Reddit User: రెండు సార్లు రిజెక్ట్ అయిన ఫ్రాన్స్ వ్యాపార వీసా! కారణాలు ఇవే!

భారతీయ రిజర్వ్ బ్యాంక్ బంగారు నిల్వలు 2025-26 ఆర్థిక సంవత్సరపు మొదటి ఆరు నెలల్లో 880 మెట్రిక్ టన్నులను దాటాయి. సెప్టెంబర్ చివరి వారం లోనే కేంద్ర బ్యాంక్ 0.2 మెట్రిక్ టన్నులు (200 కిలోలు) బంగారాన్ని అదనంగా కొనుగోలు చేసింది. ఈ వివరాలు తాజా RBI బులెటిన్‌లో వెల్లడయ్యాయి.

Deportation: లండన్‌ పరిశోధకురాలుకు భారత లో నో ఎంట్రీ! ఢిల్లీ విమానాశ్రయంలో..

సెప్టెంబర్ 26, 2025 నాటికి భారత రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉన్న మొత్తం బంగారం విలువ 95 బిలియన్ అమెరికన్ డాలర్లు దాదాపు 7.9 లక్షల కోట్లు గా నమోదైంది.

Electricity: వినియోగదారులకు గుడ్ న్యూస్..! APEPDCL కొత్త విధానంతో విద్యుత్ కనెక్షన్ సులభతరం..!

బంగారం కొనుగోళ్లు పెరుగుతున్నా, సెప్టెంబర్‌కి ముగిసిన ఆరు నెలల కాలంలో RBI మొత్తం 0.6 మెట్రిక్ టన్నుల 600 కిలోల బంగారాన్ని కొనుగోలు చేసింది. ఇందులో జూన్ నెలలో 0.4 మెట్రిక్ టన్నులు, సెప్టెంబర్ నెలలో 0.2 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయబడినట్లు RBI వెల్లడించింది. దీంతో 2024-25 ఆర్థిక సంవత్సరం ముగింపునాటికి ఉన్న 879.58 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలు 2025 సెప్టెంబర్ నాటికి 880.18 మెట్రిక్ టన్నులకు చేరాయి.

Saudi Arabia: కొత్త గ్రాండ్ ముఫ్తీగా ఆయన నియామకం! మతపరమైన చరిత్రలో కొత్త అధ్యాయం!

గత ఆర్థిక సంవత్సరం 2024-25 లో మాత్రమే RBI 54.13 మెట్రిక్ టన్నుల బంగారాన్ని తన నిల్వలకు చేర్చింది, ఇది కేంద్ర బ్యాంక్ బంగారంపై చూపిస్తున్న స్థిరమైన నమ్మకాన్ని సూచిస్తుంది.

Fixed Deposits: షేర్లు, మ్యూచువల్‌ ఫండ్ల మధ్యనూ దూసుకెళ్తున్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు..! టాప్‌ బ్యాంకుల వడ్డీ రేట్లు ఇవే..!

ప్రపంచవ్యాప్తంగా బంగారం డిమాండ్ పెరుగుదల.                                         RBI బులెటిన్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు భౌగోళిక ఉద్రిక్తతలు పెరగడంతో బంగారం సేఫ్ హావెన్ పెట్టుబడి గా మరింత ప్రాధాన్యత పొందుతోంది. పెట్టుబడిదారులు మరియు దేశాల కేంద్ర బ్యాంకులు బంగారాన్ని సేఫ్ పెట్టుబడిగా ఎంచుకోవడంతో డిమాండ్ గణనీయంగా పెరిగింది.

Vizag: గూగుల్‌ డేటా సెంటర్‌ మాత్రమే కాదు..! అణు రక్షణ కేంద్రంగా మారుతున్న విశాఖపట్నం..!

2025 మూడవ త్రైమాసికంలో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా సెప్టెంబర్‌లో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు అత్యధిక స్థాయిని తాకాయి.                               RBI నివేదిక ప్రకారం ప్రపంచ కేంద్ర బ్యాంకులు మొత్తం 166 టన్నుల బంగారాన్ని తమ అధికారిక నిల్వలకు చేర్చాయి. ఈ చర్య కూడా గ్లోబల్ బంగారం డిమాండ్‌ను మరింత పెంచింది.

Praja Vedika: నేడు (23/10) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

బంగారంపై పెరుగుతున్న పెట్టుబడి ఆకర్షణ ప్రపంచ ఆర్థిక పరిస్థితులు అనిశ్చితంగా ఉన్న ఈ కాలంలో బంగారం మళ్లీ పెట్టుబడిదారుల విశ్వసనీయ ఆస్తిగా మారింది. కరెన్సీ మార్పులు ద్రవ్యోల్బణం మరియు రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం స్థిరమైన రాబడిని అందించే సాధనంగా భావిస్తున్నారు.           భారతీయ రిజర్వ్ బ్యాంక్ కూడా తన విదేశీ మారక నిల్వలలో భాగంగా బంగారానికి ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. ఇది దేశ ఆర్థిక భద్రతకు బలమైన ఆధారంగా నిలుస్తోంది.

Flight: విజయవాడ నుంచి సింగపూర్‌.. కేవలం నాలుగు గంటల్లో..! ఇండిగో కొత్త సర్వీసు లాంచ్‌!

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనిశ్చిత పరిస్థితులు పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు మరియు ద్రవ్యోల్బణ ప్రభావాల మధ్య RBI బంగారం నిల్వలను క్రమంగా పెంచుతూ దేశ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడే దిశగా అడుగులు వేస్తోంది. 880 మెట్రిక్ టన్నుల మైలురాయిని దాటడం భారత ఆర్థిక బలం మరియు వ్యూహాత్మక దృష్టిని ప్రతిబింబించే విశేష ఘట్టంగా నిలిచింది.

US ఇమ్మిగ్రేషన్ షాక్.. ఆ విద్యార్థులకు పెరిగిన ఆందోళన! అసాధారణ ప్రతిభ ఉందా? అయితేనే 0-1 వీసా
పాక్‌లో కూరగాయల ధరల మంట.. కిలో టమాటా, అల్లం, ఉల్లిపాయలు - సామాన్యుడికి చుక్కలు!