Storm effect : తుఫాన్ ఎఫెక్ట్.. రేపు తిరుపతి జిల్లాలో అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు!

2025-11-30 21:45:00
Smriti-Palash: స్మృతి పలాష్ పెళ్లి రద్దు రూమర్స్‌కు పుల్‌స్టాప్.. పెళ్లి వాయిదా వెనుక నిజమేంటి!

దిత్వా తుఫాను ప్రభావం రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే సముద్రంలో తుఫాను తీవ్రరూపం దాల్చి, తీరం వైపు వేగంగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తీర జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరించారు. ప్రత్యేకించి తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో వర్షాలు మరింత తీవ్రంగా ఉండే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.

Power system: అమరావతిలో ఆధునిక అండర్‌గ్రౌండ్ పవర్ సిస్టమ్ ఏర్పాటు.. మంత్రి లోకేశ్!

ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ముందుజాగ్రత్త చర్యగా రేపు (శనివారం) జిల్లాలోని అన్ని స్కూళ్లు, కాలేజీలు మరియు అంగన్వాడీలకు సెలవు ప్రకటించారు. పిల్లల భద్రత, ప్రయాణ సమస్యలను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టరేట్ అధికారులు తెలిపారు. వర్షాల తీవ్రత రాత్రికి రాత్రే పెరిగే అవకాశం ఉండడంతో రేపు ఉదయం ప్రయాణంకూడా ప్రమాదకరంగా ఉండొచ్చని సూచించారు.

Fitness Lifestyle: బేర్ గ్రిల్స్ రోజంతా ఏమి తింటాడో తెలుసా? సింపుల్‌ సహజ ఆహారమే అతని రహస్య శక్తి!

ఇదే సమయంలో నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా తుఫాను ముప్పు పెరుగుతుండడంతో అక్కడి తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత కోసం ప్రభుత్వాన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించాలని కోరుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో, పలు స్థానిక సంఘాలు, విద్యార్థి సంఘాలు కూడా దీనిపై డిమాండ్ చేస్తున్నాయి. ముందస్తు జాగ్రత్త చర్యలుగా నదులు, కాలువల దగ్గరకి వెళ్లవద్దని, అవసరమైతే తప్ప బయట తిరగవద్దని, ఇంటి దగ్గర నీరు చేరినట్లయితే వెంటనే స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

DWACRA Women: డ్వాక్రా మహిళలకు మంచి అవకాశం.. కొత్త బాధ్యతలు.. కాంట్రాక్టర్ల స్థానంలో..!

వాతావరణ శాఖ తాజా అంచనా ప్రకారం రేపు తిరుపతి జిల్లాలో గంటకు 60–80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. పిడుగులు పడే అవకాశం కూడా ఉందని చెప్పారు. తుఫాన్ తీరం చేరే సమయంలో భారీ వర్షాలతో పాటు వరదలు, మట్టిచరియలు సంభవించే అవకాశముందని హెచ్చరించారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు, చెట్లు పడిపోయే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

RITESలో భారీ నియామకాలు! 400 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు... వెంటనే అప్లై చేయండి!

ప్రభుత్వం అన్ని శాఖలను అప్రమత్తంగా ఉంచి, NDRF బృందాలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో విభాగాల కంట్రోల్ రూమ్ నంబర్లకు సంప్రదించవచ్చని సూచించారు. ఇంకా ఏ ఏ జిల్లాలకు సెలవులు ప్రకటిస్తారో, తుఫాన్ ఎప్పుడు తీరం దాటుతుందో తదుపరి అప్‌డేట్స్ కోసం వేచి చూడాలి.

Kohli creates history: వన్డేల్లో చరిత్ర సృష్టించిన కోహ్లి.. సచిన్ రికార్డు బ్రేక్!
ఆ జిల్లాలకు మహర్దశ.. 7 కీలక రహదారుల ఆధునికీకరణకు గ్రీన్ సిగ్నల్! రూ.936 కోట్లతో 470 కి.మీ.
భారత్‌లో ఇదే అతి పొడవైనది.. బంగాళాఖాతం, వైజాగ్ నగర అందాలు ఇక గ్లాస్ బ్రిడ్జిపై నుంచే! రేపటి నుంచి..
రష్మిక ఫ్యాన్స్‌కు పండగే.. 'ది గర్ల్‌ఫ్రెండ్' 5 రోజుల్లో 5 భాషల్లో విడుదల – స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే!
సినిమా పెద్దలు.. ఆలోచించాలి! మన స్టైల్ చూసి హిందీ వాళ్ళకి - బాలకృష్ణ ముక్కుసూటి మాట!
TTD News: తిరుమల లేటెస్ట్ అప్‌డేట్.. సర్వదర్శనానికి 15 గంటల నిరీక్షణ! 24 కంపార్ట్‌మెంట్లు పూర్తిగా..
Ayushman card: మొబైల్ నంబర్‌తోనే ఆయుష్మాన్ కార్డు డౌన్లోడ్... రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స!
AP News: పండగ ముందు గుడ్ న్యూస్.. కొత్త జాతీయ రహదారి అందుబాటులోకి! రెండు కొత్త టోల్ ప్లాజాలు..

Spotlight

Read More →