Schools: అమరావతిలో పాఠశాలలు దత్తత తీసుకున్న సినీ నటి..! విద్యార్థులకు బంగారు భవిష్యత్తు హామీ..!

ఆన్లైన్ కొనుగోళ్లకు సంబంధించిన మెయిల్స్‌ను వెతకడం చాలా మందికి ఇబ్బందిగా మారుతుంది. ఎందుకంటే, ఇన్వాయిస్‌లు, బిల్లులు, ఆర్డర్ ట్రాకింగ్ మెయిల్స్ అన్నీ ఇతర మెయిల్స్‌తో కలిసిపోయి ఉండటం వల్ల వీటిని కనిపెట్టడం సమయం తీసుకుంటుంది. ఈ సమస్యకు పరిష్కారంగా గూగుల్ జీమెయిల్‌లో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.

Nano Banana AI: తస్మాత్ జాగ్రత్త! నానో బనానా శారీ ట్రెండ్‌... యువతికి చేదు అనుభవం!

గూగుల్ ఇప్పుడు ‘Purchases’ అనే ప్రత్యేక ట్యాబ్‌ను జోడించింది. ఇందులో వినియోగదారుల ఆర్డర్ కన్ఫర్మేషన్‌లు, షిప్పింగ్ అప్డేట్స్, డెలివరీ వివరాలు అన్నీ ఒకే చోట కనిపిస్తాయి. ఇప్పటికే ఉన్న ప్యాకేజ్-ట్రాకింగ్ ఫీచర్‌ను మరింత అప్‌గ్రేడ్ చేసి ఈ సౌకర్యాన్ని అందిస్తున్నారు. దీనివల్ల ఒకే ట్యాబ్‌లో అన్ని కొనుగోలు మెయిల్స్ సులభంగా చూడగలుగుతారు.

Environmental cleanliness: పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత.. రైల్వే డీఆర్ఎం!

ఈ ట్యాబ్‌లో 24 గంటల్లో డెలివరీ అయ్యే ఆర్డర్లు ప్రత్యేకంగా హైలైట్ అవుతాయి. అలాగే, సంబంధిత మెయిల్ పైభాగంలో ఆర్డర్ కార్డులు చూపించే అవకాశం కల్పించారు. వీటితో పాటు ‘Arriving Soon’ అనే కార్డులు కూడా కనిపిస్తాయి. ఇవి త్వరలో రానున్న ఆర్డర్లను ముందుగానే చూపించి వినియోగదారులకు సౌలభ్యం కల్పిస్తాయి.

Indain Rupee: డాలర్ తో పోలిస్తే బలపడిన రూపాయి విలువ! ఎంతంటే!

అదేవిధంగా, ‘Promotions’ ట్యాబ్‌లో కొత్త ఫిల్టర్‌ను గూగుల్ జోడించింది. ‘Most Relevant’ అనే ఈ ఫిల్టర్ ద్వారా యూజర్లు ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యే బ్రాండ్ల ఆఫర్లు, అప్డేట్స్ ముందుగా కనిపిస్తాయి. అయితే, ఎవరైనా ఈ ఆప్షన్ వద్దనుకుంటే, ‘Most Recent’ అనే ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవచ్చు. అదనంగా, జీమెయిల్‌లోని nudges ఫీచర్ రాబోయే ఆఫర్లు, డీల్స్‌ను హైలైట్ చేస్తూ యూజర్లకు నోటిఫికేషన్‌లను ఇస్తుంది.

Liquor Scam: మద్యం కుంభకోణం! ఎంపీ మిథున్ రెడ్డి కస్టడీపై సిట్ పిటిషన్!

ఈ కొత్త ఫీచర్లు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్, ఐఓఎస్, వెబ్ ప్లాట్‌ఫారమ్‌లలో దశలవారీగా విడుదల అవుతున్నాయి. రానున్న ఫెస్టివల్ సీజన్ దృష్ట్యా గూగుల్ ఈ మార్పులు వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉండనున్నాయి.

Land's: రైతులకు గుడ్ న్యూస్..! ఇక ఆ భూములు కూడా పట్టా భూములే..! అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్..!
Indigo: ఫ్లైట్ టికెట్ ధర బస్ టికెట్ కంటే తక్కువ.. హైదరాబాద్, విజయవాడ, కడప రూట్లలోనూ! ప్రయాణ తేదీలు ఇవే!
వివేకా కేసు అవినాష్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమేనా? బిగిస్తున్న ఉచ్చు.
Garikipati Comments: నేను ఈ సినిమా చూశా.. మీరూ చూడండి! గరికపాటి వ్యాఖ్యలతో వైరల్ అవుతున్న ఆ తెలుగు సినిమా ఇదే!
Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ ప్రకటన.. రాష్ట్రంలోని అన్ని ఎన్నికల్లో పోటీకి!