Gold price Today: దేశవ్యాప్తంగా బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. 10 గ్రాముల ధర ఎంత అంటే ?

బంగాళాఖాతంలో మోంథా అనే అతి తీవ్ర తుఫాన్ రూపుదిద్దుకోబోతోంది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం ఈ మధ్యాహ్నం నాటికి వాయుగుండంగా మారనుంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఆదివారం నాటికి తీవ్రమైన వాయుగుండంగా బలపడనుంది. సోమవారం నాటికి నైరుతి మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాత ప్రాంతాల్లో తుఫాన్‌గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) ప్రకటించింది.

Credit Card: ట్రావెల్ క్రెడిట్ కార్డులు..! మీ విమాన ప్రయాణ ఖర్చులు తగ్గించుకునే సులభ మార్గం..!

ఈ తుఫాన్‌కు “మోంథా” అనే పేరు థాయ్‌లాండ్ సూచించింది. థాయ్ భాషలో “మోంథా” అంటే సువాసన లేదా అందమైన పువ్వు అనే అర్థం. తుఫాన్లకు పేర్లు ఇవ్వడం వల్ల వాటిని గుర్తించడం, ట్రాక్ చేయడం సులభమవుతుంది. భారత్, బంగ్లాదేశ్, ఇరాన్, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, సౌదీ అరేబియా వంటి 13 దేశాలు కలసి తుఫాన్ల పేర్లను నిర్ణయించే ప్యానెల్‌లో భాగమని అధికారులు తెలిపారు.

Tirupati: తిరుపతి గ్రేటర్ సిటీగా.. 63 గ్రామాలు నగరంలో విలీనం..! రియల్ ఎస్టేట్, వాణిజ్య, మౌలిక సదుపాయాల బూమ్..!

మోంథా ప్రభావం దక్షిణ భారత రాష్ట్రాలపై గణనీయంగా ఉండనుంది. అక్టోబర్ 27వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. తమిళనాడు తీరప్రాంత జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఏపీ తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Health: ఆరోగ్యంగా ఉండాలంటే టీ కాదు… ఈ డ్రింక్స్ ట్రై చేయండి!

చెన్నై వాతావరణ కేంద్రం ప్రకారం, అక్టోబర్ 26 నుండి 29 వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. చెన్నై, చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయి. ఈ కాలంలో సముద్రం ఉధృతంగా ఉండే అవకాశం ఉండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని ఐఎండీ హెచ్చరించింది.

Chandrababu Naidu: విజయవంతంగా ముగిసిన సీఎం చంద్రబాబు యూఏఈ పర్యటన! వాణిజ్య, లాజిస్టిక్స్, AI నుంచి ఫుడ్ ప్రాసెసింగ్ వరకు.. !

అక్టోబర్ 24 సాయంత్రం నాటికి సముద్రంలో ఉన్న మత్స్యకారులు తీరానికి చేరుకోవాలని అధికారులు ఆదేశించారు. సముద్ర గాలులు తీవ్రంగా వీస్తాయని, తీర ప్రాంతాల్లో అలలు ఉధృతంగా ఉంటాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకుంటూ, అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ బలగాలను సిద్ధంగా ఉంచినట్లు సమాచారం.

Cab Revolution: ఓలా–ఉబర్‌లకు గుడ్‌బై..! కేంద్రం నుంచి ‘భారత్ ట్యాక్సీ’ ఎంట్రీ..!
Vizag: సాగరతీర విశాఖలో బంగారు భవిష్యత్తు..! డేటా సెంటర్లతో రియల్ ఎస్టేట్‌కు రెక్కలు..!
Housing Scheme: ఏపీలో ఆ స్థలాలకు గుడ్‌బై..! ఎన్డీఏ ప్రభుత్వం కొత్త హామీ అమలు దిశగా..! 2026 నాటికి..!
Air India: ఎయిరిండియా విమానానికి తప్పని తిరుగు ప్రయాణం.. ఆకాశంలో సాంకేతిక లోపం.. ప్రయాణికుల్లో టెన్షన్!
World Bank: అమరావతికి వరల్డ్ బ్యాంక్ బంపర్ గిఫ్ట్.. రెండో విడతగా ఫండ్స్!