రైల్వే శాఖ శబరి ఎక్స్‌ప్రెస్‌కు సంబంధించిన కీలక ప్రకటన చేసింది. తెలుగు రాష్ట్రాల మీదుగా తిరువనంతపురం వెళ్లే ఈ రైలును సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌గా అప్‌గ్రేడ్ చేసింది. ఈ మార్పుతోపాటు కొత్త నెంబర్ (20629/20630) కేటాయించింది. అలాగే ప్రయాణ వేళల్లో మార్పులు చేపట్టింది. ఈ కొత్త టైమింగ్స్ సెప్టెంబర్ 29 నుంచి అమల్లోకి రానున్నాయి.
అయ్యప్ప భక్తుల అధిక వినియోగం ఉండే ఈ రైలు ఇప్పటివరకు 17229/17230 నెంబర్లతో నడిచేది. ఇప్పుడు శబరి ఎక్స్‌ప్రెస్‌కు ఉన్న భారీ డిమాండ్ దృష్ట్యా, రైల్వే బోర్డు దానిని సూపర్ ఫాస్ట్‌గా మార్చింది.
కొత్త టైమింగ్స్ ముఖ్యాంశాలు:
తిరువనంతపురం నుంచి: సాయంత్రం 6.45కి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
సికింద్రాబాద్ నుంచి: మధ్యాహ్నం 2.25కి బయలుదేరి, తిరువనంతపురం చేరుకునే సమయం మరుసటి రోజు సాయంత్రం 6.20.
ప్రయాణికుల కోసం సెప్టెంబర్ 29 నుంచి రిజర్వేషన్‌లు ప్రారంభం కానున్నాయి.