- రూ. 4.49 కోట్లతో ఇరిగేషన్ పనులకు శ్రీకారం: పోడూరు మండలంలో మంత్రి నిమ్మల శంకుస్థాపన..
- Politics: రైతు పక్షపాతి కూటమి ప్రభుత్వం: 24 గంటల్లోనే ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లోకి!
Nimmala Ramanaidu: గత వైసీపీ పాలన ధ్వంసం, విధ్వంసంతో మొదలైతే నేడు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన ద్వేయంగా పాలన నడుస్తుందని రాష్ట్ర జలవనూర్ల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోడూరు మండలం పెనుమదం గ్రామంలో ఇరిగేషన్ నిధులు 4.49 కోట్లతో 17 పనులకు ఆయన కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఆయా గ్రామాల్లో గ్రామస్తులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని మంత్రి రామానాయుడుకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి రామానాయుడు మాట్లాడుతూ గత వైసీపీ ఐదేళ్ల పాలన నిరంకుశత్వం, రాక్షస, అరాచక, వేధింపులు కక్షలు, కేసులతో సాగిందన్నారు. ప్రజల స్వేచ్ఛగా నవ్వుకునేందుకు, మాట్లాడుకునే పరిస్థితి లేదన్నారు. నేడు కూటమి ప్రభుత్వంలో మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లో కలయికతో అభివృద్ధి సంక్షేమం పరుగులు పెడుతుందన్నారు. 2029 ఎన్నికల్లో అధికారంలోకి రావాలని చూస్తున్న వైసీపీ అభివృద్ధి సంక్షేమాన్ని మరింత ఎక్కువ చేస్తామని చెప్పడం లేదని, గొడ్డలి పట్టుకొని రఫా రఫా అంటూ పొట్టేలు తలలు నరికినట్టు అందరి తలలు నరుకుతామని బహిరంగంగా చెబుతున్నారని, అటువంటి రాక్షసత్వ వైసీపీ గురించి ఆలోచన చేయాలన్నారు.
ప్రతి ఒక్కరి ఓటు అభివృద్ధి వైపు ఉండాలి గాని, విధ్వంసం వైపు కాదన్నారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి పనిచేసే, మేలు చేసే మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలన్నారు. రబీ సీజన్లో రాష్ట్రంలో 1917 దాన్ని కేంద్రాలు ఏర్పాటు చేశామని, రైతులకు కోసం 5.40 కోట్ల గోనెసంచిలో సిద్ధంగా ఉన్నాయన్నారు. 2025-26 ఖరీఫ్ లో సైతం 48.70 లక్షల టన్నుల ధాన్యమును కొనుగోలు చేశామని, 7.83 లక్ష మంది రైతులకు 11.757 కోట్ల ప్రభుత్వం చెల్లించిందన్నారు.
ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన ఘనత కూటమి ప్రభుత్వంలోనిదేనన్నారు.
గత వైసీపీ ప్రభుత్వంలో రైతులను అన్ని విధాల ముప్పు తిప్పలు పెట్టారని, పండించిన ధాన్యమును అమ్ముకోవాలంటేనే రాత్రింబవళ్లు పడిగాపులు పడాల్సి వచ్చేది అన్నారు. నేడు అటువంటి పరిస్థితులు లేవని స్వేచ్ఛగా ఇష్టం వచ్చిన మిల్లులో అమ్ముకోవచ్చని మంత్రి రామానాయుడు తెలిపారు.రాష్ట్రానికి పారిశ్రామిక వేత్తలు, పరిశ్రమలు క్యూ కడుతుంటే జగన్ ఓర్వలేకపోతున్నాడు. రాష్ట్రంలో విధ్వంశం సృష్టించి, అభివృద్ది జరుగకుండా అడ్డుకునే ప్రయత్నం పేటిఎం బ్యాచ్ చేస్తుందన్నారు. 5 ఏళ్ళలో 20లక్షల ఉద్యోగాల కల్పన దిశగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు.రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని అధిగమిస్తూనే, సూపర్ సిక్స్ హామీలను చంద్రబాబు నెరవేరుస్తున్నారన్నారు.