PM Modi: ప్రధాని మోదీ సంచలన నిర్ణయం: కాన్వాయ్‌లో వాహనాల సంఖ్య తగ్గింపు! Tamil Nadu politics: బలపరీక్షలో నెగ్గిన విజయ్.. డీఎంకే వాకౌట్.. అన్నాడీఎంకేలో చీలిక.! Sai Srinivas Reddy: అమెరికాలో లాయర్‌గా ఎమ్మెల్సీ కుమారుడు.. 25 ఏళ్లకే అటార్నీ.. భారత్, యూఎస్ దేశాల్లో లైసెన్స్ పొందిన అతి పిన్న వయస్కుడిగా రికార్డ్! IPL tickets: ఐపీఎల్ అభిమానుల‌కు అల‌ర్ట్‌.. నకిలీ ఐపీఎల్ వెబ్‌సైట్ల జోరు.. డబ్బు, డేటా రెండూ చోరీ! YCP MLC: అనంతబాబుకు భారీ షాక్.. డ్రైవర్ హత్యకేసులో బెయిల్ రద్దు! సాక్షులను బెదిరించినట్లు నిరూపణ! Kollywood: సినిమా పరిశ్రమలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత! Atchennaidu: రొయ్యల రైతులకు ఊరట.. ఫీడ్ ధరల పెంపు తాత్కాలికంగా నిలిపివేత! Gun Shooting: కెనడా లో కాల్పుల కలకలం... ఇద్దరు భారతీయ సంతతి మృతి! Air India: ప్రయాణికులకు అలర్ట్... రోజుకు 100 ఎయిర్ ఇండియా విమానాలు రద్దు!! Central Govt: పశ్చిమాసియా ఉద్రిక్తతలపై కేంద్ర కేబినెట్ కీలక సమావేశం! PM Modi: ప్రధాని మోదీ సంచలన నిర్ణయం: కాన్వాయ్‌లో వాహనాల సంఖ్య తగ్గింపు! Tamil Nadu politics: బలపరీక్షలో నెగ్గిన విజయ్.. డీఎంకే వాకౌట్.. అన్నాడీఎంకేలో చీలిక.! Sai Srinivas Reddy: అమెరికాలో లాయర్‌గా ఎమ్మెల్సీ కుమారుడు.. 25 ఏళ్లకే అటార్నీ.. భారత్, యూఎస్ దేశాల్లో లైసెన్స్ పొందిన అతి పిన్న వయస్కుడిగా రికార్డ్! IPL tickets: ఐపీఎల్ అభిమానుల‌కు అల‌ర్ట్‌.. నకిలీ ఐపీఎల్ వెబ్‌సైట్ల జోరు.. డబ్బు, డేటా రెండూ చోరీ! YCP MLC: అనంతబాబుకు భారీ షాక్.. డ్రైవర్ హత్యకేసులో బెయిల్ రద్దు! సాక్షులను బెదిరించినట్లు నిరూపణ! Kollywood: సినిమా పరిశ్రమలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత! Atchennaidu: రొయ్యల రైతులకు ఊరట.. ఫీడ్ ధరల పెంపు తాత్కాలికంగా నిలిపివేత! Gun Shooting: కెనడా లో కాల్పుల కలకలం... ఇద్దరు భారతీయ సంతతి మృతి! Air India: ప్రయాణికులకు అలర్ట్... రోజుకు 100 ఎయిర్ ఇండియా విమానాలు రద్దు!! Central Govt: పశ్చిమాసియా ఉద్రిక్తతలపై కేంద్ర కేబినెట్ కీలక సమావేశం!

YCP MLC: అనంతబాబుకు భారీ షాక్.. డ్రైవర్ హత్యకేసులో బెయిల్ రద్దు! సాక్షులను బెదిరించినట్లు నిరూపణ!

YCP MLC: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో గతంలో సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం రద్దు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.

Published : 2026-05-13 12:48:00

జైలులోనే కొనసాగనున్న వైసీపీ ఎమ్మెల్సీ..

బెయిల్ రద్దు చేస్తూ రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు..

రాజమహేంద్రవరం: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో గతంలో సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం రద్దు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో హత్య కేసు విచారణ పూర్తయ్యే వరకు అనంతబాబు జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో బెయిల్‌పై బయట ఉన్న అనంతబాబు, కేసుకు సంబంధించిన సాక్షులను బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. నలుగురు కీలక సాక్షులను ప్రలోభపెట్టడంతో పాటు ఒత్తిళ్లు తెచ్చినట్లు సాక్షులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు ప్రత్యేక కేసు నమోదు చేశారు.

సాక్షులను బెదిరించిన కేసులో అనంతబాబును పోలీసులు ఈ ఏడాది ఏప్రిల్ 24న అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

హత్య కేసులో బెయిల్‌పై ఉంటూ సాక్షులను ప్రభావితం చేయడం, బెదిరింపులకు పాల్పడటం చాలా తీవ్రమైన ఉల్లంఘనగా కోర్టు పరిగణించింది. సాక్షులను బెదిరించినట్లు పోలీసుల వద్ద ఉన్న ఆధారాలు బలంగా ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. దీంతో బెయిల్ నిబంధనలను ఉల్లంఘించినందుకు అనంతబాబు బెయిల్‌ను రద్దు చేయాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు ఆమోదించింది.

పోలీసుల తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాల్ల సుబ్బారావు వాదనలు వినిపించారు. సాక్షుల భద్రత, కేసు విచారణ పారదర్శకత దృష్ట్యా బెయిల్ కొనసాగించడం సరికాదని కోర్టుకు వివరించారు. ఇక ఈనెల 20వ తేదీ నుంచి డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో రెగ్యులర్ విచారణ ప్రారంభం కానుందని కోర్టు వెల్లడించింది. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో కోర్టు తాజా నిర్ణయం రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.

Spotlight

Read More →