Chandrababu: మోదీ, అమిత్ షాలకు చంద్రబాబు అభినందనలు.. బెంగాల్, అస్సాం ఫలితాలపై హర్షం.. Tamil Politics: దూసుకుపోతున్న టీవీకే.. విజయ్ ఇంటి వద్ద భద్రత పెంపు.. దళపతి నివాసం వద్ద భారీ పోలీస్ బందోబస్తు.! New Pensions: ఏపీలో కొత్త పెన్షన్ల దరఖాస్తులపై కీలక అప్డేట్! TVK party: 50 ఏళ్ల రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తున్న టీవీకే.! విజయ్ ప్రభంజనం.. కింగ్‌మేకర్‌గా దళపతి? Farmers: రైతులకు శుభవార్త... భారీ సబ్సిడీతో వ్యవసాయ యంత్రాల పంపిణీ! పూర్తి వివరాలు... PM Modi: ఐదు రాష్ట్రాల కౌంటింగ్ వేళ.. మోదీ ట్వీట్‌పై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ! Pawan Kalyan: సింధు ప్రశంసలు.. పవన్ రిప్లై: ‘మ్యాజిక్’ డ్రెయిన్స్‌పై ఆసక్తికర చర్చ! Chandrababu: నేడు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీ షెడ్యూల్! Mahanadu 2026: నెల్లూరు మహానాడుకు భారీ ఏర్పాట్లు- మంత్రి నారాయణ! Elections 2026: మరికాసేపట్లో కౌంటింగ్.. నాలుగు రాష్ట్రాల సమరం! నేడే తుది ఫలితాలు - ఎవరికి పట్టం? Chandrababu: మోదీ, అమిత్ షాలకు చంద్రబాబు అభినందనలు.. బెంగాల్, అస్సాం ఫలితాలపై హర్షం.. Tamil Politics: దూసుకుపోతున్న టీవీకే.. విజయ్ ఇంటి వద్ద భద్రత పెంపు.. దళపతి నివాసం వద్ద భారీ పోలీస్ బందోబస్తు.! New Pensions: ఏపీలో కొత్త పెన్షన్ల దరఖాస్తులపై కీలక అప్డేట్! TVK party: 50 ఏళ్ల రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తున్న టీవీకే.! విజయ్ ప్రభంజనం.. కింగ్‌మేకర్‌గా దళపతి? Farmers: రైతులకు శుభవార్త... భారీ సబ్సిడీతో వ్యవసాయ యంత్రాల పంపిణీ! పూర్తి వివరాలు... PM Modi: ఐదు రాష్ట్రాల కౌంటింగ్ వేళ.. మోదీ ట్వీట్‌పై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ! Pawan Kalyan: సింధు ప్రశంసలు.. పవన్ రిప్లై: ‘మ్యాజిక్’ డ్రెయిన్స్‌పై ఆసక్తికర చర్చ! Chandrababu: నేడు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీ షెడ్యూల్! Mahanadu 2026: నెల్లూరు మహానాడుకు భారీ ఏర్పాట్లు- మంత్రి నారాయణ! Elections 2026: మరికాసేపట్లో కౌంటింగ్.. నాలుగు రాష్ట్రాల సమరం! నేడే తుది ఫలితాలు - ఎవరికి పట్టం?

గ్రామీణ రహదారులకు గ్రీన్ సిగ్నల్! కూటమి ప్రభుత్వంతో ప్రణాళికలు పునరుద్ధరణ!

వైకాపా ప్రభుత్వంలో గత ఐదేళ్లుగా రాష్ట్ర వాటా నిధులివ్వకుండా భ్రష్టు పట్టించిన గ్రామీణ రహదారుల ప్రాజెక్టులోని పెండింగ్ పనులను కూటమి ప్రభుత్వం పరుగులు పెట్టించనుం

Published : 2024-11-07 09:24:00

వైకాపా ప్రభుత్వంలో గత ఐదేళ్లుగా రాష్ట్ర వాటా నిధులివ్వకుండా భ్రష్టు పట్టించిన గ్రామీణ రహదారుల ప్రాజెక్టులోని పెండింగ్ పనులను కూటమి ప్రభుత్వం పరుగులు పెట్టించనుంది. ప్రాజెక్టు అంచనా వ్యయంలో రుణ పరిమితిని 90 శాతానికి పెంచాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిపై ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు సానుకూలంగా స్పందించింది. బ్యాంకు వాటా నిధులను ముందుగా (అడ్వాన్స్ మోడ్లో) ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ ఏడాది డిసెంబరుతో ముగియనున్న ప్రాజెక్టు గడువును 2026 డిసెంబరు నెలాఖరు వరకు పొడిగించేందుకూ అంగీకరించింది. దీనిపై కొద్ది రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి అధికారిక సమాచారం రానుంది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో రూ.4,976 కోట్లతో 7,213 కిలోమీటర్ల మేర 3,665 రహదారుల నిర్మాణ పనులకు తెదేపా ప్రభుత్వ హయాంలో 2019 ఫిబ్రవరిలో ఏషియన్ బ్యాంకుతో ఒప్పందం జరిగింది. ప్రాజెక్టు అంచనా వ్యయంలో 70% బ్యాంకు రుణం, మిగిలిన 30% రాష్ట్ర ప్రభుత్వ వాటాగా సమకూర్చాలని అప్పట్లో నిర్ణయించారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం రాష్ట్ర వాటా నిధులను సరిగా ఇవ్వని కారణంగా ప్రాజెక్టు గడువు ఈ ఏడాది డిసెంబరుతో ముగిసిపోతున్నా.. తొలి దశలో ప్రారంభించిన రోడ్ల పనులు కూడా పూర్తికాలేదు. గుత్తేదారులకు రూ.600 కోట్ల వరకు బిల్లులను పెండింగ్ పెట్టారు.



ఇంకా చదవండిఏపీకి అదిరిపోయే శుభవార్త.. మన సీఎం ఐడియా వారెవ్వా! కేంద్రం మరో ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లా ప్రజలు ఎగిరి గంతేయాల్సిందే! 



తగ్గిన ప్రభుత్వ వాటా..
పెండింగ్ రహదారుల పనుల పూర్తికి కూటమి ప్రభుత్వ ప్రయత్నం ఫలించడంతో ప్రాజెక్టు అంచనా వ్యయంలో ఏషియన్ బ్యాంకు 70 శాతానికి బదులు 90% రుణంగా ఇచ్చేందుకు ముందుకొచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ వాటా 30% నుంచి 10%కి తగ్గింది. బ్యాంకు వాటా మొత్తాలను ముందుగా ఇవ్వాలన్న నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వంపైనా ఆర్థిక భారం తగ్గనుంది. వాస్తవంగా ప్రాజెక్టు ప్రారంభంలో ఇదే విధానం అమలులో ఉండేది. గత వైకాపా ప్రభుత్వం బ్యాంకు విడుదల చేసిన మొత్తాలనూ ఇతర అవసరాలకు మళ్లించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఖర్చు చేశాకే తమ వాటా నిధులిస్తామని బ్యాంకు షరతు పెట్టింది.
అయిదేళ్లలో పూర్తి చేసినవి 1,554 రహదారులే
ప్రాజెక్టులో ప్రతిపాదిత 3,665 రహదారుల్లో వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో 1,554 రోడ్ల పనులే పూర్తి చేసింది. తాజాగా ప్రాజెక్టు గడువు పెంపునకు ఏషియన్ బ్యాంకు అంగీకరించడంతో కూటమి ప్రభుత్వం వచ్చే రెండేళ్లలో 2,111 రహదారుల పనులు పూర్తి చేయాలి. ఇవి పూర్తయితే గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా 4,249 కిలోమీటర్ల మేర రహదారులు అందుబాటులోకి వస్తాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 కోట్లు సమకూర్చాలి. బ్యాంకు తన వాటాగా దాదాపు రూ.3 వేల కోట్ల వరకు రుణం విడుదల చేస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నేడు ఢిల్లీలో అమిత్ షాను కలవనున్న పవన్ కల్యాణ్! ఎందుకో తెలుసా! కేబినెట్ భేటీ ముగిసిన వెంటనే!

ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం! విద్యావిధానంలో మరియు ఆ విషయంలో కీలక మార్పులు.. ఇక పండగే!

మీరు స్కూటీ కొనాలనుకుంటున్నారా..? అదిరిపోయే ఫీచర్లతో - అతి తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటీ!

గత ఐదేళ్లలో తప్పులు జరిగిన మాట నిజమే! సంచలన వ్యాఖ్యలు చేసిన డీజీపీ! ఇక వారికి మోతే!

బీఎస్‌ఎన్‌ఎల్‌ స్పెషల్‌ రీఛార్జ్‌ ఆఫర్‌! అన్‌లిమిటెడ్‌ కాల్స్‌... 600 జీబీ డేటా!

ఆ న్యూస్ వెబ్సైట్ కి భారీ షాక్! కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ! ఎందుకంటే..  

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →