ఏపీ ప్రభుత్వంలో కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఏర్పడి పది నెలల కాలం పూర్తి అవుతోంది. ఈ సమయంలో మంత్రుల పని తీరు పైన ముఖ్యమంత్రి ఫోకస్ చేశారు. ఇప్పటికే మంత్రులకు ర్యాంకులు ఇస్తున్నారు. సమర్ధవంతంగా పని చేయాలని సూచిస్తున్నారు. ఇదే విధంగా మంత్రుల పేషీలు.. వారి సిబ్బంది పైనా ఫోకస్ చేశారు. ప్రభుత్వం ఏర్పాటైన తొలి రోజుల్లోనే మంత్రులు తమ సిబ్బంది నియామకంలో కీలక సూచనలు చేసారు. కాగా, ఇప్పుడు మంత్రులు ఏరి కోరి తెచ్చుకొని.. విమర్శలకు కారణమవుతున్న వారి పైన కఠిన చర్యలకు సిద్దమయ్యారు. తాజాగా తీసుకున్న నిర్ణయంతో మంత్రుల పేషీల్లో సంచలనంగా మారుతోంది.
ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!
చంద్రబాబు నిర్ణయంతో
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మంత్రులు తమ వ్యక్తిగత.. పేషీ సిబ్బంది విషయంలో ఏ రకమైన విమర్శలకు తావు లేకుండా నిర్ణయాలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. కొందరు మంత్రుల పేషీల్లో సిబ్బంది పైన ఆరోపణలు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం హోం మంత్రి అనిత సిబ్బంది విషయంలో ఆరోపణలు రావటంతో తప్పించారు. ఆ తరువాత మంత్రులు అలర్ట్ అయ్యారు. కొందరు మంత్రుల ఓఎస్డీలు, పేషీ సిబ్బంది పైన విమర్శలు వినిపిస్తున్నాయి. వైసీపీ హయాంలో పని చేసిన వారినే కొందరు మంత్రులు కొనసాగించటం పైన ఫిర్యాదులు అందాయి. అయితే, కీలక శాఖల మంత్రుల వద్ద పని చేస్తున్న కొందరు సిబ్బంది పైన వస్తున్న విమర్శలతో ముఖ్యమంత్రి నివేదికలు కోరారు. వాటి ఆధారంగా చర్యలు తీసుకుంటున్నారు.
కొల్లు ఓఎస్డీ తొలిగింపు తాజాగా మంత్రి కొల్లు ఓఎస్డీ తొలిగింపు వ్యవహారం మంత్రుల వద్ద చర్చగా మారింది. ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వద్ద ఓఎస్‌డీగా పనిచేస్తోన్న రాజాబాబును ప్రభుత్వం పక్కన పెట్టింది. రాజాబాబు గనులశాఖ అధికారి. ఆ శాఖలో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తూ 2024 మార్చి లో పదవీ విరమణ పొందారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయనను కొల్లు రవీంద్రకు ఓఎస్‌డీగా తీసుకోవాలని సంప్రదింపులు జరిగిన సమయంలోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. గనులశాఖలో పనిచేసినప్పుడు ఆయనపై అనేక విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. అలాంటి అధికారిని మంత్రి ఓఎస్‌డీగా ఎలా తీసుకుంటారన్న ప్రశ్నలు వచ్చినా నాడు మంత్రి లెక్కపెట్టలేదు. రాజాబాబే ఓఎస్డీగా కావాలని పట్టుబట్టి మరీ తీసుకున్నారు. ఈ 10 నెలల పాలనలో గనులశాఖ పనితీరు, అప్పీల్ రివిజన్ కేసులపై అనేకానేక ఆరోపణలు వచ్చాయి.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మాజీ మంత్రి హైకోర్టులో షాక్.. ఇక అరెస్టేనా?
జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!
రెండు తెలుగు రాష్ట్రాలకు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్నల్!
వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!
సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..
ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: