సినిమా ప్రియులకు, బైంజ్ వాచర్‌లకు ఈ వారం పండుగే అని చెప్పాలి. డిసెంబర్ మూడో వారంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అయిన నెట్‌ఫ్లిక్స్ (Netflix), ప్రైమ్ వీడియో (Prime Video), జీ5 (ZEE5) మరియు జియోహాట్‌స్టార్ (JioHotstar) లలో ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి.
బాలీవుడ్ మసాలాతో పాటు, హారర్ కామెడీ, సైకలాజికల్ థ్రిల్లర్‌లు, రొమాంటిక్ డ్రామాలు ఈ లిస్టులో ఉన్నాయి. ఈ వారం విడుదల కానున్న 8 అత్యంత ఆసక్తికరమైన సినిమాలు/షోల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
డిసెంబర్ 16 (మంగళవారం) విడుదలలు
థమ్మా (Thamma)
రొమాంటిక్ కామెడీ హారర్, నటీనటులు ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న, నవాజుద్దీన్ సిద్ధిఖీ, పరేష్ రావల్. దర్శకుడు ఆదిత్య సర్పోత్దార్. ఇది మ్యాడాక్ హారర్ కామెడీ యూనివర్స్లో ఐదవ సినిమా. దీపావళికి థియేటర్లలో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది.
స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్: ప్రైమ్ వీడియో (Prime Video)
ఏక్ దీవానే కీ దీవానీయత్ (Ek Deewane Ki Deewaniyat)
రొమాంటిక్ డ్రామా, హర్షవర్ధన్ రాణే, సోనమ్ బజ్వా. దర్శకుడు మిలాప్ జవేరి. ఇదొక భావోద్వేగపూరిత ప్రేమకథ.
స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్ (Netflix)
డిసెంబర్ 18 (గురువారం) విడుదల
ఎమిలీ ఇన్ ప్యారిస్ సీజన్ 5 (Emily In Paris Season 5), రొమాంటిక్ కామెడీ డ్రామా సిరీస్, లిల్లీ కాలిన్స్ (ఎమిలీ కూపర్‌గా), ఫిలిప్పీన్ లెరోయ్-బ్యూలియు, ఆష్లే పార్క్. అమెరికన్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఎమిలీ పారిస్‌లో తన కెరీర్, ప్రేమ వ్యవహారాలతో ఎలాంటి సంఘర్షణలు ఎదుర్కొంటుందనేది ప్రధాన కథాంశం.
స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్ (Netflix)
డిసెంబర్ 19 (శుక్రవారం) విడుదలలు
ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్! సీజన్ 4 (Four More Shots Please! Season 4), కామెడీ-డ్రామా సిరీస్, సయానీ గుప్తా, బానీ జె, కీర్తి కుల్హారి, మాన్వి గాగ్రో. నలుగురు మహిళా స్నేహితుల జీవితాలు, వారి రిలేషన్‌షిప్స్ గురించి అద్భుతంగా చూపించిన ఇండియన్ ఒరిజినల్ సిరీస్.
స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్: ప్రైమ్ వీడియో (Prime Video)
రాత్ అకేలీ హై: ది బన్సాల్ మర్డర్స్ (Raat Akeli Hai: The Bansal Murders) క్రైమ్ థ్రిల్లర్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, చిత్రంగద సింగ్, రజత్ కపూర్, రాధికా ఆప్టే, సంజయ్ కపూర్. దర్శకుడుహనీ ట్రెహాన్. ఇది ఒక మిస్టరీ, సస్పెన్స్‌తో కూడిన థ్రిల్లర్ కథనం.
స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్ (Netflix)
మిసెస్ దేశ్‌పాండే (Mrs. Deshpande), సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్, మాధురీ దీక్షిత్, ప్రియాన్షు చటర్జీ, సిద్ధార్థ్ చందేకర్. దర్శకుడు నాగేశ్ కుకునూర్. జైలులో ఉన్న ఒక సీరియల్ కిల్లర్ సహాయంతో, ఆమె పద్ధతులను అనుకరిస్తున్న మరొక హంతకుడిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నించడం కథాంశం.
స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్: జియోహాట్‌స్టార్ (JioHotstar - OTTplay Premium)
నయనం (Nayanam)
తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్, వరుణ్ సందేశ్, ప్రియాంకా జైన్, ఉత్తేజ్, అలీ రెజా, రేఖా నిరోషా. దర్శకురాలు స్వాతి ప్రకాష్ మంత్రీప్రగడ. చీకటి రహస్యాలు కలిగిన ఒక ఆప్తాలమొలజిస్ట్ (కంటి వైద్యుడు) చుట్టూ కథ తిరుగుతుంది.
స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్: జీ5 (ZEE5 - OTTplay Premium)
డిసెంబర్ 20 (శనివారం) విడుదల
ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 4 (The Great Indian Kapil Show S4), స్కెచ్ కామెడీ టాక్ షో, కపిల్ శర్మ. కమెడియన్ కపిల్ శర్మ హోస్ట్ చేసే ఈ ప్రముఖ కామెడీ షో నాలుగో సీజన్ స్ట్రీమింగ్‌కు వస్తోంది.
స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్ (Netflix)