Bhagavad Gita: యజ్ఞక్రియల ద్వారా దేవశక్తిని ప్రసన్నం చేసే మంత్రాలు వేదాల్లో.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 13!

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యాభివృద్ధి దిశగా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. చిత్తూరు జిల్లాలో కొత్త విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో ప్రకటించారు. ప్రశ్నోత్తరాల సమయంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ రావు, తుని ఎమ్మెల్యే యనమల దివ్య లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ద్రవిడియన్ యూనివర్సిటీ, ప్రైవేట్ పరిధిలో అపోలో యూనివర్సిటీ ఉన్నాయని గుర్తుచేశారు. అయితే సీఎం చంద్రబాబు జిల్లా ప్రజలకు మరో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు చర్యలు ప్రారంభించినట్లు లోకేష్ తెలిపారు. ఈ యూనివర్సిటీని ప్రభుత్వ పరిధిలోనా, ప్రైవేట్ కిందనా ఏర్పాటు చేయాలనే అంశంపై పరిశీలన జరుపుతున్నామని, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా సరైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Earthquake: ఒంగోలులో భూ ప్రకంపనలు..! దాదాపు రెండు సెకన్ల పాటు..!

ఇక విద్యా రంగంలో మరిన్ని సంస్కరణలపై కూడా మంత్రి లోకేష్ స్పందించారు. తుని నియోజకవర్గంలోని రావికంపాడు హైస్కూలును జూనియర్ కాలేజీగా అప్‌గ్రేడ్ చేయాలని ఎమ్మెల్యే యనమల దివ్య విజ్ఞప్తికి సమాధానమిస్తూ, వైసీపీ హయాంలో రాష్ట్రంలోని అనేక జూనియర్ కాలేజీలు నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వాటిని పునరుద్ధరిస్తూ ఆధునిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ చర్యల వల్ల ఇప్పటికే జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు 40 శాతం పెరిగినట్లు వెల్లడించారు. అంతేకాదు, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, పోటీ పరీక్షల కోసం ప్రత్యేక మెటీరియల్ అందించడం జరుగుతోందని వివరించారు. భవిష్యత్తులో రాష్ట్రంలోని ప్రతి మండలంలో ఒక జూనియర్ కాలేజీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన హామీ ఇచ్చారు.

Social media Apps : SM యాప్స్ భారత చట్టాలను పాటించాల్సిందే.. కర్ణాటక హైకోర్టు!

విద్యార్థుల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న పథకాలలో భాగంగా యూనిఫామ్ పంపిణీ కూడా ముఖ్యమని మంత్రి లోకేష్ గుర్తు చేశారు. ఈ యూనిఫాంల తయారీని చేనేత సంఘాల ద్వారా చేయించాలని గతంలో ఆలోచించినప్పటికీ, పలు కారణాల వల్ల అది సాధ్యం కాలేదని ఆయన వివరించారు. అయితే చేనేతల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు. అదేవిధంగా మంగళగిరిలో వీవర్స్ శాలను ఏర్పాటు చేసి, కొత్త డిజైన్లు, బ్రాండింగ్‌పై చర్యలు చేపడుతున్నామని వివరించారు. ఈ చర్యలతో చేనేత రంగానికి మళ్లీ బలమైన ఊతం లభిస్తుందని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Srinivasa Kalyanam: డబ్లిన్ లో ఘనంగా శ్రీనివాస కళ్యాణం! 3500 మంది భక్తులతో.. ముఖ్య అతిథులుగా ఐర్లాండ్ మంత్రులు!

అంతేకాదు, ఉపాధ్యాయ నియామకాల్లో కూడా ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని మంత్రి లోకేష్ తెలిపారు. సెప్టెంబర్ 25న అమరావతిలోని వెలగపూడిలో ఉపాధ్యాయ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని ఎమ్మెల్యేలను ఆహ్వానించినట్లు ఆయన వెల్లడించారు. మొత్తం మీద విద్యా రంగంలో ఉన్నత స్థాయి మార్పులను తీసుకురావడమే కాకుండా, విద్యార్థులు, ఉపాధ్యాయులు, చేనేత కార్మికులు – అందరికీ సమానంగా అవకాశాలు, సదుపాయాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టంచేశారు.

చర్మం, జుట్టు, కండరాల నొప్పులకు… ఒక్క నూనెతో ఫుల్ స్టాప్ పెట్టేయండి!
vijayawada utsav: మహిళా శక్తిని గౌరవించడం భారతీయ సంప్రదాయం.. ఉపరాష్ట్రపతి!
Whatsapp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్! చాట్‌లోనే మెసేజ్‌లకు తక్షణ అనువాదం!
iPhone Big Offer: ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. కేవలం రూ.43,749కే ఐఫోన్ 15.. ఎలా పొందాలంటే..?
Best Tablets: చదువు, నోట్‌ టేకింగ్, మల్టీటాస్కింగ్‌కి బెస్ట్ టాబ్లెట్లు..! పూర్తి వివరాలు మీకోసం!
Festive bonus : రైల్వే ఉద్యోగులకు పండగ బోనస్.. ఒక్కో ఉద్యోగికి రూ.17,951 వరకు బోనస్!