Header Banner

కేశినేని నాని ఆరోపణలపై కేశినేని చిన్ని కౌంటర్! 24 గంటల సమయమిస్తా నిరూపించండి.. మాస్ సవాల్!

  Thu May 08, 2025 12:10        Politics

మాజీ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) చేసిన ఆరోపణలపై విజయవాడ తెలుగుదేశం ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) (Kesineni Chinni) కౌంటర్ ఇచ్చారు. రాజ్ కసిరెడ్డితో తనకు పరిచయం ఉందని.. నాలుగుసార్లు ఆయనను కలిశానని గుర్తుచేశారు. ఇద్దరం కలిసి ఒక కంపెనీ పెట్టామని దానిని డెవలప్‌మెంట్ చేద్దామని అనుకున్నామని అన్నారు. ఆ కంపెనీ డెవలప్‌మెంట్‌తో సహా ఆరునెలలు అన్నీ ఖర్చులు తానే పెట్టానని స్పష్టం చేశారు. ఇవాళ(గురువారం) విజయవాడలో తన కార్యాలయంలో కేశినేని చిన్ని మీడియాతో మాట్లాడారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో రాజ్ కసిరెడ్డికి సాన్నిహిత్యం, అతని వ్యవహారాలు చూసి తాను ఆ కంపెనీలో పెట్టిన పెట్టుబడులు కూడా వదిలేసి రాజ్ కసిరెడ్డితో దూరంగా ఉంటున్నానని స్పష్టం చేశారు. కేశినేని నాని జగన్ దగ్గర పాలేరుగా మారి తనపై ఆరోపణలు చేస్తున్నారని ఎంపీ కేశినేని శివనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

ఇది కూడా చదవండి: పాక్‌కు యూకే షాక్‌.. వీసాలపై పరిమితులు! కొత్త నిబంధనల్లో భాగంగా...

 

మద్యం కుంభకోణంలో రూ.3200 కోట్ల లిక్కర్ స్కాం జరిగిందని, అందులో సూత్రధారి తాడేపల్లి ప్యాలెస్‌లో ఉన్న వ్యక్తేనని ఎంపీ కేశినేని శివనాథ్ ఆరోపణలు చేశారు. ఆ ప్యాలెస్‌లో రాజ్ కసిరెడ్డితో సహా నలుగురికే ఎంట్రీ ఉందని విమర్శించారు. ఇటీవల హైదరాబాద్‌లో ఈ లిక్కర్ వ్యవహారం దృష్టి మరల్చడానికి ఐదుగురు సమావేశం అయ్యారని చెప్పారు. అందులో ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, గోవిందప్పతో సహా విజయవాడ పాలేరు కూడా ఉన్నట్టు సమాచారం ఉందని ఆరోపించారు. కేశినేని నానికి చెందిన ఇంటర్నేషనల్, దుబాయ్, అమెరికాలోని రెండు కంపెనీల ద్వారా హవాలా జరిగినట్లుగా వచ్చిన వార్తలను నిగ్గు తేల్చాలని.. అందుకు అవసరమైన ఖర్చు తానే పెట్టుకుంటానని అన్నారు. తన కుటుంబంలో ఐదు, ఆరు కంపెనీలు ఉన్నాయని తెలిపారు. అన్నీ లీగల్‌గానే ఉన్నాయని స్పష్టం చేశారు. విజయవాడ పాలేరుకు చాలా కంపెనీలు ఉన్నాయని, వాటి నిగ్గు కూడా తేల్చండి అంటూ కేశినాని నానిపై కేశినేని శివనాథ్ ఆరోపణలు చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణకు తాను సిద్ధమని ఎంపీ కేశినేని శివనాథ్ సవాల్ విసిరారు. తనపై వస్తున్న ఆరోపణలపై విచారణకు సీబీఐకి లేఖ రాస్తున్నానని అన్నారు. రూ. 3600 కోట్లు దోచేసిన జగన్ రెడ్డి సీబీఐ విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు. కేశినేని నాని, జగన్‌కు 24 గంటలు సమయం ఇస్తున్నాఆ ఆరోపణలను నిరూపించాలని కేశినేని శివనాథ్ మాస్ సవాల్ విసిరారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో వారికి గుడ్ న్యూస్..! తల్లికి వందనం ఎప్పటినుంచంటే..?

 

ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు!

 

పహల్గాం ఘటనపై సోనూ నిగమ్‌ సంచలన కామెంట్స్.. షాకిచ్చిన పోలీసులు..

 

టీడీపీకి తీరని లోటు..! సీనియర్ నేత మాజీ ఎంపీ కన్నుమూత!

 

వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ! అధికారులకు కీలక ఆదేశాలు!

 

జగన్ కు కొత్త పేరు పెట్టిన కూటమి నేతలు! అంతా అదే హాట్ టాపిక్!

 

డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త! ఇకపై ఇంటి నుంచే..

 

షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!

 

నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు

 

పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations