అనంతపురం (Anantapur) జిల్లా తాడిపత్రిలో 18 మంది తెదేపా, వైకాపా (YCP) వర్గీయులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ వీరిపై కేసు నమోదైంది. మూడ్రోజుల క్రితం రీకాల్ చంద్రబాబు (Chandrababu) మేనిఫెస్టో కార్యక్రమాన్ని వైకాపా నిర్వహించింది.
ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి (Former MLA Kethireddy Pedda Reddy) కోడలు హర్షితరెడ్డి హాజరయ్యారు. సమావేశం వద్దకు వెళ్లేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ 18 మందిపై కేసు నమోదు చేశారు.