Sabari Express: శబరి ఎక్స్ ప్రెస్ ప్రయాణ వేళల మార్పు! తిరుపతి టైం ఇలా, కొత్త నెంబర్..!

ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం కూటమి ప్రభుత్వం సరికొత్త ప్రారంభం చేసింది. గత ప్రభుత్వం విడుదల చేసిన పాస్ పుస్తకాలపై ఉన్న జగన్ ఫోటోను తొలగించి, ఇప్పుడు రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలను ఇవ్వనుంది. రీసర్వే చేసిన గ్రామాల్లో ఈ పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేయడానికి రెవెన్యూ శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది.

Stamp Duty: ఏపీ ప్రజలకు శుభవార్త! స్టాంపు డ్యూటీ పై భారీ తగ్గింపు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!


ఇక పాత ప్రభుత్వం విడుదల చేసిన పుస్తకాల్లో జగన్ బొమ్మ ఉండటం రాజకీయ వివాదానికి దారి తీసింది. అయితే ఇప్పుడు రాజకీయ నేతల ఫోటోలకే నో చెప్పిన కూటమి ప్రభుత్వం, ఎవరి బొమ్మలు లేకుండా కేవలం రాజముద్రతో రూపొందించిన పాస్‌బుక్స్‌ను అందించనుంది.

India Pakistan: పాకిస్థాన్ విమానాల‌పై నిషేధాన్ని పొడిగించిన భార‌త్‌! ఆగస్టు 24 వరకు..!


ఇక మరోవైపు మామిడి రైతులకు బలమైన ఆర్థిక ఊరట. తోతాపురి మామిడి కొనుగోళ్ల కోసం కేంద్రం ఎంఐఎస్‌ పథకం కింద రూ.130 కోట్లు విడుదల చేసింది. క్వింటాల్‌కు రూ.1,490.73 చొప్పున 1.62 లక్షల టన్నుల మామిడిని కొనుగోలు చేయడానికి అనుమతి ఇచ్చింది. అమ్మక ధర, గరిష్ఠ ధర మధ్య తేడాను 50:50 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్రాలు భరిస్తాయి.

Tirumala Tirupati: టీటీడీ భక్తులకు బిగ్ అప్డేట్! వారికి ఇక నుండి అవి రద్దు!


ఈ మేరకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, కేంద్ర వ్యవసాయ శాఖ డిప్యూటీ కమిషనర్ బినోద్ గిరి లేఖల ద్వారా రాష్ట్రాన్ని సమాచారం అందించారు. రైతుల ఖాతాల్లో డీబీటీ ద్వారా నష్ట పరిహారం చెల్లించనున్నట్లు వెల్లడించారు.
మొత్తంగా చూస్తే, రైతుల భూముల రికార్డుల్లో పారదర్శకత, మామిడి రైతులకు నష్ట పరిహారం – రెండు అంశాల్లోనూ కూటమి ప్రభుత్వం, కేంద్రం కలిసి రైతులకు న్యాయం చేయడంపై స్పష్టత చూపాయి.

Weather Report: విఫా తుఫాన్ ప్రభావం.. ఏపీలో భారీ వర్షాలు! ప్రజలకు అలెర్ట్!
Praja Vedika: నేడు (23/7) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Pension: ఏపీలో పెన్షన్ పథకం పై కీలక నిర్ణయం! వారందరికీ కట్.. మీ పేరు ఉందేమో చెక్ చేసుకోండి!
Model Township: మురికివాడకు మహార్దశ! అదానీ అండతో మోడల్ టౌన్ షిప్ గా మారనున్న ఆ ప్రాంతం!