ప్రయాణం (Travelling) అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అందమైన ప్రదేశాలు చూడటం, కొత్త సంస్కృతుల (Cultures) గురించి తెలుసుకోవడం ఎంతో మంది కల. అయితే, చాలా మంది తమ ఉద్యోగాల షెడ్యూల్స్ లేదా ఆర్థిక పరిస్థితుల కారణంగా ఈ హాబీని కొనసాగించలేకపోతుంటారు. మీ పరిస్థితి కూడా ఇదే అయితే, మీకో అద్భుతమైన పరిష్కారం ఉంది.
ట్రావెలింగ్‌లోనే కెరీర్ ఎందుకు ఎంచుకోకూడదు? ప్రపంచమంతా తిరుగుతూ, కొత్త ప్రదేశాలను అనుభవిస్తూ, అదే సమయంలో డబ్బు సంపాదించడం కంటే ఆనందం ఏముంటుంది? ప్రపంచాన్ని చుట్టి రావడానికి మరియు ప్రయాణించడాన్ని కెరీర్‌గా మలచుకోవడానికి తోడ్పడే టాప్ 7 జాబ్స్ (Travel Careers) ఇక్కడ ఉన్నాయి.
ఫ్లైట్ అటెండెంట్ (Flight Attendant)
విమానంలో పనిచేసే ఫ్లైట్ అటెండెంట్ ఉద్యోగం సవాళ్లతో కూడుకున్నదైనా, దానికి తగ్గ ప్రయోజనాలు (Rewards) కూడా ఉంటాయి.
ప్రయాణీకుల భద్రతను చూసుకోవడం, వారికి సేవలు అందించడం మరియు అత్యవసర పరిస్థితుల్లో ప్రశాంతంగా వ్యవహరించడం. ఈ జాబ్‌లో నైట్ షిఫ్ట్‌లు, వీకెండ్స్‌లో ఇర్రెగ్యులర్ షెడ్యూల్ ఉండవచ్చు. కానీ, లేఓవర్ల (Layovers) సమయంలో ప్రపంచవ్యాప్తంగా కొత్త నగరాలను సందర్శించే అద్భుతమైన అవకాశం లభిస్తుంది.
ట్రావెల్ రైటర్ లేదా వ్లాగర్ (Travel Writer or Vlogger)
మీ అనుభవాలను ఇతరులతో పంచుకోవడం మీకు ఇష్టమైతే, ట్రావెల్ రైటింగ్ లేదా వ్లాగింగ్ మీకు సరిపోతుంది.
బ్లాగులు, మ్యాగజైన్‌లు లేదా ట్రావెల్ గైడ్‌బుక్స్ కోసం కథనాలు రాస్తారు. యూట్యూబ్ లేదా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల కోసం ప్రయాణ వీడియోలు తయారు చేస్తారు.
క్రియేటివిటీ, మంచి స్టోరీటెల్లింగ్ నైపుణ్యాలు, ఫోటోగ్రఫీ లేదా వీడియో ఎడిటింగ్ తెలిసి ఉండాలి. చాలా మంది ఈ కెరీర్‌లో ఫ్రీలాన్సర్‌లుగా పనిచేస్తారు కాబట్టి, మీకు ఇష్టమైనప్పుడు, ఇష్టమైన ప్రాంతానికి ప్రయాణించవచ్చు.
ఈవెంట్ మేనేజర్ (Event Manager)
ఈవెంట్ మేనేజర్‌లు ఫెస్టివల్స్, వెడ్డింగ్స్, కాన్ఫరెన్స్‌లు వంటి వాటిని నిర్వహిస్తారు. ఈ ఉద్యోగంలో బడ్జెట్‌లు, వెండార్స్ మరియు లాజిస్టిక్స్‌ను నిర్వహించాల్సి వస్తుంది.
అనేక ఈవెంట్‌లకు సైట్ విజిట్స్ లేదా వివిధ నగరాలు, దేశాలకు ట్రావెల్ చేయాల్సి వస్తుంది. కార్పొరేట్ మరియు ఇంటర్నేషనల్ ఈవెంట్ మేనేజర్‌లు ప్రపంచవ్యాప్తంగా ఈవెంట్‌లను నిర్వహించడానికి తరచుగా ప్రయాణాలు చేస్తుంటారు.
టూర్ గైడ్ (Tour Guide)
మీకు చరిత్ర, సంస్కృతి మరియు ప్రజలతో మాట్లాడటం ఇష్టమైతే, ఈ ఉద్యోగం చక్కగా సరిపోతుంది. టూర్ గైడ్స్ చారిత్రక ప్రదేశాలు లేదా అడ్వెంచర్ టూర్స్‌లో టూరిస్ట్ గ్రూప్‌లకు గైడ్ చేస్తారు. వారు స్థానిక కథలు, విశేషాలు, ఆసక్తికరమైన అంశాలను వివరిస్తారు. ఇతరులు కొత్త ప్రదేశాలను ఆస్వాదించేలా ఎంకరేజ్ చేస్తూ, మీరు కూడా ప్రతిరోజూ కొత్త ప్రదేశాలకు ట్రావెల్ చేయడానికి ఇది బెస్ట్ కెరీర్ ఆప్షన్.
ట్రావెల్ ఫోటోగ్రాఫర్ (Travel Photographer)
మీకు ఫోటోలు తీయడం అభిరుచి అయితే, ఇదే మీ డ్రీమ్ జాబ్ అవుతుంది. ట్రావెల్ ఫోటోగ్రాఫర్‌లు అద్భుతమైన ఫోటోలు తీయడానికి అనేక ప్రదేశాలను సందర్శిస్తారు.
రైటర్స్, మ్యాగజైన్‌లు లేదా టూరిజం బోర్డులతో కలిసి పని చేయవచ్చు లేదా ఆన్‌లైన్‌లో ఫోటోలు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. ఫోటోగ్రఫీలో సాంకేతిక నైపుణ్యాలు, క్రియేటివిటీ, ఓర్పు అవసరం. ప్రయాణించే సమయంలో వర్క్‌షాప్స్‌లో టీచ్ చేయడం ద్వారా కూడా సంపాదించవచ్చు.
ఇంటర్నేషనల్ ఎయిడ్ వర్కర్ (International Aid Worker)
ఇంటర్నేషనల్ ఎయిడ్ వర్కర్లు సంక్షోభంలో ఉన్న ప్రజలకు సహాయం చేస్తారు. హ్యుమానిటేరియన్ లేదా డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్స్‌తో కలిసి పనిచేస్తారు.
విపత్తులు లేదా యుద్ధాల సమయంలో ప్రజలకు సహాయం చేయడానికి వారు వివిధ దేశాలకు, కొన్నిసార్లు మారుమూల ప్రాంతాలకు కూడా ప్రయాణిస్తారు. ఈ జాబ్‌కి కరుణ, సాంస్కృతిక అవగాహన, దృఢత్వం మరియు భాషా నైపుణ్యాలు అవసరం.
మర్చంట్ నేవీ సెయిలర్‌లు మహాసముద్రాల మీదుగా సరుకు రవాణా చేసే నౌకల్లో పని చేస్తారు. ఈ జాబ్‌లో భాగంగా సముద్రంలో ఎక్కువ సమయం గడపడం, అనేక అంతర్జాతీయ ఓడరేవులను సందర్శించడం ఉంటుంది. నావికులు ప్రత్యేకమైన సంస్కృతులను అనుభవించే అవకాశం ఉంటుంది.