బిహార్ ఓటర్ల జాబితాలో సంచలన అవకతవకలు వెలుగుచూశాయి. ఇద్దరు పాకిస్థానీ మహిళల పేర్లు ఓటర్ల జాబితాలో చేరి, వారికి ఓటర్ కార్డులు కూడా జారీ అయినట్టు బయటపడింది.
ఇమ్రానా ఖానమ్ అలియాస్ ఇమ్రానా ఖాటూన్, ఫిర్దోషియా ఖానమ్ అనే మహిళలకు కార్డులు జారీ అయినట్లు హోం మంత్రిత్వ శాఖ విచారణలో తేలింది. ఫిర్దోషియా 1956లో మూడు నెలల వీసాతో, ఇమ్రానా మూడేళ్ల వీసాతో భారత్ వచ్చి, భాగల్పూర్ జిల్లా భికన్‌పూర్‌లో స్థిరపడ్డారు.
ఈ విషయంపై కేంద్ర హోంశాఖ సీరియస్‌గా స్పందించింది. వెంటనే వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. భికన్‌పూర్ డీఎం నావల్ కిషోర్ చౌదరి మాట్లాడుతూ, “పాక్ మహిళల పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నట్టు నిర్ధారించాం. ఫామ్-7 ప్రక్రియ ద్వారా వెంటనే తొలగిస్తాం” అని తెలిపారు.
ప్రస్తుతం ఆ ఇద్దరు వృద్ధులు కావడంతో విచారణకు సహకరించలేకపోతున్నారని సమాచారం. అయితే ఈ ఘటన బిహార్‌లో ఎన్నికల వ్యవస్థపై పెద్ద చర్చకు దారితీస్తోంది.