RRB: NTPC పరీక్ష ప్రాథమిక ఆన్సర్‌ కీ విడుదల..! ఫలితాలు త్వరలోనే!

భారత రైల్వే మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే జోన్లలో సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 368 పోస్టులను భర్తీ చేయనున్నట్లు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ప్రకటించింది. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సెప్టెంబర్ 15, 2025 నుంచి ప్రారంభమవుతాయి. చివరి తేదీ అక్టోబర్ 14గా నిర్ణయించబడింది. ఒకే దఫా రాత పరీక్ష ఆధారంగా ఎంపిక జరగనుందని అధికారులు తెలిపారు. ఎంపికైన వారికి ప్రారంభ వేతనం నెలకు రూ.35,400గా ఉంటుంది.

PM-KIsan: పిల్లల పేరుపై పొలం ఉన్నా – PM-Kisan లబ్ధి పొందొచ్చా? రూల్స్ క్లియర్!

ఈ నియామక ప్రక్రియలో జోన్లవారీగా ఖాళీలను ప్రకటించారు. ముంబయి జోన్‌లో 44 పోస్టులు, అజ్మేర్‌లో 33, కోల్‌కతాలో 28, బిలాస్‌పూర్‌లో 27, సికింద్రాబాద్‌లో 25, బెంగళూరులో 24, ప్రయాగ్‌రాజ్‌లో 23, ముజఫర్‌పూర్‌లో 21, తిరువనంతపురంలో 19, భువనేశ్వర్‌లో 17, గువాహటిలో 16, అహ్మదాబాద్, రాంచీ జోన్లలో తలా 15, మాల్దాలో 14, జమ్ము-శ్రీనగర్‌లో 10, గోరఖ్‌పూర్‌లో 9, చండీగఢ్‌లో 7, భోపాల్‌లో 6, చెన్నై, పట్నా, సిలిగురిలో తలా 5 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు తమ జోన్‌ ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చు.

Phone Tapping Case: ఫోన్ టాపింగ్ కేసు! రూ.100 కోట్ల పరువు నష్టం దావా!

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయోపరిమితి 20 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు కింద జనరల్‌, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ట్రాన్స్‌జెండర్‌లు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌, దివ్యాంగ అభ్యర్థులు మాత్రం రూ.250 మాత్రమే చెల్లించాలి. ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు ఉంటాయి.

Fire Stations: ఏపీలో మరో శుభవార్త..! 17 కొత్త అగ్నిమాపక కేంద్రాలకు 15వ ఆర్థిక సంఘం గ్రీన్ సిగ్నల్!

ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ సెప్టెంబర్ 15, 2025 నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తుల చివరి తేదీ అక్టోబర్ 14, 2025. దరఖాస్తు ఫీజు చెల్లింపుకు చివరి తేదీ అక్టోబర్ 16, 2025. దరఖాస్తులలో సవరణలు చేయడానికి అక్టోబర్ 17 నుంచి 26 వరకు అవకాశం ఉంటుంది. రైల్వేలో స్థిరమైన కెరీర్‌ను కోరుకునే వారికి ఈ ఉద్యోగాలు గొప్ప అవకాశం కానున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు త్వరగా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి వివరాలు పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Mirais box office: బాక్సాఫీస్ వద్ద మిరాయ్ కలెక్షన్ల సునామీ.. మూడు రోజుల్లోనే!
N-18 road : అమరావతిలో వేగంగా సాగుతున్న N-18 రహదారి పనులు.. భవిష్యత్తు రాజధానికి.. 2.3 కిలోమీటర్ల మేర!
OnePlus Open ఫోల్డబుల్ ఫోన్ లాంచ్! ఫీచర్లు... ధర ఎంతంటే!
Eat food: ఆహారాన్ని గబగబా తింటున్నారా.. ఆరోగ్యానికి ముప్పు.. వైద్యుల హెచ్చరిక!
Pumpkin Seeds: ఈ గింజలు... డయాబెటిస్‌ ఉన్నవారికి అద్భుత ఔషధం! క్యాన్సర్ కు దూరం!
ALERT.. ఈరోజే ITR ఫైలింగ్ చివరి గడువు.. నిర్లక్ష్యం చేస్తే పెనాల్టీ!