మంచు కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ కుటుంబ సభ్యులు ఏ విషయం మాట్లాడినా తక్కువ సమయంలోనే వైరల్ అవుతుంది. ఇటీవల, 'దక్ష' సినిమా ప్రమోషన్స్లో భాగంగా మంచు లక్ష్మి సమంత గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.
మంచు లక్ష్మి అమెరికన్ టెలివిజన్ సిరీస్ 'ఈస్ట్ రూబిన్ ఆఫ్ లాస్ ఏంజిల్స్'లో నటించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. అనగనగా ఓ ధీరుడు, గుండెల్లో గోదారి ,చందమామ కథలు, వైఫ్ ఆఫ్ రామ్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఈటీవీలో ప్రసారమైన 'లక్ష్మీ టాక్ షో' ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.
గుండెల్లో గోదారి' చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డును, అలాగే 'చందమామ కథలు' చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నారు.
ప్రస్తుతం మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో 'దక్ష' అనే చిత్రం రూపొందుతోంది. వంశీ కృష్ణ మల్లా దర్శకత్వం వహించిన ఈ సినిమాని మంచు లక్ష్మి, మోహన్ బాబు స్వయంగా నిర్మించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం ఒక మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తుంది.
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మంచు లక్ష్మి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత సమాజంలో పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె అన్నారు. ఈ సందర్భంగా ఆమె ఒక పెద్ద హీరో మాజీ భార్య ఇక్కడ పనిచేస్తోంది. ఆమెతో విడాకులు తీసుకున్న తర్వాత, అంతకు ముందు సైన్ చేసిన చిత్రాలనుండి ఆమెను తొలగించడం జరిగింది. ఎందుకు అని అడిగితే, 'మార్కెట్ లేదు' అని అర్థం పర్థం లేని కారణాలు చెప్పారు. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుందని నేను భావిస్తున్నాను. నేను మళ్ళీ ప్రత్యేకంగా పేరు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను అని మంచు లక్ష్మి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సమంతకు సంబంధించినవి కావచ్చని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు