LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతి!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

AP Government: ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ఆరోగ్యం, అభివృద్ధి లక్ష్యంగా వందల కోట్ల నిధుల విడుదల!

AP Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాల కోసం భారీగా నిధులను విడుదల చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది. సామాన్య ప్రజల ఆరోగ్యం, పిల్లల పోషణ, మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా వెల్లడించిన నిధుల వివరాలు మనం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

AndhraPravasi News Desk 2 min read
AP Government: ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ఆరోగ్యం, అభివృద్ధి లక్ష్యంగా వందల కోట్ల నిధుల విడుదల!
  • Politics: ప్రజారోగ్యానికి భరోసా: నేషనల్ హెల్త్ మిషన్ కోసం రూ. 50 కోట్ల అదనపు నిధులు మంజూరు..
     
  • సంక్షేమం + అభివృద్ధి: అంగన్‌వాడీ పిల్లల నుండి హైవే ప్రయాణికుల వరకు అందరికీ గుడ్ న్యూస్!

AP Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ అభివృద్ధి  సంక్షేమ పథకాల కోసం భారీగా నిధులను విడుదల చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది. సామాన్య ప్రజల ఆరోగ్యం, పిల్లల పోషణ,  మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా వెల్లడించిన నిధుల వివరాలు మనం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

ప్రజారోగ్యానికి పెద్దపీట
నేషనల్ హెల్త్ మిషన్ నిధులు.. రాష్ట్రంలోని ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా, నేషనల్ హెల్త్ మిషన్ (NHM) కింద ప్రభుత్వం 50 కోట్ల రూపాయల అదనపు నిధులను మంజూరు చేసింది. ఈ నిధులను ప్రధానంగా తల్లి-పిల్లల ఆరోగ్యం (RCH), పట్టణ ఆరోగ్య మిషన్  వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల బలోపేతం కోసం ఖర్చు చేయనున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సదుపాయాలు మెరుగుపడటమే కాకుండా, సామాన్యులకు ఉచిత వైద్యం మరింత చేరువవుతుంది.

చిన్నారుల భవిష్యత్తు కోసం సాక్షం అంగన్‌వాడీ  పోషణ్ 2.0..
పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలలో పోషకాహార లోపాన్ని నివారించడానికి ప్రభుత్వం రూ. 26,02,81,667 నిధులను విడుదల చేసింది. 'పోషణ్ అభియాన్' పథకంలో భాగంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి మూడవ విడతగా ఈ మొత్తాన్ని కేటాయించారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషకాహార వితరణ  ఇతర సేవల నిర్వహణకు ఈ నిధులు వెన్నెముకగా నిలుస్తాయి.

రహదారుల అభివృద్ధి
నేషనల్ హైవే పనులకు ఊతం.. రాష్ట్రంలో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. సెంట్రల్ రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (CRIF) పథకం కింద నేషనల్ హైవే పనులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లులను చెల్లించడానికి 60 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. దీనివల్ల ఆగిపోయిన రహదారి పనులు వేగవంతం కావడమే కాకుండా, ప్రయాణాలు మరింత సుఖమయం అవుతాయి.

పట్టణాల పరిశుభ్రత:
స్వచ్ఛ భారత్ మిషన్ నిధులు.. నగరాలు  పట్టణాలను పరిశుభ్రంగా ఉంచే 'స్వచ్ఛ భారత్ మిషన్' (SBM) కోసం ప్రభుత్వం రూ. 3,33,33,333 అదనపు నిధులను కేటాయించింది. ఈ నిధులను ప్రధానంగా సిబ్బంది నైపుణ్యాభివృద్ధి (Skill Development)  నాలెడ్జ్ మేనేజ్‌మెంట్ కోసం వినియోగించనున్నారు. మన పరిసరాలు శుభ్రంగా ఉంటేనే కదా మనం ఆరోగ్యంగా ఉండేది! ఆ దిశగా మున్సిపల్ శాఖ ఈ నిధులతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనుంది.

పులివెందుల మున్సిపాలిటీ.. పెండింగ్ బకాయిల విడుదల…
వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల మున్సిపాలిటీలో గతంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపు కోసం ప్రభుత్వం రూ. 5,39,08,419 విడుదల చేస్తూ పరిపాలనా అనుమతులు జారీ చేశారు. ఇందులో సీసీ రోడ్ల నిర్మాణం వంటి పనులు ఉన్నాయి. పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు ఈ నిధుల ద్వారా బకాయిలు చెల్లించి, పట్టణ అభివృద్ధిని నిరంతరం కొనసాగించనున్నారు.

ప్రభుత్వం విడుదల చేసిన ఈ నిధులు  లక్షలాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చే వనరులు. అంగన్‌వాడీలో పౌష్టికాహారం తీసుకునే చిన్నారి నుండి, మెరుగైన రహదారుల మీద ప్రయాణించే సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరికీ ఈ నిర్ణయాలు మేలు చేకూరుస్తాయి

Be the first to react

More Coverage

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…