తిరుమలలో జనవరి 25న జరగనున్న రథసప్తమి పర్వదిన ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనవరి 24 నుంచి 26 వరకు SSD టోకెన్లను (SSD Tokens) రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. తిరుమలలోని పద్మావతి విశ్రాంతి గృహంలో జరిగిన ఈ సమావేశంలో భక్తుల రద్దీ, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ వంటి ముఖ్య అంశాలపై అధికారులతో సమీక్షించారు.
ఈ సమావేశంలో టీటీడీ (TTD) జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, తిరుమల అదనపు ఎస్పీ శ్రీ రామకృష్ణలు పాల్గొన్నారు. రథసప్తమి రోజున వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో చూపిన సమన్వయం, కృషిని గుర్తు చేసిన అదనపు ఈవో, అదే స్ఫూర్తితో ఈ పర్వదినాన్ని కూడా విజయవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసుకుని ట్రాఫిక్, పార్కింగ్, అత్యవసర సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
అలాగే ఘాట్ రోడ్లలో వాహనాల కదలికను నిరంతరం పర్యవేక్షిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో వాహనాల తరలింపుకు స్పష్టమైన కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. ఇంజినీరింగ్, అన్నప్రసాదం, పారిశుద్ధ్యం, శ్రీవారి సేవకులు, వైద్య బృందాలు, ఎల్ఈడీ స్క్రీన్లు, పుష్పాలంకరణ, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎస్వీబీసీ మరియు సోషల్ మీడియా ప్రచారం వంటి అన్ని విభాగాల ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సమావేశంలో టీటీడీ ఉన్నతాధికారులు, విజిలెన్స్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
SSD టోకెన్లు ఎప్పుడు రద్దు చేశారు?
జనవరి 24 నుంచి 26 వరకు SSD టోకెన్లను టీటీడీ రద్దు చేసింది.
రథసప్తమి పర్వదినం ఎప్పుడు జరుగుతుంది?
తిరుమలలో రథసప్తమి పర్వదినం జనవరి 25న నిర్వహించబడుతుంది.
రథసప్తమి ఏర్పాట్లపై ఎవరు సమీక్ష నిర్వహించారు?
టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి రథసప్తమి ఏర్పాట్లపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.