Lokesh Speech: వైసీపీకి గుణపాఠం.. పులివెందులలో '30 ఏళ్ళ భయం' బ్రేక్: లోకేశ్ సంచలన వ్యాఖ్యలు!

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక నిరుపేద కుటుంబాన్ని విషాదంలో ముంచివేసింది. హైదరాబాద్‌కు చెందిన శ్రీజ వర్మ అనే యువతి రోడ్డు ప్రమాదంలో మరణించింది. భవిష్యత్తుపై ఎన్నో కలలు కన్న ఆ యువతి జీవితం అనుకోని సంఘటనతో అర్ధాంతరంగా ముగిసింది. సిద్దిపేట జిల్లాకు చెందిన ఈ కుటుంబం ఉన్నత చదువుల కోసం తమ కుమార్తెలను అమెరికా పంపించింది. వారి కష్టానికి ప్రతిఫలంగా శ్రీజ వర్మ ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో జరిగిన ఈ దుర్ఘటన ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో పడేసింది. ఈ ఘటన కుటుంబసభ్యులకు మాత్రమే కాకుండా, ఈ వార్త విన్న ప్రతి ఒక్కరినీ కలచివేసింది.

Fear of AI: AI భయం.. ఉద్యోగ భవిష్యత్తు ఏంటి!

దుర్ఘటన జరిగిన తీరు…
 సోమవారం రాత్రి శ్రీజ తన అపార్ట్‌మెంట్ నుంచి భోజనం కోసం కారులో బయలుదేరింది. తిరిగి వస్తుండగా, ఆమె కారును ఒక ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీజ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆమె స్నేహితురాలు కూడా కారులో ఉన్నట్లు సమాచారం. శ్రీజ మరణంతో ఆమె స్నేహితురాలు, అక్కడి స్నేహితులు మరియు కుటుంబసభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. అమెరికాలో స్థానిక పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

Minister Speech: పేదల విద్యకు 'బంగారు బాట'.. రూ.300 కోట్లు కేటాయించిన ప్రభుత్వం! భవిష్యత్తుకు భరోసా..

కుటుంబ నేపథ్యం…
శ్రీజ వర్మ స్వస్థలం సిద్దిపేట జిల్లాలోని రామారుకల గ్రామం. ఆమె తండ్రి శ్రీనివాస్ వర్మ, తల్లి హేమలత. వారికి ఇద్దరు కుమార్తెలు, శ్రీజ వర్మ, శ్రేయ వర్మ. కుటుంబాన్ని పోషించుకోవడం కోసం వీరు హైదరాబాద్‌కు వలస వచ్చారు. ప్రస్తుతం గండిమైసమ్మ చౌరస్తా సమీపంలో నివాసం ఉంటున్నారు. శ్రీనివాస్ వర్మ డ్రైవర్‌గా పనిచేస్తూ, హేమలత ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తూ తమ కుమార్తెల చదువుల కోసం ఎంతో కష్టపడ్డారు. పెద్ద కూతురు శ్రీజ ఎంఎస్ పూర్తి చేయగా, చిన్న కూతురు శ్రేయా వర్మ కూడా కేవలం 20 రోజుల క్రితం ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లింది. ఇద్దరు కుమార్తెలను ఉన్నత చదువుల కోసం అమెరికా పంపించిన ఈ నిరుపేద కుటుంబం, పెద్ద కూతురి మరణ వార్త విన్న తర్వాత తమ కష్టం, కలలు అన్నీ ఒకేసారి కూలిపోయాయి.

Movie Tickets: తెలుగు రాష్ట్రాల్లో టికెట్ బుకింగ్స్ ఓపెన్.. కూలీ వార్ 2 హాట్ హాట్!

దు:ఖంలో కుటుంబసభ్యులు…
కుటుంబంలో పెద్దదిగా శ్రీజ చాలా బాధ్యతగా ఉండేది. చిన్నప్పటినుంచి మంచి విద్యార్థిని. ఎంఎస్ పూర్తి చేసి, మంచి ఉద్యోగం సంపాదించి తమ కుటుంబానికి ఆర్థికంగా చేయూతనివ్వాలని ఆమె ఆశపడింది. శ్రీజ మరణంతో ఆమె తల్లిదండ్రులు, సోదరి శ్రేయ వర్మ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆమె మరణవార్త విన్న బంధువులు, స్నేహితులు వారి కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నారు. ఈ బాధాకరమైన సమయంలో వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు. ఈ దుర్ఘటన అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థుల భద్రతపై ఆందోళనలను పెంచుతోంది.

Ap Development: ఏపీ ప్రభుత్వ నూతన అడుగు.. రెండు మెగా ప్రాజెక్టులు! ఆ రెండు జిల్లాలకు దశ తిరిగినట్లే.!
New Highway: గుడ్ న్యూస్.. 226 కి.మీ. ఆరు లేన్ల హైవే.. తెలంగాణ, ఏపీకి డబుల్ లాభం!
Farmers check: పంట బీమా డబ్బులు ఖాతాల్లోకి వచ్చాయా.. రైతులు ఇలా చెక్ చేసుకోండి!
Ronaldo engagement: పిల్లల తర్వాత రొనాల్డో జార్జినా ఎంగేజ్మెంట్.. ఎనిమిదేళ్ల ప్రేమకు ముగింపు!
Health: నిద్రలో చేతులు, కాళ్లు మొద్దుబారుతున్నాయా.. చిన్న సమస్య, పెద్ద హెచ్చరిక!
Nominated posts: తాజాగా మరో నామినేటెడ్ పోస్టుల లిస్టు విడుదల! వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు.. ఎవరెవరంటే?