అనంతపురం జిల్లా రాంనగర్‌లోని ఓ బ్యాంకులో గోల్డ్ లోన్ మోసం ఘటన కలకలం రేపుతోంది. బ్యాంకు ఉద్యోగి వెంకటపల్లి సతీష్‌కుమార్ పాత ఉద్యోగి జయరాముతో కలిసి రెండు కేజీలకు పైగా బంగారం మోసం చేసినట్లు వెలుగుచూసింది. కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారాన్ని, బ్యాంకు అధికారులకు తెలియకుండా గుట్టుగా తీసుకెళ్లి మరో ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ అయిన కీర్తన ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టినట్లు వెల్లడైంది.
నలుగురు వ్యక్తులతో కలిసి సతీష్ భారీ మోసానికి పాల్పడ్డాడు. తాకట్టు బంగారం బ్యాంకులో లేకపోవడంతో అనుమానం వచ్చిన అధికారుల ఫిర్యాదుతో నిజాలు బయటపడ్డాయి. రెన్యువల్ పేరుతో కస్టమర్లను పిలిపించి, విత్‌డ్రా ఫారాలపై సంతకాలు చేయించి బంగారం తీసుకెళ్లారని పోలీసులు తెలిపారు.
పోలీసుల దర్యాప్తులో టెక్నికల్ ఆధారాలపై కేసు చేధించగా, మొత్తం మోసానికి గురైన బంగారం 2 కేజీలకు పైగా ఉన్నట్లు తేలింది. నిందితుల వద్ద నుంచి 50 గ్రాముల బంగారం, నాలుగు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
A2 వద్ద 330 గ్రాములు
A3 వద్ద కిలో 200 గ్రాములు
A4 వద్ద 650 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.