విద్య ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఈ పర్యటనలో ఆస్ట్రేలియా ప్రభుత్వ ప్రతినిధులు పరిశ్రమల నాయకులు విద్యా సంస్థల వైస్ ఛాన్సలర్లు ఇండియా-ఆస్ట్రేలియా బిజినెస్ కౌన్సిల్ సభ్యులతో సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య పరిశోధన (R&D), నైపుణ్యాభివృద్ధి, మరియు టాలెంట్ ఎక్స్చేంజ్ కార్యక్రమాలను మరింత బలపరచే దిశగా చర్చలు జరిపారు.
లోకేష్ మాట్లాడుతూ భారత్ $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ వైపు పయనిస్తోంది. ఈ వృద్ధిలో ముఖ్యమైన అంశాలు — నైపుణ్యవంతమైన వర్క్‌ఫోర్స్, పరిశోధన, మరియు అంతర్జాతీయ భాగస్వామ్యాలు. ఈ పర్యటనలో ఆ దిశగా గట్టి అడుగులు వేసాము అని తెలిపారు.
ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాలతో విద్యార్థుల కార్యక్రమాలు, టెక్నాలజీ పరిశోధనలో సంయుక్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశాలు పరిశీలించారు.
ఆస్ట్రేలియా పర్యటనలో అత్యంత చర్చనీయాంశమైన అంశం క్రీడలను ఆర్థిక వ్యవస్థలో భాగంగా చూడడం. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో క్రికెట్ విక్టోరియా అధికారులు, క్రీడా నిర్వహణ నిపుణులతో జరిగిన సమావేశం ఎంతో కీలకంగా నిలిచింది.
అక్కడి అధికారులు వివరాల ప్రకారం, MCG కేవలం మ్యాచ్‌ల కోసం మాత్రమే కాదు సంవత్సరం పొడవునా కాన్వెన్షన్ సెంటర్లు, బ్యాంక్వెట్ హాల్స్ ఈవెంట్ ప్రాంగణాలుగా ఉపయోగపడుతూ, విక్టోరియా ఏటా సుమారు A$1.3 బిలియన్ రూపాయల పన్నులు టూరిజం ఆదాయాన్ని తెస్తుందని తెలిపారు.
ఈ మోడల్‌ను ఆదర్శంగా తీసుకొని, ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచస్థాయి స్టేడియాలు నిర్మించాలన్న సంకల్పాన్ని వ్యక్తపరిచారు. క్రీడలు యువతను మాత్రమే కాదు, రాష్ట్ర ఆర్థికవ్యవస్థను కూడా ముందుకు తీసుకెళ్లగలవు అని తెలిపారు.
ఈ పర్యటనలో లోకేష్ ఆస్ట్రేలియన్ పరిశ్రమల ప్రతినిధులతో కూడా భేటీ అయ్యారు. ఐటీ, సముద్ర ఆహార ప్రాసెసింగ్, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానించారు. పలు కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులపై ఆసక్తి చూపుతున్నాయి