ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు జంటగా నటించిన ‘డ్యూడ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేస్తోంది. ఈ నెల 17న విడుదలైన ఈ చిత్రం మొదటి రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి రికార్డులు సృష్టించింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. తొలి రోజు రూ.22 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ, రెండో రోజుకే ఆ సంఖ్యను అధిగమించి రూ.23 కోట్లను దాటడం విశేషం. ముఖ్యంగా చిన్న హీరో సినిమాలకు సాధారణంగా ఇంత భారీ ఓపెనింగ్స్ రావడం అరుదు. కానీ ప్రదీప్ రంగనాథన్ కెరీర్లో ఇది గేమ్ ఛేంజర్‌గా మారిందని సినీ విశ్లేషకులు అంటున్నారు.
డ్యూడ్ సినిమా యువతను బాగా ఆకట్టుకుంటోంది. లవ్, కామెడీ, ఎమోషన్ల మేళవింపుతో ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు. థియేటర్లలో యూత్ రెస్పాన్స్ ఊహించని స్థాయిలో ఉంది. ‘లవ్ టుడే’ తర్వాత ప్రదీప్ చేసిన ఈ మూవీ కూడా ఆ అంచనాలను నిలబెట్టిందని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రేక్షకులు “ఇది కేవలం సినిమా కాదు ఎమోషనల్ జర్నీ” అంటూ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో ప్రమోషన్ చేయడంతో పాటు, థియేటర్ల సంఖ్యను కూడా పెంచారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో హౌస్‌ఫుల్ షోలు కొనసాగుతున్నాయి. ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ప్రత్యేకించి అమెరికా, సింగపూర్, మలేసియా దేశాల్లో రెండో రోజు కలెక్షన్స్ ఊహించిన దానికంటే ఎక్కువగా ఉన్నట్లు ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి.
‘డ్యూడ్’ సక్సెస్‌తో ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు కొత్త స్టార్‌గా నిలిచారు. అతని నేచురల్ యాక్టింగ్, సింపుల్ స్టోరీటెల్లింగ్ పద్ధతి ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరోయిన్ మమితా బైజు పాత్ర కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు అదనపు బలం ఇచ్చాయని సినీ విమర్శకులు అభిప్రాయపడ్డారు.
ఈ సినిమా మొదటి వీకెండ్ ముగిసే సరికి రూ.70 కోట్ల మార్క్ దాటే అవకాశం ఉందని ట్రేడ్ అంచనాలు ఉన్నాయి. చిన్న హీరో సినిమా అయినా, భారీ సినిమాలకూ టఫ్ పోటీ ఇస్తూ రికార్డులు సృష్టిస్తున్న ‘డ్యూడ్’ సినిమా ప్రస్తుతం టాలీవుడ్, కొలీవుడ్ కలయికలో సూపర్ సక్సెస్‌గా నిలిచింది. మొత్తానికి ‘డ్యూడ్’ బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపింది చిన్న హీరో సినిమా పెద్ద విజయం సాధించి ఇండస్ట్రీలో కొత్త చరిత్ర సృష్టించింది.