హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలు ఎలా ఉంటాయో అందిరికీ తెలిసిందే. ఉదయం, సాయంత్రం వేళల్లో అయితే కొన్ని ప్రధాన సిగ్నళ్ల వద్ద కి.మీ మేర వాహనాలు నిలిచిపోతాయి. ట్రాఫిక్ నరకంలో ఇరుక్కొని వాహనదారులు తీవ్రంగా ఇబ్బందలు పడుతుంటారు. ఈ నేపథ్యంలో నగరంలో వాహనదారులకు ట్రాఫిక్‌ కష్టాలను తొలగించడమే లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ (GHMC) రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు సిద్ధమైంది. ఓల్డ్ సిటీ, హైటెక్‌ సిటీతో పాటు ప్రధాన నగరంలోని పలు ప్రాంతాల్లో తాజాగా.. టౌన్‌ ప్లానింగ్‌ విభాగం క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టింది. ఏ రోడ్డును ఎంత వరకు విస్తరించాలి.. ఎన్నెన్ని నిర్మాణాలను తొలగించాల్సి ఉంటుంది అనే విషయాలను లెక్కిస్తోంది. ఈ ప్రక్రియ కొలిక్కి వచ్చిన అనంతరం టెండరు ప్రక్రియను చేపట్టి పనులు ప్రారంభిస్తామని జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్‌ విభాగం స్పష్టం చేసింది. హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీ రహదారుల్లో ఒకటిగా ఉన్న హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్‌ నుంచి సైబర్‌టవర్స్‌ రోడ్డు వరకు విస్తరణ చేపట్టనున్నారు. ఎన్‌ఐఏ భవనం నుంచి సైబర్‌టవర్స్‌ ఫ్లైఓవర్ వరకు రోడ్డును 120 అడుగుల మేర విస్తరించేందుకు సిద్ధమయ్యారు.

ఇది కూడా చదవండి: ప్రజలకు అప్డేట్.. బైక్ ఉన్నవారు ఇలా చేయాల్సిందే.! కేంద్రం కీలక నిర్ణయం!

ఈ రహదారి పనులను రానున్న నెల వ్యవధిలో పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ఇక హెచ్‌-సిటీ కింద ఓల్డ్ సిటీలో బెంగళూరు జాతీయ రహదారి నుంచి శాస్త్రిపురం జంక్షన్ వరకు అక్కడినుంచి ఇంజిన్‌ బౌలి వరకు రహదారిని 100 అడుగుల మేర విస్తరించాలని భావిస్తున్నారు. అందుకుగాను రూ.543 కోట్ల ఖర్చవుతుందని జీహెచ్‌ఎంసీ అంచనా వేసి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బంజారాహిల్స్‌ రోడ్డు నెబంర్ 1 నుంచి రోడ్డు నెంబర్ 12 మీదుగా, జూబ్లీ చెక్‌పోస్టు కూడలి వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నారు. ఈ మేరకు భూసేకరణలో వేగం పెంచారు. మెుత్తం 306 ఆస్తులను సేకరించాల్సి ఉండగా.. ఇప్పటికే కొన్నింటి కొలతలు తీసుకున్నారు. త్వరలోనే ఈ పనులు కూడా ప్రారంభం కానున్నాయి. కొండాపూర్‌లో మజీద్‌బండ నుంచి హెచ్‌సీయూ రహదారిని కలిపే రోడ్లను 100 అడుగుల మేర విస్తరించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ట్రిపుల్‌ ఐటీ చౌరస్తా, విప్రో జంక్షన్ మధ్యలో ఫ్లైఓవర్ నిర్మాణం ప్రారంభించి.. నియోపొలిస్‌ వద్ద రింగురోడ్డును కనెక్ట్ చేస్తూ పైవంతెన నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. చాంద్రాయణగుట్ట ఎక్స్‌రోడ్డు నుంచి బార్కస్‌కు, బాలాపూర్‌ మెయిన్ రోడ్డు నుంచి మలక్‌పేట సోయెబ్‌ హోటల్, నక్రీపూల్‌బాగ్‌ నుంచి జీహెచ్‌ఎంసీ జోనల్ ఆఫీసు వరకు, తులసినగర్‌ నుంచి గౌస్‌నగర్‌ వరకు రోడ్లను రూ.320 కోట్లతో విస్తరించేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. ఈ రోడ్లు అందుబాటులోకి వస్తే.. ఎలాంటి ట్రాఫిక్ చిక్కులు లేకుండా దూసుకెళ్లిపోవచ్చు.

ఇది కూడా చదవండి: ఏపీ లో నామినేటెడ్ పదవుల జాతర! లిస్ట్ ఇదుగోండి..

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కేంద్ర మంత్రి నిర్మలతో భేటీ.. ఏపీ అభివృద్ధికి సరికొత్త ప్రణాళికలు! రూ.259 కోట్ల అదనపు నిధులు..

నేడు చెన్నైకి సీఎం చంద్ర‌బాబు! మ‌ద్రాస్ ఐఐటీలో జ‌రిగే..

మహిళలకు గుడ్ న్యూస్! ఉచితంగా పొందే అవకాశం మిస్ అవొద్దు.. వెంటనే అప్లై చేయండి!

కలెక్టర్ల సమావేశంలో తెలంగాణ అసెంబ్లీ ఎమ్మెల్యే వ్యాఖ్యల ప్రస్తావన! ఎక్కువ ఖర్చు లేకుండా..

చవక బాబు.. చవక.. విమాన టికెట్ల‌పై 30 శాతం ప్రత్యేక డిస్కౌంట్‌! ఎప్పటి నుంచి అంటే?

కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు.. విషమం.?

ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ప్రజల నుంచి వినతులు రావడంతో.. వారందరికీ బంపరాఫర్!

వల్లభనేని వంశీకి బిగ్ షాక్.. మళ్లీ రిమాండ్ పొడిగింపు.. ఎప్పటివరకంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group