Summer Mangoes: మామిడి ప్రియులారా, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే.. కల్తీ మామిడిని గుర్తించడం ఇక చాలా ఈజీ! Prawns Fry Recipe: హోటల్ స్టైల్‌లో క్రిస్పీ రొయ్యల ఫ్రై.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి! Shruti Haasan: వరుస సినిమాలతో బిజీ.. అయినా కిచెన్‌లో ఖాళీ లేదు.. శ్రుతి హాసన్ స్పెషల్ వంటకాలు.! TDP Mahanadu 2026: మహానాడుకు ముస్తాబవుతున్న ఉత్తరాంధ్ర.. వేదిక ఎంపికపై టీడీపీ హైకమాండ్ ఫోకస్! Middle East Peace: అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రక చర్చలు.. నేడు ఇస్లామాబాద్ వేదికగా శాంతి దిశగా అడుగులు..! Google Data Centre: ఏపీ టెక్ చరిత్రలో నవశకం.. ఏప్రిల్ 28న గూగుల్ డేటా సెంటర్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన! AP Property Tax Rebate 2026: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆస్తి పన్నుపై భారీ రాయితీ.. ఈ నెలాఖరు వరకు మాత్రమే ఛాన్స్! Free CBSE Education: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. హీల్ ప్యారడైజ్ స్కూల్‌లో ఉచిత ప్రవేశాలు..! Dacoit Movie Review: శేష్-మృణాల్ జోడి అదరగొట్టిందా? 'డెకాయిట్' సినిమా ఎలా ఉందంటే.. పూర్తి రివ్యూ! AP Retired Govt Employees: ఏపీ రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. అకౌంట్‌లలోకి నగదు జమ, వెంటనే చెక్ చేసుకోండి! Summer Mangoes: మామిడి ప్రియులారా, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే.. కల్తీ మామిడిని గుర్తించడం ఇక చాలా ఈజీ! Prawns Fry Recipe: హోటల్ స్టైల్‌లో క్రిస్పీ రొయ్యల ఫ్రై.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి! Shruti Haasan: వరుస సినిమాలతో బిజీ.. అయినా కిచెన్‌లో ఖాళీ లేదు.. శ్రుతి హాసన్ స్పెషల్ వంటకాలు.! TDP Mahanadu 2026: మహానాడుకు ముస్తాబవుతున్న ఉత్తరాంధ్ర.. వేదిక ఎంపికపై టీడీపీ హైకమాండ్ ఫోకస్! Middle East Peace: అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రక చర్చలు.. నేడు ఇస్లామాబాద్ వేదికగా శాంతి దిశగా అడుగులు..! Google Data Centre: ఏపీ టెక్ చరిత్రలో నవశకం.. ఏప్రిల్ 28న గూగుల్ డేటా సెంటర్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన! AP Property Tax Rebate 2026: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆస్తి పన్నుపై భారీ రాయితీ.. ఈ నెలాఖరు వరకు మాత్రమే ఛాన్స్! Free CBSE Education: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. హీల్ ప్యారడైజ్ స్కూల్‌లో ఉచిత ప్రవేశాలు..! Dacoit Movie Review: శేష్-మృణాల్ జోడి అదరగొట్టిందా? 'డెకాయిట్' సినిమా ఎలా ఉందంటే.. పూర్తి రివ్యూ! AP Retired Govt Employees: ఏపీ రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. అకౌంట్‌లలోకి నగదు జమ, వెంటనే చెక్ చేసుకోండి!

Middle East Peace: అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రక చర్చలు.. నేడు ఇస్లామాబాద్ వేదికగా శాంతి దిశగా అడుగులు..!

Middle East Peace: అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇస్లామాబాద్‌లో కీలక చర్చలు ప్రారంభమయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం, ఇరాన్ ప్రతిపాదించిన 10 పాయింట్ల ఆధారంగా శాశ్వత శాంతి ఒప్పందం కోసం చర్చలు జరుపుతోంది. ఈ చారిత్రక భేటీకి సంబంధించిన వివరాలు..

Published : 2026-04-10 10:14:00

Middle East Peace:  ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా-ఇరాన్ మధ్య కీలక చర్చలు నేడు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ప్రారంభం కానున్నాయి. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికి, యుద్ధ వాతావరణాన్ని చల్లార్చడమే లక్ష్యంగా ఇరు దేశాల ప్రతినిధులు ముఖాముఖి భేటీ అవుతున్నారు. ప్రస్తుతం ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణను శాశ్వత శాంతి ఒప్పందంగా మార్చడమే ఈ చర్చల ప్రధాన ఉద్దేశమని దౌత్య వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఈ సమావేశం కోసం ఇప్పటికే అమెరికా, ఇరాన్ దేశాలకు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధులు ఇస్లామాబాద్ చేరుకున్నారు. పాకిస్థాన్‌లోని ఇరాన్ రాయబారి తమ ప్రతినిధి బృందం రాకను అధికారికంగా ధ్రువీకరించారు. ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ చర్చలు సఫలమైతే పశ్చిమ ఆసియాలో మళ్లీ ప్రశాంతత నెలకొనే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అమెరికా తరపున ఈ కీలక చర్చలకు ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నాయకత్వం వహిస్తున్నారు. ఒక అగ్రరాజ్య ఉపాధ్యక్షుడే నేరుగా ఈ చర్చల్లో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. యుద్ధాన్ని ఆపి, శాంతిని నెలకొల్పే విషయంలో అమెరికా ఎంత పట్టుదలగా ఉందో జేడీ వాన్స్ రాకతో స్పష్టమవుతోంది. ఆయనతో పాటు అమెరికా విదేశాంగ శాఖకు చెందిన ముఖ్య అధికారులు కూడా ఈ బృందంలో ఉన్నారు.

ఈ చర్చల్లో ఇరాన్ ప్రతిపాదించిన 10 అంశాల  ప్రణాళిక అత్యంత కీలకంగా మారనుంది. యుద్ధం ముగింపు, ఆంక్షల తొలగింపు,  సరిహద్దు భద్రత వంటి ప్రధాన అంశాలు ఈ పది పాయింట్లలో ఉన్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనల ఆధారంగానే ఇరు దేశాల మధ్య సుదీర్ఘమైన చర్చలు జరగనున్నాయి. ఇరాన్ ఆశిస్తున్న హామీలను అమెరికా ఎంతవరకు అంగీకరిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ఈ చర్చల ప్రభావం ఉండనుంది. ముఖ్యంగా చమురు ధరలు, అంతర్జాతీయ వాణిజ్యం వంటి అంశాలు ఈ శాంతి చర్చల ఫలితంపై ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ ఇస్లామాబాద్ చర్చలు విజయవంతమైతే, అది అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలుకుతుంది. ఇరు దేశాలు పాత పగలను పక్కన పెట్టి, శాంతి మార్గంలో పయనించాలని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారు.

Spotlight

Read More →