఈ కుట్ర వెనుక ఉన్న అసలు విషయాన్ని గ్రహించాలని కోరారు.

ఒకప్పుడు తమిళనాడు రాజధాని మద్రాసులో కేంద్రీకృతమై ఉన్న తెలుగు చలనచిత్ర పరిశ్రమను, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి గారు ఎంతో ముందుచూపుతో, వ్యూహాత్మకంగా హైదరాబాద్‌కు తీసుకొచ్చారని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. దాదాపు 50 ఏళ్లకు పైగా ఉమ్మడిగా కలిసి ఉన్న చారిత్రాత్మక రాజధాని ఇదని, అలాంటి మహానగరానికి ఇప్పుడు కొంతమంది సంకుచిత నాయకులు వచ్చి ఆంధ్రా వారు ఇక్కడికి రాకూడదంటూ ఆంక్షలు మాట్లాడటం విచారకరమన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన మొదటి నుంచీ ఒకటే చెబుతున్నానని, సమాజంలో ప్రజలు వేరని, రాజకీయం చేసే పాలకులు వేరని స్పష్టం చేశారు. ఒకవేళ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం చేసిన పాలకులు ఉంటే వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని, ఆ అన్యాయంలో పవన్ కల్యాణ్ భాగస్వామ్యం ఉన్నట్లు నిరూపిస్తే తనను నడిరోడ్డుపై ఊరి తీసినా సిద్ధమేనని సవాల్ విసిరారు. అంతేగానీ, కేవలం పాలకుల స్వార్థ రాజకీయాల కోసం అమాయక ప్రజల మధ్య విద్వేషపు గోడలు సృష్టించవద్దని హితవు పలికారు. ఇటువంటి ప్రాంతీయ ద్వేష భావనలు దేశ భవిష్యత్తుకు ఏమాత్రం మంచిది కాదని, రేపు గుజరాత్‌లోని సూరత్‌లో స్థిరపడిన తెలుగువారిని ఉండొద్దని అక్కడి గుజరాతీలు, మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఉన్న మన వారిని వెళ్ళిపోమని అక్కడి మహారాష్ట్రీయులు అంటే ఈ దేశం అంతర్గతంగా నిలబడుతుందా అని ప్రశ్నించారు. సరిహద్దులు ఏవైనా మనమంతా అంతిమంగా భారతీయులం అనే పరమ సత్యాన్ని ఎవరూ మర్చిపోవద్దని, తెలంగాణ కూడా భారతదేశంలో ఒక అత్యంత అంతర్భాగమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. 

Spotlight

Read More →