AP Govt: ఆ జిల్లా అభివృద్ధికి మాస్టర్ ప్లాన్.. రూ. 14 వేల కోట్లతో రైల్వే, జాతీయ రహదారుల ప్రతిపాదనలు.! AP Govt: ₹185 కోట్లతో 130 కొత్త అంగన్‌వాడీ కేంద్రాలు.. 55,766 కేంద్రాల్లో.. అంగన్‌వాడీల రూపురేఖలు సమూల మార్పు! Nara Lokesh: పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచడం అనివార్యం! దీనిపై రాష్ట్రవ్యాప్తంగా.. Nimmala Ramanaidu: వైసీపీది విధ్వంస పాలన.. కూటమిది అభివృద్ధి బాట.. పెనుమదం సభలో మంత్రి! రూ. 4.49 కోట్లతో.. Vijay Tirunelveli Speech: వ్యక్తిగత జీవితంపై దాడిని సహించను.. విడాకుల వివాదంపై నోరు విప్పిన దళపతి విజయ్! Fish Curry: చేపల పులుసులో ఈ చిన్న మార్పు చేయండి - రుచి రెట్టింపు! మెచ్చుకునేలా వండటం ఇక చాలా ఈజీ.! Change Email ID: పాత ఐడిని వదలలేక.. కొత్తది వాడలేక సతమతమవుతున్నారా? గూగుల్ తెచ్చిన సూపర్ ఫీచర్ మీకోసమే! Stock Markets: "మార్కెట్లకు చమురు సెగ": ఐదు రోజుల లాభాలకు బ్రేక్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ! Decoyit: 'డెకోయిట్' బాక్సాఫీస్ సునామీ... అడ్వాన్స్ బుకింగ్స్‌లో అడివి శేషు అరాచకం! Prajavedhika: రికార్డుల నుంచి 19 సెంట్లు మాయం.. రీ-సర్వేలో రైతుకు జరిగిన ఆ అన్యాయం! సామాన్యుడి ఆర్తనాదం ఎందుకు వినిపించడం లేదు? AP Govt: ఆ జిల్లా అభివృద్ధికి మాస్టర్ ప్లాన్.. రూ. 14 వేల కోట్లతో రైల్వే, జాతీయ రహదారుల ప్రతిపాదనలు.! AP Govt: ₹185 కోట్లతో 130 కొత్త అంగన్‌వాడీ కేంద్రాలు.. 55,766 కేంద్రాల్లో.. అంగన్‌వాడీల రూపురేఖలు సమూల మార్పు! Nara Lokesh: పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచడం అనివార్యం! దీనిపై రాష్ట్రవ్యాప్తంగా.. Nimmala Ramanaidu: వైసీపీది విధ్వంస పాలన.. కూటమిది అభివృద్ధి బాట.. పెనుమదం సభలో మంత్రి! రూ. 4.49 కోట్లతో.. Vijay Tirunelveli Speech: వ్యక్తిగత జీవితంపై దాడిని సహించను.. విడాకుల వివాదంపై నోరు విప్పిన దళపతి విజయ్! Fish Curry: చేపల పులుసులో ఈ చిన్న మార్పు చేయండి - రుచి రెట్టింపు! మెచ్చుకునేలా వండటం ఇక చాలా ఈజీ.! Change Email ID: పాత ఐడిని వదలలేక.. కొత్తది వాడలేక సతమతమవుతున్నారా? గూగుల్ తెచ్చిన సూపర్ ఫీచర్ మీకోసమే! Stock Markets: "మార్కెట్లకు చమురు సెగ": ఐదు రోజుల లాభాలకు బ్రేక్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ! Decoyit: 'డెకోయిట్' బాక్సాఫీస్ సునామీ... అడ్వాన్స్ బుకింగ్స్‌లో అడివి శేషు అరాచకం! Prajavedhika: రికార్డుల నుంచి 19 సెంట్లు మాయం.. రీ-సర్వేలో రైతుకు జరిగిన ఆ అన్యాయం! సామాన్యుడి ఆర్తనాదం ఎందుకు వినిపించడం లేదు?

Hajj: హజ్ యాత్ర 2026కు పకడ్బందీ ఏర్పాట్లు.. యాత్రికులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి: మంత్రి ఎన్ఎండి ఫరూక్

Hajj: హజ్ యాత్ర 2026ను ఎలాంటి అంతరాయాలు లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపడుతోంది. రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ, యాత్రికులకు పూర్తి సౌకర్యాలు కల్పించాలని సూచించారు.

Published : 2026-04-09 21:45:00

ఏప్రిల్ 18, 19 తేదీలలో 352 మంది హజ్ యాత్రకు పయనం.. 

యాత్రికుల కోసం సమగ్ర ఏర్పాట్లు.. 

అమరావతి: హజ్ యాత్ర 2026ను ఎలాంటి అంతరాయాలు లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపడుతోంది. రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ, యాత్రికులకు పూర్తి సౌకర్యాలు కల్పించాలని సూచించారు.

గన్నవరం ఎస్ఎం కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఈసారి ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం 2000 మంది హజ్ యాత్రికులు బయలుదేరనున్నారని తెలిపారు. ఇందులో విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం నుంచి ఏప్రిల్ 18, 19 తేదీలలో 352 మంది ప్రయాణించనున్నారని చెప్పారు. యాత్రికులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులకు ఆదేశించారు.

హైదరాబాద్‌లో గతంలో హజ్ భవన్ నిర్మాణం, ఎంబార్కేషన్ కేంద్రం ఏర్పాటుకు జరిగిన కృషిని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ యాత్రికులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఈ సమస్యను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంతో విజయవాడకు ఎంబార్కేషన్ కేంద్రం మంజూరు అయ్యిందని వివరించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, రామ్మోహన్ నాయుడు, సీఎం చంద్రబాబుకు మంత్రి ఫరూక్ కృతజ్ఞతలు తెలిపారు.

విజయవాడలో ఆధునిక సౌకర్యాలతో హజ్ హౌస్ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే హజ్ యాత్రికులకు రూ.1 లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

యాత్రికుల కోసం సమగ్ర ఏర్పాట్లు 
రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే యాత్రికులకు క్యాంప్‌లో హజ్ నియమాలు, విధానాలపై అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. విజయవాడ నుంచి మదీనాకు ప్రత్యేక విమానాలు, బోర్డింగ్ వివరాలను హజ్ కమిటీ ద్వారా సమయానికి అందించాలన్నారు. లగేజీ తరలింపు వేగవంతం చేయాలని, విమానాశ్రయంలో ప్రత్యేక కౌంటర్లు, లాంజ్‌లు, నమాజ్ వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

చెక్-ఇన్ కోసం అదనపు సిబ్బంది, వీసా క్లియరెన్స్ కోసం ప్రత్యేక కౌంటర్లు, పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ కోసం 24 గంటల సిబ్బంది అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. మహిళా యాత్రికుల కోసం ప్రత్యేక సిబ్బందితో తనిఖీలు నిర్వహించాలని సూచించారు.

ప్రత్యేక రవాణా, వైద్య సేవలు 
క్యాంప్ నుంచి విమానాశ్రయానికి యాత్రికులు సులభంగా చేరుకునేందుకు ప్రత్యేక ఏసీ బస్సులు నడపాలని మంత్రి ఆదేశించారు. క్యాంప్, విమానాశ్రయాల్లో వైద్యులు, నర్సులు అందుబాటులో ఉండాలని, ఆరోగ్య పరీక్షలు, ఉచిత వ్యాక్సినేషన్‌లు అందించాలని తెలిపారు. అంబులెన్స్ సేవలు సిద్ధంగా ఉంచాలని సూచించారు.

భద్రతా చర్యలు కట్టుదిట్టం 
హజ్ క్యాంప్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని పోలీసులకు సూచించారు. నేషనల్ హైవే-16పై ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టాలని, సైబర్ మోసాలపై నిఘా పెట్టాలని ఆదేశించారు. సీసీటీవీ నిఘా, నిరంతర విద్యుత్ సరఫరా, బ్యాకప్ జనరేటర్లు, 24 గంటల లైటింగ్, ఏసీ సౌకర్యాలు కల్పించాలని తెలిపారు.

శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించి తాగునీరు, మరుగుదొడ్లు, స్నానాల గదులు సమృద్ధిగా ఏర్పాటు చేయాలని సూచించారు. అగ్నిమాపక శాఖ అప్రమత్తంగా ఉండి ఫైర్ ఇంజన్లు సిద్ధంగా ఉంచాలని, మాక్ డ్రిల్స్ నిర్వహించాలని తెలిపారు.

యాత్రికులకు మార్గదర్శక బోర్డులు ఏర్పాటు చేయాలని, హజ్ సమాచారం కోసం రోజువారీ మీడియా బులెటిన్లు విడుదల చేయాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి యాత్రను విజయవంతం చేయాలని మంత్రి ఫరూక్ పిలుపునిచ్చారు.

ఈ సమీక్ష సమావేశంలో హజ్ కమిటీ చైర్మన్ హసన్ భాష, ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూఖ్ షుబ్లీ, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, హజ్ కమిటీ సీఈఓ గౌస్ పీర్ తదితరులు పాల్గొన్నారు. హజ్ యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సమగ్రంగా కృషి చేస్తోందని మంత్రి మరోసారి గుర్తుచేశారు.

Spotlight

Read More →