పహల్గాం ఉగ్రదాడి తర్వాత తొలిసారిగా జమ్మూ కశ్మీర్లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ప్రపంచంలోనే అతి ఎత్తైన ఐకానిక్ చీనాబ్ రైల్వే బ్రిడ్జిని ఆయన ప్రారంభించారు.. చీనాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో ఆర్క్ బ్రిడ్జి నిర్మించారు. 1,315 మీటర్ల పొడవైన స్టీల్ బ్రిడ్జ్ ఒక ఇంజనీరింగ్ అద్భుతం. రైల్వే బ్రిడ్జిని ప్రధాని మోదీ శుక్రవారం.. జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో జమ్మూ కశ్మీర్ సీఎం ఓమర్ అబ్దుల్లా, రైల్వేమంత్రి అశ్విన్ వైష్ణవ్ పాల్గొన్నారు. ఈ క్రమంలో పలు అభివృద్ధి పథకాలను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. అలాగే కాట్రా- శ్రీనగర్ మధ్య వందే భారత్ ట్రైన్ను ఆయన ప్రారంభించారు. ఈ రైలు ప్రారంభంతో కాట్రా- శ్రీనగర్ మధ్య దూరం తగ్గనుంది. కేవలం మూడు గంటలోనే రైలు చేరుకుంటోంది. భారత్లో తొలిసారిగా రూపొందించిన కేబుల్ రైల్వే బ్రిడ్జి అంజి బ్రిడ్జిని మోదీ ప్రారంభించనున్నారు. 43,780 కోట్ల రూపాయల వ్యయంతో ఉదంపూర్ శ్రీనగర్ భారముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టు ప్రకటన ప్రధాని మోదీ చేయనున్నారు. సరిహద్దు ప్రాంతాలకు రోడ్డు కనెక్టివిటీ కోసం పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.350 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించనున్న శ్రీమాతా వైష్ణో దేవి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ప్రాజెక్ట్కు మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
ఇది కూడా చదవండి: ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఓ ఇంటి వాడైన అక్కినేని వారసుడు అఖిల్.. హాజరైన సినీ తారలు!
బిగ్ అప్డేట్.. ఈ విషయం తెలియకుండా అస్సలు ఫ్లైట్ ఎక్కొద్దు.. లేదంటే మీ పని అంతే.!
అమెరికాలోకి ప్రవేశంపై 19 దేశాలకు షాక్.. ట్రంప్ నుంచికొత్త ప్రయాణ నిషేధ ఉత్తర్వులు!
రైతులకి గుడ్ న్యూస్.. పంటకి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం! దరఖాస్తు ఇలా..
నా తప్పు మృగాళ్లందరికీ కనువిప్పు కావాలి.. పాపా నువ్వయినా నన్ను క్షమిస్తావా!
జగన్‌పై కేంద్రమంత్రి ఆగ్రహం.. మీ తీరు మారకపోతే ఈసారి మిగిలేది ఒక్కటే!
ట్రంప్ సంచలన నిర్ణయం.. విద్యా, దౌత్య వర్గాల్లో తీవ్ర ఆందోళన! వీసాల రద్దుకు కూడా ఆదేశాలు..
హామీల అమలుపై చర్చకు రావాలి.. వైకాపాకు మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే సవాల్!
యువగళం పుస్తకం.. లోకేష్‌కు పవన్ అభినందనలు! ఆనాటి అనుభవాలను కళ్లకి కట్టినట్లుగా..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: