AP Police: రాజకీయ, మతపరమైన చిచ్చు పెట్టేవారిపై నిఘా.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వార్నింగ్.! Pawan Kalyan: కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భారీ స్కెచ్! Nara Lokesh: మండల స్థాయి నేతలకు పొలిట్ బ్యూరోలో చోటు.. టీడీపీలో చారిత్రాత్మక మార్పుకు లోకేష్ శ్రీకారం! Nara Lokesh: ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. రేపు ఉదయం 10:31 గంటలకు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల! మీ ఇంటర్ మార్కులు మీ ఫోన్‌లోకి! Road Safety: జాతీయ రహదారులపై ఓవర్‌లోడ్ వాహనాలకు చెక్.. ఏప్రిల్ 15 నుంచి కొత్త రూల్స్! IPL 2026: గెలుపు ఖాతా తెరిచేనా?: చెన్నైతో పోరులో కోల్‌కతా కీలక మార్పు.. వరుణ్ చక్రవర్తి రీఎంట్రీ.. Bank Holidays: బ్యాంక్ పనులు ఉన్నాయా? అయితే ఈ సెలవుల లిస్ట్ మీ కోసమే...! Overload Vehicles: ఓవర్‌లోడ్ వాహనాలకు కేంద్రం షాక్.. ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు! అదిరిపోయే జరిమానా! Electric Scooter: ఎలక్ట్రిక్ స్కూటర్ రంగంలో ఓలా దూకుడు.. 5.2 kWh బ్యాటరీతో సరికొత్త రికార్డు! Samrat Chaudhary: బిహార్ నూతన ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి! రేపే ప్రమాణ స్వీకారం... AP Police: రాజకీయ, మతపరమైన చిచ్చు పెట్టేవారిపై నిఘా.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వార్నింగ్.! Pawan Kalyan: కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భారీ స్కెచ్! Nara Lokesh: మండల స్థాయి నేతలకు పొలిట్ బ్యూరోలో చోటు.. టీడీపీలో చారిత్రాత్మక మార్పుకు లోకేష్ శ్రీకారం! Nara Lokesh: ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. రేపు ఉదయం 10:31 గంటలకు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల! మీ ఇంటర్ మార్కులు మీ ఫోన్‌లోకి! Road Safety: జాతీయ రహదారులపై ఓవర్‌లోడ్ వాహనాలకు చెక్.. ఏప్రిల్ 15 నుంచి కొత్త రూల్స్! IPL 2026: గెలుపు ఖాతా తెరిచేనా?: చెన్నైతో పోరులో కోల్‌కతా కీలక మార్పు.. వరుణ్ చక్రవర్తి రీఎంట్రీ.. Bank Holidays: బ్యాంక్ పనులు ఉన్నాయా? అయితే ఈ సెలవుల లిస్ట్ మీ కోసమే...! Overload Vehicles: ఓవర్‌లోడ్ వాహనాలకు కేంద్రం షాక్.. ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు! అదిరిపోయే జరిమానా! Electric Scooter: ఎలక్ట్రిక్ స్కూటర్ రంగంలో ఓలా దూకుడు.. 5.2 kWh బ్యాటరీతో సరికొత్త రికార్డు! Samrat Chaudhary: బిహార్ నూతన ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి! రేపే ప్రమాణ స్వీకారం...

America: అమెరికా షట్ డౌన్..! నెలరోజుల్లో రూ.62,000 కోట్ల నష్టం..!

 అమెరికాలో ప్రభుత్వం మూతపడిన పరిస్థితి (షట్‌డౌన్‌) కొనసాగుతూనే ఉంది. అధికార పక్షం, విపక్షాల మధ్య కీలక బిల్లులపై ఎటువంటి అంగీకారం కుదరకపోవడంతో ఇప్పటికే 31 ర

Published : 2025-11-01 18:38:00
Metro: హైదరాబాద్‌ మెట్రో రైలు సమయాల్లో మార్పులు..! ప్రయాణికులకు కీలక సమాచారం..!

అమెరికాలో ప్రభుత్వం మూతపడిన పరిస్థితి (షట్‌డౌన్‌) కొనసాగుతూనే ఉంది. అధికార పక్షం, విపక్షాల మధ్య కీలక బిల్లులపై ఎటువంటి అంగీకారం కుదరకపోవడంతో ఇప్పటికే 31 రోజులుగా అమెరికా ప్రభుత్వం పూర్తిగా షట్‌డౌన్‌లో ఉంది. ప్రభుత్వ సంస్థలు, విభాగాల పనితీరు దెబ్బతిన్నాయి. ఈ స్థితి నెలరోజులకుపైగా కొనసాగుతుండటంతో దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ తగిలింది. కాంగ్రెషనల్ బడ్జెట్ కార్యాలయం అంచనాల ప్రకారం, ఇప్పటి వరకు 7 బిలియన్ డాలర్లకు పైగా నష్టం జరిగింది. ఇది భారత రూపాయల్లో సుమారు రూ.62,000 కోట్లకు సమానం.

కొత్త అసెంబ్లీ భవనం ప్రారంభించిన మోదీ!!

ఈ షట్‌డౌన్‌ త్వరగా ముగియకపోతే ఆర్థిక నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని బడ్జెట్ కార్యాలయం హెచ్చరించింది. ప్రస్తుతం నెల రోజుల్లో 7 బిలియన్ డాలర్ల నష్టం నమోదవగా, ఈ స్థితి మరో రెండు వారాలు కొనసాగితే 11 బిలియన్ డాలర్ల వరకు, రెండు నెలలకు చేరుకుంటే 14 బిలియన్ డాలర్ల వరకు నష్టం జరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు జీతాలు అందుకోలేక ఇబ్బందులు పడుతుండటం, సేవల నిలిచిపోవడం, వ్యాపార లావాదేవీలు మందగించడం వంటి కారణాలతో ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతోంది.

ఓటీటీ లవర్స్‌కు పండగ.. ఒక్క రోజులో 20 కొత్త సినిమాలు! బ్లాక్ బస్టర్ నుంచి క్రైమ్ థ్రిల్లర్ వరకు.. ఇక్కడ చూసేయండి!

మూడీస్‌ అనలిటిక్స్‌కు చెందిన ఆర్థిక నిపుణుడు మార్క్ జాండీ మాట్లాడుతూ — “అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ బలహీన స్థితిలో ఉంది. ఈ షట్‌డౌన్‌ కొనసాగితే పరిస్థితి ఊహించిన దానికంటే ఘోరంగా మారే ప్రమాదం ఉంది” అని అన్నారు. మరోవైపు కేపీఎంజీ సంస్థ చీఫ్ ఎకనమిస్ట్ డయాన్ స్వాంక్‌ మాట్లాడుతూ — “ఈ సమస్య చిన్నదిగా కనిపించినప్పటికీ, దీని ప్రభావం పెద్దదిగా ఉంటుంది. వ్యాపార రంగం, ఉద్యోగావకాశాలు, మార్కెట్‌ విశ్వాసం అన్నీ దెబ్బతింటాయి” అని హెచ్చరించారు.

భారతీయుల కలల గమ్యంగా మారిన UAE గోల్డెన్ వీసా!

గతంలో కూడా అమెరికాలో ప్రభుత్వ మూతపడిన సందర్భాలు ఉన్నాయి. 1981 నుండి ఇప్పటి వరకు 15 సార్లు ప్రభుత్వం మూతపడింది. డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 2018-19 మధ్య 35 రోజుల పాటు షట్‌డౌన్‌ కొనసాగి, దేశ చరిత్రలోనే సుదీర్ఘంగా నిలిచింది. ప్రస్తుత పరిస్థితి కూడా దాని తర్వాత రెండవ అతిపెద్ద షట్‌డౌన్‌గా మారింది. దీనివల్ల జాబ్ మార్కెట్‌, చిన్న వ్యాపారాలు, సేవా రంగం తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ సంక్షోభాన్ని నివారించేందుకు అధికార, విపక్షాలు త్వరగా ఒక నిర్ణయానికి రావాలని ప్రజలు కోరుతున్నారు.

Movie update: జాన్వీ కపూర్‌ కొత్త మాస్ లుక్‌లో ఫ్యాన్స్‌ ఫిదా!
Crop Loss: ఏపీలో కరువు కాటుకు 37 మండలాలు బలి..! మూడు జిల్లాల్లో పంటల నష్టపరిస్థితి తీవ్రం..!
RTGS Centers: ఏపీలో విపత్తు నిర్వహణలో కొత్త అధ్యాయం..! ప్రతి జిల్లాలో RTGS కమాండ్‌ సెంటర్లు..!
Chrome: గూగుల్ క్రోమ్ వినియోగదారులకు హై రిస్క్ అలర్ట్..! వ్యక్తిగత డేటా దొంగిలించే ప్రమాదం..!
కాశీబుగ్గ ఘటనపై సీఎం చంద్రబాబు పలువురు మంత్రులు దిగ్భ్రాంతి! గాయపడిన వారికి మెరుగైన వైద్యం ఆదేశం!
Arcelor Mittal Plant: ఏపీలో అతిపెద్ద ఆర్సెలర్ మిట్టల్ & నిప్పాన్ స్టీల్స్ ప్లాంట్! రూ.1.5 లక్షల కోట్లతో.. అక్కడే ఫిక్స్!

Spotlight

Read More →