Andhra Pradesh: ఏపీ రాజకీయ చరిత్రను మార్చిన రోజు.. వైసీపీ పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు! TAMPA: టంపాలో ఘనంగా అన్నమయ్య 618వ జయంతి ఆరాధనోత్సవాలు! తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఫ్లోరిడా ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం! Vijay: వ్యక్తిగత జ్యోతిష్యుడా? ప్రభుత్వ అధికారా? విజయ్ నిర్ణయంపై మండిపడ్డ ప్రేమలత విజయకాంత్! Nara Lokesh: ఉమ్మడి అనంత జిల్లాలో నారా లోకేష్ పర్యటన షెడ్యూల్ ఖరారు! Mahanadu: మహానాడు ఏర్పాట్లపై నెల్లూరులో మంత్రుల సమీక్ష! కార్యకర్తలకు మెరుగైన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి! PM Modi: ప్రధాని మోదీ సంచలన నిర్ణయం: కాన్వాయ్‌లో వాహనాల సంఖ్య తగ్గింపు! Tamil Nadu politics: బలపరీక్షలో నెగ్గిన విజయ్.. డీఎంకే వాకౌట్.. అన్నాడీఎంకేలో చీలిక.! Sai Srinivas Reddy: అమెరికాలో లాయర్‌గా ఎమ్మెల్సీ కుమారుడు.. 25 ఏళ్లకే అటార్నీ.. భారత్, యూఎస్ దేశాల్లో లైసెన్స్ పొందిన అతి పిన్న వయస్కుడిగా రికార్డ్! IPL tickets: ఐపీఎల్ అభిమానుల‌కు అల‌ర్ట్‌.. నకిలీ ఐపీఎల్ వెబ్‌సైట్ల జోరు.. డబ్బు, డేటా రెండూ చోరీ! YCP MLC: అనంతబాబుకు భారీ షాక్.. డ్రైవర్ హత్యకేసులో బెయిల్ రద్దు! సాక్షులను బెదిరించినట్లు నిరూపణ! Andhra Pradesh: ఏపీ రాజకీయ చరిత్రను మార్చిన రోజు.. వైసీపీ పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు! TAMPA: టంపాలో ఘనంగా అన్నమయ్య 618వ జయంతి ఆరాధనోత్సవాలు! తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఫ్లోరిడా ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం! Vijay: వ్యక్తిగత జ్యోతిష్యుడా? ప్రభుత్వ అధికారా? విజయ్ నిర్ణయంపై మండిపడ్డ ప్రేమలత విజయకాంత్! Nara Lokesh: ఉమ్మడి అనంత జిల్లాలో నారా లోకేష్ పర్యటన షెడ్యూల్ ఖరారు! Mahanadu: మహానాడు ఏర్పాట్లపై నెల్లూరులో మంత్రుల సమీక్ష! కార్యకర్తలకు మెరుగైన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి! PM Modi: ప్రధాని మోదీ సంచలన నిర్ణయం: కాన్వాయ్‌లో వాహనాల సంఖ్య తగ్గింపు! Tamil Nadu politics: బలపరీక్షలో నెగ్గిన విజయ్.. డీఎంకే వాకౌట్.. అన్నాడీఎంకేలో చీలిక.! Sai Srinivas Reddy: అమెరికాలో లాయర్‌గా ఎమ్మెల్సీ కుమారుడు.. 25 ఏళ్లకే అటార్నీ.. భారత్, యూఎస్ దేశాల్లో లైసెన్స్ పొందిన అతి పిన్న వయస్కుడిగా రికార్డ్! IPL tickets: ఐపీఎల్ అభిమానుల‌కు అల‌ర్ట్‌.. నకిలీ ఐపీఎల్ వెబ్‌సైట్ల జోరు.. డబ్బు, డేటా రెండూ చోరీ! YCP MLC: అనంతబాబుకు భారీ షాక్.. డ్రైవర్ హత్యకేసులో బెయిల్ రద్దు! సాక్షులను బెదిరించినట్లు నిరూపణ!

TAMPA: టంపాలో ఘనంగా అన్నమయ్య 618వ జయంతి ఆరాధనోత్సవాలు! తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఫ్లోరిడా ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం!

TAMPA: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో తెలుగు సంస్కృతి, భక్తి సంప్రదాయాలను మరింత విస్తరించేందుకు తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఫ్లోరిడా (TAF), టంపా బే విభాగం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 618వ జయంతి ఆరాధనోత్సవాలను ఈ నెల 16వ తేదీన ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

Published : 2026-05-13 14:47:00

టంపా బే విభాగం ప్రత్యేక కార్యక్రమం..

అన్నమాచార్యుల వారి 618వ జయంతి..

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో తెలుగు సంస్కృతి, భక్తి సంప్రదాయాలను మరింత విస్తరించేందుకు తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఫ్లోరిడా (TAF), టంపా బే విభాగం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 618వ జయంతి ఆరాధనోత్సవాలను ఈ నెల 16వ తేదీన ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

టంపాలోని హిందూ టెంపుల్ హాల్‌లో శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. అన్నమయ్య సంకీర్తనల ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసేలా ఈ కార్యక్రమాన్ని భక్తి భావంతో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ ఆరాధనోత్సవాల్లో పాల్గొనే భక్తులకు ఉచిత ప్రవేశంతో పాటు ఉచిత భోజన సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. టంపా బే పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు కుటుంబాలు, అన్నమయ్య భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కార్యక్రమం మే 16, 2026న టంపాలోని హిందూ టెంపుల్ హాల్, 5509 లిన్ రోడ్, టంపా, FL 33624 వద్ద నిర్వహించబడనుంది. భక్తి సంగీతం, అన్నమయ్య కీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగనున్నాయి.

ఈ కార్యక్రమ నిర్వహణలో బాలా అమరావతి, విజయ పాథరు, శారదా మాంగిపూడి, శేఖర్ యెనమండ్ర, సుభద్రా గణపతిరాజు, ప్రశాంతి ఎర్రమేసెట్టి, అప్పలనాయుడు గర్భాన, సునీత మెడికొండతో పాటు TAF కమిటీ సభ్యులు చురుకుగా పాల్గొంటున్నారు.

తెలుగు సంస్కృతి, సాహిత్య వారసత్వాన్ని విదేశాల్లోని కొత్త తరాలకు పరిచయం చేయడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని TAF వ్యవస్థాపక సభ్యులు తెలిపారు. అన్నమయ్య ఆరాధనోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని టంపా బే ప్రాంత ప్రజలకు వారు ఆహ్వానం పలికారు.

Spotlight

Read More →