ప్రొఫెసర్ మాధవి లత భారత దేశానికి గర్వకారణంగా నిలిచారు. చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన నిర్మాణంలో ఆమె కీలకపాత్ర పోషించారు. భూకంపాలు సంభవించే ప్రాంతాల్లో, గాలి వేగం అధికంగా ఉండే లోయల మధ్య వంతెన నిర్మించడం ఎంతో క్లిష్టమైన పని. ఈ సంక్లిష్టతల్ని మాధవీలత గారు శాస్త్రీయ పరిజ్ఞానం, పట్టుదల, సంకల్పబలం ద్వారా అధిగమించి వంతెన నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేయడంలో ముఖ్యపాత్ర పోషించారు. ఈ ప్రాజెక్టులో ఆమె 17 సంవత్సరాల పాటు కృషిచేయడం గొప్ప విజయానికి నిదర్శనం.
దేశం గర్వపడేలా మరో తెలుగు మహిళ మాధవి లత! చంద్రబాబు అభినందనలు!
